కొత్త దుస్తులను వారంలో ఏ రోజు వేసుకోకూడదు?

First Published Jun 8, 2024, 9:46 AM IST


కొత్త దుస్తులను వారంలో కొన్ని రోజుల్లో  వేసుకోకూడదని జ్యోతిష్యులు చెప్తారు. దీనికి విరుద్దంగా కొత్త దుస్తులను వేసుకుంటే మీరు సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెప్తారు. మరి కొత్త బట్టలను ఏయే రోజు వేసుకోకూడదో తెలుసా?


ఆడవాళ్లు నెలకు ఐదారు సార్లన్నా షాపింగ్ చేస్తుంటారు. ఆఫ్ లైన్ షాపింగే కాకుండా ఆన్ లైన్ షాపింగ్ కూడా చేస్తుంటారు. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు కొత్త దుస్తులను కొనడం, ధరించడాన్ని బాగా ఇష్టపడతారు. కానీ కొత్త దుస్తులను ధరించడానికి కొన్ని శుభకరమైన, అశుభమైన రోజులు ఉన్నాయన్న సంగతి మీకు తెలుసా? అవును జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వారంలో కొన్ని రోజులు కొత్త దుస్తులను వేసుకోకూడదని నమ్ముతారు. అందుకే కొత్త దుస్తులను ఏ రోజుల్లో ధరించకూడదు? ఒకవేళ వేసుకుంటే కలిగే దుష్ప్రభావాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 


3 రోజుల పాటు కొత్త దుస్తులు వేసుకోవద్దు

కొత్త దుస్తులను  వారంలో 3 రోజులు వేసుకోకూడదని నమ్ముతారు. ఒకవేళ మీరు ఈ రోజుల్లో కూడా కొత్త దుస్తులను వేసుకుంటే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు. ఇంతకీ ఏయే రోజు కొత్త దుస్తులను వేసుకోకూడదంటే?

Latest Videos


ఆదివారం కొత్త బట్టలు వేసుకోవద్దు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఆదివారం నాడు కొత్త దుస్తులను వేసుకోకూడదు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి జాతకంలో సూర్య గ్రహం ప్రభావం ఉండొచ్చు. ఇది జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. ఆదివారం  నాడు కొత్త దుస్తులను వేసుకుంటే మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

Image: Getty

మంగళవారం కొత్త దుస్తులు వేసుకోవద్దు

మంగళవారం నాడు కూడా కొత్త దుస్తులను వేసుకోకూడదని జ్యోతిష్యులు చెప్తారు. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి బట్టలు త్వరగా చిరిగిపోతాయని నమ్ముతారు. అలాగే మంగళవారం నాడు కొత్త దుస్తులు ధరిస్తే, అతని స్వభావంలో కోపం పెరిగే అవకాశం ఉందని కూడా జ్యోతిష్యులు చెప్తారు.
 


శనివారం కొత్త బట్టలు వేసుకోవద్దు

వారంలో ఆదివారం, మంగళవారంతో పాటుగా శనివారం నాడు కూడా కొత్త దుస్తులను ధరించకూడదని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల శనిదేవుడికి ఆ వ్యక్తిపై కోపం వస్తుందట. అలాగే శనివారం నాడు కొత్త బట్టలు ధరిస్తే ధననష్టం కలుగుతుందట. అలాగే వ్యక్తి జాతకంలో శని లోపం సంభవించొచ్చని జ్యోతిష్యలు చెబుతున్నారు.
 

click me!