
హోలీ పండగ వచ్చేస్తోంది. ఈ ఏడాది మార్చి 14వ తేదీన ఈ పండగను ప్రజలు జరుపుకోనున్నారు. అయితే.. ఈ రోజున మరో ప్రత్యేకత కూడా ఉంది. 2025లో మొదటి చంద్ర గ్రహణం ఈ హోలీ రోజే ఏర్పడనుంది. ఈ గ్రహణం ఉదయం 9:29 గంటలకు మొదలై.. మధ్యాహ్నం 3:29 గంటలకు ముగుస్తుంది.మరి.. హోలీ రోజున ఈ గ్రహణ ప్రభావం.. జోతిష్యశాస్త్రం ప్రకారం 12 రాశులపై పడనుంది.మరి, ఏ రాశివారికి మంచి జరుగుతుందో.. ఏ రాశి వారికి చెడు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
1.మేష రాశి..
మేష రాశివారికి ఈ చంద్ర గ్రహణం పెద్దగా శుభ పలితాలు తీసుకువచ్చేలా కనపడటం లేదు. శుభాలు కలగకపోగా.. ఆర్థిక సమస్యలు తెచ్చే అవకాశం ఉంది. అందుకే డబ్బు సంబంధిత విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. శారీరకంగా కూడా అప్రమత్తంగా ఉండాలి. లేకపోతే గాయాలు అయ్యే ప్రమాదం ఉంది.
2.వృషభ రాశి..
వృషభ రాశివారికి కూడా ఈ చంద్రగ్రహణం పెద్దగా కలిసిరాదు. ఉద్యోగం, వ్యాపారం విషయంలో సమస్యలు రావచ్చు. ఆరోగ్యం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి.ఈ సమయంలో ముఖ్యమైన నిర్ణయాలకు కాస్త దూరంగా ఉండటం మంచిది.
3.మిథున రాశి..
ఈ చంద్ర గ్రహణ సమయం మిథున రాశివారికి బాగా కలిసొచ్చే అవకాశం ఉంది. పెండింగ్ పనులు ఈ సమయంలో పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది.
4.కర్కాటక రాశి...
కర్కాటక రాశి వారికి తల్లి ఆరోగ్యం పై శ్రద్ధ వహించడం అవసరం. అలాగే, భాగస్వామి ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలి. కుటుంబ సంబంధాలలో కొంత ఒత్తిడి ఉండొచ్చు.
5.సింహ రాశి..
సింహ రాశి వారు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ఆర్థికంగా కొన్ని నష్టాలు కలిగే అవకాశం ఉంది, అందుకే ఖర్చులకు కొంత పద్దతిగా వ్యవహరించాలి.
6.కన్య రాశి
కన్య రాశి వారికి ఈ గ్రహణం కొన్ని సమస్యలను తెచ్చిపెట్టవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. వృత్తిపరంగా కొన్ని ఆటంకాలు ఎదురవొచ్చు. కుటుంబ జీవితం కూడా ఒడిదుడుకులను ఎదుర్కొనే అవకాశముంది.
7.తుల రాశి..
తులా రాశి వారికి ముఖ్యమైన పనులను పూర్తి చేసేందుకు మంచి సమయం. ఆర్థికంగా సమస్యలు తొలగే అవకాశముంది. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు.
8.వృశ్చిక రాశి..
వృశ్చిక రాశి వారు కూడా లాభాలను పొందే అవకాశం ఉంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. అలాగే, పెండింగ్ పనులను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుంది. బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
9.ధనస్సు రాశి..
ధనుస్సు రాశి వారు ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. గాయాలు తగిలే అవకాశముంది. పనిలో ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. మానసికంగా కొంత ఒత్తిడిని అనుభవించవచ్చు. పెద్దవారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
10.మకర రాశి..
మకర రాశి వారికి ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం. ముఖ్యమైన నిర్ణయాలు ఈ సమయంలో తీసుకోవడం మంచిది కాదు. అలాగే, వాదనలకు దూరంగా ఉండాలి.
11.కుంభ రాశి..
కుంభ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం ముఖ్యం. ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాల్సి వస్తే బాగా ఆలోచించాకే తీసుకోవడం మంచిది.
12.మీన రాశి..
మీన రాశి వారికి ఈ గ్రహణం మంచి ఫలితాలను అందించొచ్చు. ధన, ఆస్తి సమస్యలు పరిష్కారమవుతాయి. ఉద్యోగంలో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.