మనిషి అన్న తర్వాత ప్రతి ఒక్కరికీ ఏదో ఒక విషయంలో భయం ఉంటుంది. కొందరికి చీకటి అంటే భయం, మరికొందరికి నీళ్లంటే భయం ఉంటుంది. మరి కొందరు.. ఇంట్లో పెద్దవాళ్లకో, ఆఫీసులో బాస్ కో భయపడతారు. ఇది చాలా కామన్. కానీ.. అసలు భయం అంటే మీనింగ్ తెలియని వాళ్లు కూడా ఉంటారు.వారు జీవితంలో ఎవరికీ భయపడరు... దేనికీ భయపడరు. మరి, జోతిష్యశాస్త్రం ప్రకారం భయం లేకుండా.. జీవించే రాశులేంటో చూద్దాం..
చాలా మంది నిర్భయంగా ఉండటాన్ని ఇష్టపడతారు. ఎలాంటి ప్రమాదం ఎదురైనా నవ్వుతూ ఎదుర్కొంటారు. ఎలాంటి తెలియని ప్రదేశంలో అయినా చాలా నమ్మకంగా అడుగులు వేస్తారు. చిన్నతనంలో టీచర్స్ ని కూడా ఇబ్బంది పెట్టే వారు కూడా అవుతారు. ఏ విషయంలోనూ భయం కారణంగా వెనక్కి తగ్గరు. మరి, వారేవరో తెలుసుకుందాం.