Vrushabha Rashi Phalalu: 2026వ సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది?

Published : Dec 04, 2025, 05:18 PM ISTUpdated : Dec 04, 2025, 05:28 PM IST

Vrushabha Rashi Phalalu: కొత్త ఏడాదిలో ఎన్నో కొత్త ఆశలతో అడుగు పెడతాము. జ్యోతిషపరంగా కూడా ఒక్కో రాశికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందామా. ఈరోజు వృషభ రాశి వారి 2026 రాశి ఫలితాలను అందించాము. 

PREV
15
వచ్చే ఏడాది ఎప్పుడు కలిసివస్తుంది?

2026వ సంవత్సరంలో శని దేవుడు మీనరాశి 11వ ఇంట్లో ఉంటాడు. ఇక రాహువు కుంభరాశిలో 10వ ఇంట్లో ఉంటాడు. సంవత్సరంలో మొదటి ఆరు నెలల్లో బృహస్పతి మిధున రాశి రెండవ ఇంట్లో ఉండబోతున్నాడు. ముఖ్యమైన గ్రహాల కదలికలు రాశులపై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. ఇక వృషభ రాశి వారికి వృత్తి జీవితంలో అద్భుతంగా సాగుతుంది. వీరి పని సామర్థ్యం మెరుగుపడుతుంది. అలాగే వీరు ఉద్యోగపరంగా విజయం సాధించేందుకు సోదరులు సహకారం అందిస్తారు. ఉన్నతాధికారుల నుంచి లేదా మీ సీనియర్ల నుంచి మీకు పూర్తి సహకారం అందుతుంది. అలాగే కార్యాలయంలో తగిన గౌరవాన్ని పొందుతారు. ముఖ్యంగా జూన్ 02 తర్వాత మీ వృత్తి ప్రదేశంలో లాభాలు అధికంగా కలుగుతాయి. ఇక భాగస్వామ్యంతో వ్యాపారాలు చేస్తున్న వారికి లాభాలు వస్తాయి. భూ సంబంధిత పనులు అక్టోబర్ 31 తర్వాతే లాభాలను అందిస్తాయి. ఉద్యోగంలో బదిలీ కావాలనుకునే వారికి కూడా అక్టోబర్ 31 తర్వాత బాగా కలిసి వస్తుంది.

25
సంపద, ఆస్తిపరంగా ఎలా ఉంటుంది?

వృషభ రాశి వారికి ఆర్థికపరంగా 2026వ సంవత్సరం కలిసి వస్తుంది. మొదటి ఆరు నెలలు శుభప్రదంగా ఉంటుంది. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. అలాగే పొదుపును కూడా చేస్తారు. రెండవ ఇంట్లో గ్రహప్రభావం అధికంగా ఉంటుంది. కాబట్టి ఆభరణాలను కొనే అవకాశం ఉంది. ఎనిమిదవ ఇంట్లో గురువు శని ఇద్దరి మిశ్రమ కోణం సంబంధంగా అత్తమామల నుండి లేదా పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జూన్ 02 తర్వాత శనిపై బృహస్పతి ప్రభావం ఉంటుంది. కాబట్టి అకస్మాత్తుగా సంపద వచ్చి పడుతుంది. ఇక అక్టోబర్ 31 తర్వాత భూమి, ఇల్లు, వాహనం వంటి సౌకర్యాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి.

35
కుటుంబంలో సంతోషం ఉంటుందా?

వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ప్రారంభం నుంచి శుభప్రదంగా ఉంటుంది. రెండవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల మీ కుటుంబంలో ఒక సభ్యుడు అదనంగా చేరుతారు. అలాగే కుటుంబ సభ్యులు ఒకరికొకరు గౌరవాన్ని ప్రేమను పంచుకుంటారు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములు అక్కచెల్లెల మధ్య పూర్తి సహకారం ఉంటుంది. కాకపోతే నాలుగో ఇంట్లో కేతు ఉండడం వల్ల కుటుంబంలో చిన్నపాటి అలజడలు రావచ్చు. కానీ గట్టిగా ప్రయత్నిస్తే కుటుంబంలో శాంతి తిరిగి నెలకొంటుంది. జూన్ 02 తర్వాత సొసైటీలో మంచి హోదాలో చేరుకుంటారు. మంచి పేరును తెచ్చుకుంటారు. మీ పిల్లల పురోగతి కూడా బావుంటుంది. వారు చదువులపై ఆసక్తి చూపిస్తారు.

45
ఆరోగ్యం ఎలా ఉంటుంది?

ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో ఆరోగ్యం చక్కగానే ఉంటుంది. శారీరకంగా, మానసికంగా శక్తి సామర్ధ్యాలతో పనిచేస్తారు. సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు. ఇక బృహస్పతి మీకు అనుకూలంగా ఉంటాడు. కాబట్టి ఆరోగ్యం విషయంలో మీ జీవితం సాఫీగా సాగుతుంది. అయితే బృహస్పతి సంచారం ముగిసిన తర్వాత చిన్న చిన్న వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కొంచెం నీరసంగా అనిపించడం, ఆహారపు అలవాట్లు మారడం వంటివి కనిపిస్తాయి. కాబట్టి ఉదయం పూట వ్యాయామం, యోగాభ్యాసం చేయడం మంచిది.

55
కెరీర్ ఎలా ఉండబోతోంది?

వృషభ రాశి వారికి కెరీర్లో ఆకస్మిక మార్పులు కలగవచ్చు. అలాగే కొత్త కొత్త ఆలోచనలు వచ్చి మీకు ముందుకు నడిపిస్తాయి. ఇవి మీకు మొదట్లో అంతరాయం కలిగించేలా అనిపించినా కూడా ఆ ఆలోచనలను స్వీకరించండి. ఎందుకంటే ఈ ఆలోచనలే మీకు దీర్ఘకాలిక విజయానికి పునాది వేసే అవకాశం ఉంది. మీ లక్ష్యాన్ని సాధించడానికి దానిపై దృష్టి సంకల్పం ఉండడం చాలా ముఖ్యం. తెలివిగా పనులను చేస్తే మీ కెరీర్ 2026లో అద్భుతంగా సాగుతుంది.

కలిసొచ్చే రంగులు

వృషభ రాశి వారికి 2026 సంవత్సరంలో ఆకుపచ్చ, నీలం రంగులు కలిసి వస్తాయి. ఇక అదృష్ట సంఖ్యలుగా 3,7,21 గా చెప్పుకుంటారు. ఇక కలిసి వచ్చే ఆంగ్ల అక్షరాలు T,R. మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠిస్తే ఎంతో మేలు జరుగుతుంది. అలాగే బుధవారం నాడు ఓం గణపతయే నమః అని జపిస్తే మంచిది. ధర్మాలు చేయడం, మతపరమైన పనులు చేయడం, పేదలకు విరాళాలు ఇవ్వడం వంటి పుణ్యకారాలు చేస్తే మీకు మానసిక శాంతి లభిస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories