ఈ రాశివారు పైకి కనిపించేదొకటి.. మనసులో మరొకటి..

Published : May 09, 2022, 11:47 AM IST

కొంతమంది పైకి ఎలా కనిపిస్తారో.. మనసులో దానికి పూర్తి వ్యతిరేకంగా ఉంటారు. ఆ లక్షణాలు ఏంటో.. ఏ రాశివారు ఎలా భావిస్తారో.. చూడండి. 

PREV
112
ఈ రాశివారు పైకి కనిపించేదొకటి.. మనసులో మరొకటి..

 Aries

మేషరాశి (Aries) : తమని తాము అస్సలు నమ్మరు. తామెంత సమర్థులో వారిమీద వారికి నమ్మకం ఉండదు. తమలోని నైపుణ్యం, సమర్థతల మీద అంచనా ఉండదు. 

212

వృషభరాశి ( Taurus) : పరిస్థితి తమ చేయి దాటిపోయినప్పుడు, లేదా పరిస్థితులు అనుకూలంగా లేవు, భయంకరంగా ఉన్నాయనుకున్నప్పుడు  పూర్తిగా కామ్ అయిపోతారు. 

312

మిధునరాశి ( Gemini) : వీరు సోషల్ పర్సన్ గా ఉంటారు. నలుగురిలో తిరగడం.. పదిమందిలో కలిసిపోవడం వీరి తత్వం. అయితే రహస్యంగా వీరు మాత్రం ఒంటరిగా ఉండాలని, ఏకాంతంగా గడపాలని అనుకుంటారు. 

412

కర్కాటకరాశి ( Cancer) : తాము ఎలాంటి ప్రయత్నం చేయకుండా తమ సంబంధాలేవీ నిలవని భావిస్తారు. బంధాలకు తాము మాత్రమే ప్రాధాన్యతనిస్తాననుకుంటారు. 

512

సింహరాశి (Leo) : వీరికి అందం పరంగా అభద్రత చాలా ఎక్కువ. తాము సరిగా కనిపించడం లేదని, అందంగా లేనని ఫీలవుతుంటారు. 

612

కన్యారాశి ( Virgo) : ఏదైనా పనిలో విఫలం అయితే.. తామెందుకూ పనికిరామని, రూపాయికి కొరగామని, ప్రతీదాంట్లోనూ ఓడిపోవడమే కానీ గెలవడం ఉండదని ఫీలవుతారు. 

712

తులారాశి ( Libra) : తాము ఇతరులను ఎంతగా ప్రేమిస్తామో.. వారు తమను అంతగా ప్రేమించరని రహస్యంగా ఫీలవుతుంటారు. 

812

వృశ్చికరాశి ( Scorpio) : ప్రపంచానికి ఎదురొడ్డి ఒంటరిగా పోరాడుతున్నామని భావిస్తారు. తమ వైపు ఎవరూ లేరని తాము ఒంటరి పోరాట యోధులమని అనుకుంటారు. 

912

ధనుస్సురాశి  ( Sagittarius) : తమ మీద తమకు అస్సలు విశ్వాసం ఉండదు. అందుకే ప్రతీదానికి ఇతరుల మీద ఆధారపడుతుంటారు. వారిని ప్లీజ్ చేయడానికి ప్రయత్నిస్తారు. 

1012

మకరరాశి ( Capricorn) : వీరు ప్రతీసారి ఒక పాయింట్ దగ్గర ఆగిపోతారు. తాము అన్నీ కోల్పోయామని తమకు ఏదీ దక్కదని ఫీలవుతుంటారు. 

1112
Representative Image: Aquarius

కుంభరాశి (Aquarius) : ప్రపంచం మొత్తం తమ చుట్టూ తిరుగుతుందని నమ్ముతారు. తాము లేకపోతే ప్రపంచం నడవదని ఫీలవుతుంటారు. 

1212

మీనరాశి ( Pisces) : సున్నితమనస్కులైనవారితో కలవడం వీరికి చాలా సమస్యగా ఉంటుంది. వారు తమను సరిగా అర్థం చేసుకోలేరని.. తాము వారితో కలవలేమని భావిస్తారు.

click me!

Recommended Stories