మన పురాణాలు గ్రంథాలు మనకు చాలా విషయాలు చెబుతూ ఉంటాయి. ఏ పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది.. ఏవి చెడు చేస్తాయి లాంటి విషయాల గురించి గ్రంథాల్లో ఏనాడో వివరించారు. వాటిల్లో కొన్ని అలవాట్లు కూడా ఉన్నాయి. గ్రంథాల ప్రకారం.. కొన్ని తప్పుడు అలవాట్లు ఉన్నాయి. వాటిని మనం మన జీవితంలో అలవరుచుకుంటే.. చెడు ప్రభావాలను ఎక్కువగా చూడాల్సి వస్తుంది అని జోతిష్యశాస్త్రం కూడా చెుతుంది.
మన శరీరంలోని అన్నిభాగాలు ఏదో ఒక గ్రహంతో అనుసంధానం అయ్యి ఉంటాయట. అలాంటి పరిస్థితిలో మన శరీరం ఏదైనా పని చేసినప్పుడు.. దాని ప్రభావం గ్రహాల మీద పడుతుంది. మనం చేసిన పని మంచిది అయితే.. గ్రహాలు బలపడటం.. చెడు పని అయితే.. గ్రహాలు బలహీన పడుతూ ఉంటాయి. వాటి ఆధారంగానే మన జీవితంలో శుభ, అశుభ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఇదంతా పక్కన పెడితే.. మనలో చాలా మందికి కాలు మీద కాలు వేసుకొని కూర్చునే అలవాటు ఉంటుంది. జోతిష్యశాస్త్రం ప్రకారం.. అది మంచిదా కాదా.? దాని వల్ల మనకు శుభం జరుగుతుందా..? అశుభం కలుగుతుందా..? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం...
మన పాదాల్లో శనిదేవుని స్థానం ఉంటుందట. అంటే.. మన పాదాలలో ఏదైనా సమస్య వచ్చినా.. లేదా.. పాదాలకు సంబంధించిన ఏదైనా వ్యాధి మనల్ని చుట్టుముట్టినట్లయితే... శని జాతకంలో బలహీనంగా ఉన్నాడని అర్థమట. అది మనకు దుష్పలితాలను కలిగిస్తుందని అర్థమట.
అదే సమయంలో కాళ్లు పట్టుకుని కూర్చోవడం వల్ల శని గ్రహం దిశలో మార్పు వస్తుందని, పై స్థానంలో ఉన్న శని గ్రహం కిందికి వెళ్లడం ప్రారంభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. అందుకే.. వీలైనంత వరకు కాలు మీద కాలు వేసుకొని కూర్చోకూడదట.
కాలుమీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల.. శనిదోషం ఏర్పడి.. గృహ శాంతికి భంగం కలుగుతుందట. అందుకే.. కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం వల్ల. ఇంట్లో దరిద్రం వస్తుందని నమ్ముతారరు. ఇంట్లోకి లక్ష్మీదేవి రాక కూడా ఆగిపోతుందని.. సంపద తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.