Donate old Clothes: మీరు వాడేసిన పాత బట్టలు ఎప్పుడు దానం చేయాలి? నియమాలు తెలుసుకోండి

Published : Oct 26, 2025, 09:53 AM IST

Donate old Clothes: హిందూమతంలో ఎన్నో నమ్మకాలు ఉన్నాయి. వాటిలో పాత బట్టలను దానం చేయడం కూడా ఒకటి. పాత దుస్తులను అవసరమైన వారికి దానం చేయడం అనేది పుణ్యకార్యంగా చెబుతారు. అయితే దీనికి కొన్ని నియమాలు ఉన్నాయి. 

PREV
15
పాతబట్టలను దానం చేయడం

మీరు మీ పాత బట్టలను దానం చేయాలనుకుంటే ముందుగా వాటిని శుభ్రంగా ఉతకండి. జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం మురికిగా ఉన్న బట్టలను ఎప్పుడూ దానం చేయకూడదు. అలాంటి మురికి దుస్తులను దానం చేయడం వల్ల మీకు వచ్చే పుణ్యం కన్నా పాపమే అధికంగా ఉంటుంది. అంతేకాదు మాసిపోయిన బట్టలను దానం చేయడం వల్ల ఆర్థికమైన సమస్యలు పెరిగిపోతాయి. ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి శుభ్రమైన దుస్తులను మాత్రమే దానం చేయండి.

25
ఇలా ఉతికి

దానం చేసే ముందు పాత దుస్తులను సాదా నీటితో కాకుండా ఆ నీటిలో ఉప్పు వేయండి. ఆ ఉప్పులో ఈ బట్టలను వేసి శుభ్రంగా ఉతకండి. ఇలా ఉప్పును వేసి ఉతకడం వల్ల ప్రతికూల శక్తి పోతుంది. దుస్తులు శుద్ధి అవుతాయి. ఇక ఉతికిన తర్వాత ఆ బట్టలను ఆరబెట్టండి. తర్వాత గంగాజలాన్ని చల్లి పవిత్రంగా మార్చండి. ఇలా చేయడం వల్ల ఆ బట్టలకు దైవిక శక్తి వస్తుంది. ఇలా శుద్ధి చేయకుండా దానం చేస్తే మీకు వచ్చే ఫలితాలు చాలా తక్కువ.

35
చిరిగిన దుస్తులు ఇవ్వకూడదు

జ్యోతిష్య శాస్త్రం చెబుతున్న ప్రకారం పాత దుస్తులను దానం చేస్తే పుణ్యమే.. కానీ చిరిగిన దుస్తులను మాత్రం దానం చేయకూడదు. అది మహా పాపంగా మారుతుంది. మీరు చిరిగిన దుస్తులను దానం చేస్తే అవసరంలో ఉన్న వారిని అవమానించినట్టే జరుగుతుంది. దీనివల్ల మీ జీవితంలో గొడవలు, ఆర్థికపరమైన నష్టాలు, మానసిక ఒత్తిడి వంటివి పెరిగిపోతాయి. శుభ్రంగా ధరించగలిగే స్థితిలో ఉన్నా దుస్తులను మాత్రమే దానం చేయండి. ఇది మీకు పుణ్యం, గౌరవం దక్కేలా చేస్తుంది.

45
శనివారం దానం చేస్తే

పాత బట్టలు దానం చేయడానికి కొన్ని రోజులు ముఖ్యమైనవి. ప్రధానంగా అమావాస్య, పౌర్ణమి శనివారం నాడు దానం చేస్తే మంచి ఫలితాలు దక్కుతాయి. శనివారం మీరు నల్లటి బట్టలు, దుప్పట్లు దానం చేస్తే ఇంకా శుభప్రదం. దీనివల్ల శని దేవుడు కూడా సంతోషిస్తాడు. మీ జీవితంలోని అడ్డంకులను తొలగిస్తాడు. స్నానం చేసేటప్పుడు మీరు సంతోషంగా చేయాలి. అప్పుడే దేవతలు అనుగ్రహిస్తారు. మీరు ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు. దానం అనేది ఒక చర్య కాదు.. అది మనసులోని స్వచ్ఛతను చూపించేది. కాబట్టి అహంకారం వంటివి చూపించకుండా, అయిష్టంగా కాకుండా, దానం చేస్తున్నప్పుడు మనస్ఫూర్తిగా దానం చేస్తే ఎంతో మంచిది.

55
దక్కే ఫలితాలు ఇవే

దుస్తులను సరైన పద్ధతిలో దానం చేయడం వల్ల మీకు ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యం దక్కుతాయి. కుటుంబంలో సామరస్యత ఉంటుంది. ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. మీలోనే మీ కుటుంబంలోని మీ ఇంట్లో అని ప్రతికూల శక్తి తొలగిపోతుంది. గ్రహాలు అన్ని అనుకూలంగా మారుతాయి. సామాజిక గౌరవం పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories