Today Horoscope: ఓ రాశివారు పిల్లల చదువుల విషయంలో ఓ కన్నేసి ఉంచడం మంచిది

First Published Jun 8, 2024, 5:30 AM IST

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology


8-6-2024 శనివారం  మీ రాశి ఫలాలు 

మేషం (అశ్విని , భరణి, కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి శుక్రుడు)
భరణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
కృత్తిక నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- ఆర్థిక పరిస్థితులు దిగజారుతాయి. పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలను చేయాల్సి వస్తుంది. ఇంట్లో వాతావరణం ఒత్తిడిని కలిగిస్తుంది. అనుకోని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపార విస్తరణలో ఆటంకాలు కలుగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.

telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి , మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి  (దినపతి కుజుడు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:-భార్యా భర్తల మధ్య గొడవలు జరుగుతాయి. చిన్ననాటి మిత్రులతో విభేదాలొస్తాయి. వృత్తి, ఉద్యోగులకు పని బాధ్యత పెరుగుతుంది. ఆర్థిక విషయాలు మందకొడిగా ఉంటాయి. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. పిల్లల చదువుల విషయంలో ఓ కన్నేసి ఉంచడం మంచిది. 
 

Latest Videos


telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర ,పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పునర్వసు నక్షత్రం వారికి  (దినపతి కేతువు )

దిన ఫలం:- మిత్రుల నుంచి ఒక ముఖ్యమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. కొత్త పనులను ప్రారంభిస్తారు. ఆదాయం బాగుంటుంది. వ్యాపారం విషయంలో చర్చలు ఫలవంతంగా ఉంటాయి. ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులను కొంటారు. కుటుంబ సభ్యులతో కలిసి ఒక శుభకార్యంలో పాల్గొంటారు. 

telugu astrology


కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి , ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి  (దినపతి చంద్రుడు)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-మొదలుపెట్టిన పనులు ఆగిపోతాయి. ప్రయాణాలు ఇబ్బందులను కలిగిస్తాయి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి. ఉద్యోగులకు అధికారుల ఒత్తిడి పెరుగుతుంది. 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ , ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (దినపతి రాహు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినపతి రవి)

దిన ఫలం:- బంధువుల నుంచి శుభవార్త అందుకుంటారు. మీరు ఇన్నాళ్లుగా అనుకుంటున్న వాహనాన్ని కొనే యోగం ఉంది. ఆర్థికంగా లాభాలను పొందుతారు. వృత్తి వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి. నిరుద్యోగులు కోరుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. 

telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి  (దినపతి కుజుడు) 
చిత్త నక్షత్రం వారికి (దినపతి గురుడు)

దిన ఫలం:- పాత రుణాల వేధింపుల వల్ల మీరు కొత్త రుణాలను చేయాల్సి వస్తుంది. కుటుంబం విషయంలో తొందర పాటు నిర్ణయాలు పెద్ద నష్టానికి దారితీస్తాయి. చేపట్టిన పనుల్లో జాప్యం ఒత్తిడికి దారితీస్తుంది. ఈ రోజు ప్రయాణాలకు దూరంగా ఉండండి. 

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
విశాఖ నక్షత్రం వారికి(దినపతి కేతువు )

దిన ఫలం:- సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అన్నదమ్ముల నుంచి ధనసహాయం పొందుతారు. నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. మొదలుపెట్టిన పనులు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవుతాయి. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగులు ఆనందంగా ఉంటారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. 

telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-య)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:- రుణాల విముక్తి కలుగుతుంది. ఇది మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. డబ్బు విషయ వ్యవహారాలు లాభసాటిగా ఉంటాయి. ఆభరణాలను కొనే అవకాశం ఉంది. చిన్న నాటి స్నేహితులను కలుసుకోవడం ఆనందాన్ని కలిగిస్తుంది. ఉద్యోగులు తమ బాధ్యతలను నెరవేరుస్తారు. నిరుద్యోగులు శుభవార్త వింటారు. 

telugu astrology


ధనుస్సు (మూల,  పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి శుక్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి  (దినపతి రాహు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:- మొదలుపెట్టిన పనులను పూర్తి చేయడానికి బాగా కష్టపడతారు. కానీ కష్టానికి తగ్గ ఫలితాన్ని మాత్రం పొందరు. అన్నదమ్ములతో ఆస్తికి సంబంధించిన గొడవలు అవుతాయి. రుణ భారం ఎక్కువవుతుంది. వ్యాపారంలో పెద్దల సూచనలు, సలహాలు మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగులకు ఈ రోజు చికాకు కలిగిస్తుంది. దైవ చింతన మీ ఒత్తిడిని దూరం చేస్తుంది. 

telugu astrology


మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి(దినపతి కుజుడు)
ధనిష్ఠ నక్షత్రం వారికి  (దినపతి గురుడు)

దిన ఫలం:- ఇంటి వాతావరణం ఒత్తిడిని కలిగిస్తుంది. ఇంట్లో ఒకరినొకరు దూశించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. చేపట్టిన పనులు ముందకు సాగక మానసిక ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. 
 

telugu astrology


కుంభం (ధనిష్ట 3 4, శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి  (దినాధిపతి శని)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినపతి కేతువు )

దిన ఫలం:-మీరు చేపట్టిన ప్రతి పనీ సకాలంలో పూర్తవుతుంది. నూతన వస్తు, వాహనాలను కొనే యోగం ఉంది. కుటుంబంతో శుభకార్యాల్లో పాల్గొంటారు. స్నేహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగుల మద్య సఖ్యత బాగుంటుంది. 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు (దీ-దూ- ఝ-దా-దే-దో-చా-చ)
దినాధిపతులు
ఉ.భాద్ర  నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
రేవతి నక్షత్రం వారికి (దినపతి బుధుడు)

దిన ఫలం:-ఇంట్లో ఒక కొత్త శుభకార్యం చేస్తారు. రాజకీయంలో ఉన్నవారు పదోన్నతి పొందుతారు. స్నేహితులతో ఉన్న వివాదాలు ఒకరి సహాయంతో పరిష్కారమవుతాయి. వ్యాపారాలు బాగా కష్టపడి మంచి లాభాలను పొందుతారు. 
 

click me!