Dream Astrology: కలలో ఎవరో వెంబడిస్తున్నట్లు కనిపిస్తే అర్థం ఏంటో తెలుసా?

Published : Mar 17, 2026, 04:21 PM IST

ఎవరో వెంబడిస్తున్నట్లు కల వచ్చి, భయంతో నిద్ర లేచిన అనుభవం చాలామందికి ఉంటుంది. నిజానికి ఇలాంటి కలలు ఆందోళనకు గురిచేస్తాయి. మనసులో ఒక రకమైన భయాన్ని నింపుతాయి. స్వప్న శాస్త్రం ప్రకారం, ఇలాంటి కలల వెనుక కొన్ని సంకేతాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. 

PREV
15
Chasing Dream Meaning

మనం నిద్రలో ఉన్నప్పుడు రకరకాల కలలు వస్తుంటాయి. కానీ కొన్ని మాత్రమే మనకు గుర్తుండిపోతాయి. అలా నిద్రలో ఎవరో వెంబడిస్తున్నట్లు కలవస్తే.. చాలామంది ఉలిక్కిపడి లేస్తుంటారు. స్వప్న శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ కలకు లోతైన అర్థం ఉంది. ఒక వ్యక్తి కలలో ఎవరో తన వెంటపడుతున్నట్లు అనిపిస్తే, నిజ జీవితంలో ఏం జరుగుతుందో ఇక్కడ చూద్దాం.

25
రాహు, శని ప్రభావంతో..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రకమైన కలలు గ్రహాల ప్రభావంతో కూడా సంబంధం కలిగి ఉంటాయి. ముఖ్యంగా శని, రాహు ప్రభావం ఉన్నప్పుడు ఈ తరహా కలలు ఎక్కువగా వస్తాయట. శని గ్రహం ఒక వ్యక్తి జీవితంలో కష్టాలు, పరీక్షలు, బాధ్యతలను సూచిస్తే, రాహువు మాయ, భయం, అనిశ్చితిని సూచిస్తాడు. ఈ రెండు గ్రహాల ప్రభావం ఉన్నప్పుడు వ్యక్తి మనసులో తెలియని భయాలు పెరిగి, అవి కలల రూపంలో బయటపడతాయని పండితులు చెబుతున్నారు.

35
అణచివేసిన భావోద్వేగాలకు సంకేతం

స్వప్న శాస్త్రం ప్రకారం ఎవరో వెంబడిస్తున్నట్లు కల రావడం అనేది మనలోని అణచివేసిన భావోద్వేగాలకు సంకేతం. మనం రోజువారీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలను వెంటనే పరిష్కరించకుండా వదిలేస్తే, అవి మన అవచేతన మనస్సులో నిలిచిపోతాయి. రాత్రి నిద్రలో అవి కలల రూపంలో బయటపడతాయి. ముఖ్యంగా భయపడుతూ పరుగెత్తడం, దాక్కోవడం వంటివి కనిపిస్తే, నిజ జీవితంలో ఒక పరిస్థితిని ఎదుర్కొనే ధైర్యం మనకు లేదని అర్థం. లేదా దాని నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నామని అర్థం.

45
ఈ పనులు చేస్తే..

పండితుల ప్రకారం ఈ రకమైన కలలను తేలికగా తీసుకోకూడదు. ఇవి మన జీవితంలో ఏదో అసమతుల్యత ఉందని సూచించే సంకేతాలు. ఈ తరహా కలలు తరచుగా వస్తే, మనం మొదటగా మన మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి. ధ్యానం, ప్రార్థన, యోగా వంటివి మనలోని భయాలను తగ్గించడంలో సహాయపడతాయి. అలాగే నిద్రకు ముందు నెగెటివ్ ఆలోచనలను దూరంగా ఉండటం మంచిది.

55
కలలో తెలిసిన వ్యక్తి వెంబడిస్తే..

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఎవరు వెంబడిస్తున్నారో కూడా దాని అర్థాన్ని ప్రభావితం చేస్తుంది. తెలియని వ్యక్తి వెంబడిస్తే అది సాధారణ భయాలకు సూచన. తెలిసిన వ్యక్తి వెంబడిస్తే, ఆ వ్యక్తితో ఉన్న సంబంధంలో ఏదో సమస్య ఉందని అర్థం చేసుకోవచ్చు. జంతువులు వెంబడిస్తే అది మనలోని కోపం లేదా భయం వంటివి నియంత్రణలో లేవని అర్థం.

Read more Photos on
click me!

Recommended Stories