Kalki: కల్కిగా విష్ణువు ఎప్పుడు, ఎక్కడ జన్మిస్తాడు? అతని తల్లిదండ్రులు ఎవరు?

Published : Apr 30, 2026, 03:50 PM IST

Kalki: కల్కి.. విష్ణుమూర్తి పదవ అవతారంగా చెప్పుకుంటారు. అదే చివరి అవతారం అని కూడా అంటారు. అయితే కల్కి అవతారంగా విష్ణువు జన్మించేది ఎప్పుడో, అతని తల్లిదండ్రులు ఎవరు, ఆయన ఎక్కడ జన్మిస్తాడు వంటి వివరాలు తెలుసుకోండి. 

PREV
14
కల్కిగా విష్ణువు

హిందూ ధర్మ శాస్త్రాల ప్రకారం విష్ణుమూర్తి మొత్తం పది అవతారాలు ఎత్తుతాడని నమ్మకం. అందులో చివరి అవతారమే కల్కి. ఈ అవతారం ఇంకా భవిష్యత్తులో రావాల్సి ఉందని పురాణాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మనం కలియుగంలో ఉన్నాము. ఈ యుగం చివరికి వచ్చేసరికి కల్కి అవతారంగా విష్ణువు భూమిపై జన్మిస్తాడని చెబుతారు. ఆ అవతారం రావడానికి ఇంకా సమయం పడుతుంది. కలియుగంలో చెడు శక్తులు అంతమయ్యే కాలం దగ్గరికి వచ్చినప్పుడే కల్కి అవతారం భూమిపై అడుగుపెడుతుంది.

24
కల్కి తల్లిదండ్రులు ఎవరు

పురాణాలు చెబుతున్న ప్రకారం శంభాల అనే గ్రామంలో కల్కి అవతారంలో విష్ణువు జన్మిస్తాడు. అతని తండ్రి పేరు విష్ణు యశువు. అతను ఒక బ్రాహ్మణుడని పురాణాలు చెబుతున్నాయి. ఇక తల్లి పేరు సుమతి. చిన్నప్పటి నుంచే ఆ గ్రామంలో కల్కి విద్యాశాస్త్రాలు నేర్చుకుంటాడు. యుద్ధ విద్యలో కూడా శిక్షణ పొందుతాడు. అతడికి దేవతల ఆశీర్వాదం పుష్కలంగా ఉంటుంది. శక్తివంతమైన ఆయుధాలు ఎన్నో దేవతలు అతనికి అందిస్తారు. ముఖ్యంగా కల్కి ఒక తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ ఖడ్గంతో యుద్ధం చేస్తాడని పురాణాల్లో వివరించారు. కలియుగంలో ధర్మం తగ్గిపోయి అబద్ధాలు, అన్యాయం, హింసా వంటి చెడు లక్షణాలు విపరీతంగా పెరిగిపోయి మనుషుల జీవన విధానం మారిపోతుంది. ఆ పరిస్థితుల్లోనే కల్కి అవతారం అవసరం పడుతుంది. చెడు శక్తులను నాశనం చేయడానికి, ఈ ప్రపంచాన్ని శుభ్రం చేయడానికి కలిపి అవతారం ఎత్తుతాడని పురాణాలు చెబుతున్నాయి.

34
ఎందుకు ఈ అవతారం?

కల్కి అవతారం ప్రధాన లక్ష్యం ఒక్కటే ధర్మాన్ని కాపాడడం. అతను దుష్టులను శిక్షించి మంచివారిని రక్షిస్తాడు. చెడు పాలకులు, దొంగలు, అన్యాయం చేసే వారి అందరినీ నిర్మూలిస్తాడని పురాణాల వివరణ. దీనివల్ల ప్రపంచం మళ్ళీ పవిత్రంగా మారుతుంది. కలియుగం తర్వాత మరొక కొత్త యుగం ప్రారంభమవుతుంది. అదే సత్య యుగం. ఈ యుగంలో నిజం, ధర్మం, శాంతి ప్రధానంగా ఉంటాయి. కల్కికి చెడును అంతమొందించేందుకు అశ్వత్థామ, హనుమంతుడు సాయం చేస్తారని పురాణాలు వివరిస్తున్నాయి.

44
ఇచ్చే సందేశం ఇదే

కల్కి అవతార కథ మనకు ఇచ్చే సందేశం ఒక్కటే. ఎప్పుడైనా చెడు అంతం అవ్వాల్సిందే.. చెడును అంతం చేయడానికి ఏదో ఒక రూపంలో మంచి అవతారం ఎత్తుతుంది. ఇది భవిష్యత్తుపై ఆశను పెంచే కథగా భావించవచ్చు. పురాణాల్లో చెప్పిన నమ్మకాలు, విశ్వాసాలగానే కల్కి గాథ అయినప్పటికీ.. వాస్తవంగా చూసుకున్నా కూడా ఎప్పటికైనా కూడా మంచి మార్గమే చరిత్రలో నిలిచిపోతుంది. చెడు అంతమవక తప్పదు.

Read more Photos on
click me!

Recommended Stories