Mahalakshmi Rajayogam: జ్యోతిషశాస్త్రంలో మహాలక్ష్మి రాజయోగానికి ఎంతో ప్రాముఖ్యం ఉంది. ఇది సంపద, శ్రేయస్సు, సంతోషాన్ని ఇచ్చే యోగం. ఇది 12 రాశులపై ప్రభావం చూపిస్తుంది. అలాగే 3 రాశుల వారికి మాత్రం విపరీతమైన అదృష్టాన్ని తీసుకురాబోతోంది.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మార్చి 16వ తేదీన మహాలక్ష్మీ రాజయోగం ఏర్పడబోతోంది. దృక్ పంచాంగం ప్రకారం ఆ రోజున ముఖ్య గ్రహాలైన కుజుడు, చంద్రుడు కలిసి ఈ మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తున్నారు. జ్యోతిషంలో ఈ రాజయోగాన్ని సంపదకు సూచికగా పరిగణిస్తారు. ఇది మూడు రాశుల వారికి మాత్రం అత్యంత శుభప్రదమైనది. కుజ, చంద్రుల ఈ శుభ కలయిక ఏ రాశుల వారికి బాగా కలిసివస్తుందో తెలుసుకోండి.
24
వృషభ రాశి
మహాలక్ష్మీ రాజయోగం వృషభ రాశి వారికి ఒక వరమనే చెప్పాలి. వీరికి బాగా కలిసొచ్చే సమయం ఇదే. ఈ రాశివారు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు తమ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు, జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటివరకు అసంపూర్తిగా ఉన్న పనులు త్వరగా పూర్తవుతాయి. మీరు కొత్త ఆస్తి లేదా వాహనం కొనాలని కూడా ఆలోచించవచ్చు.
34
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి కష్టానికి తగిన ప్రతిఫలం అందే కాలం ఇది. కర్కాటక రాశి వారికి కుజ, చంద్రుల ఈ కలయిక కెరీర్‌ను ముందుకు దూసుకెళ్లేలా చేస్తుంది. వ్యాపారం చేస్తున్నవారు ఒక ముఖ్యమైన ఒప్పందాన్ని కుదుర్చుకోవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి గతంలో కంటే బలంగా మారుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా, కుటుంబంలో ఉన్న టెన్షన్లు తీరిపోతాయి. స్నేహితుల సహాయంతో ఆగిపోయిన ప్రాజెక్టులు మళ్లీ పట్టాలెక్కుతాయి.
మకర రాశి వారికి వృత్తి జీవితంలో ఇది స్వర్ణకాలం అని చెప్పుకోవాలి. సమాజంలో ఈ రాశివారి పరపతి పెరుగుతుంది. ప్రజలు వీరి సలహాలను తీసుకునేందుకు ఇష్టం చూపిస్తారు. వీరికి ఏదైనా కోర్టు కేసు లేదా పాత వివాదం ఉంటే, తీర్పు ఈ రాశివారికే అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. ఈ రాశివారు వ్యాపారాన్ని విస్తరించడానికి లోన్ తీసుకోవాలనుకుంటే, అది సులభంగా లభిస్తుంది. మొత్తంగా, మీ డబ్బుకు సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి.