Vastu Tips: అనుకోని సమస్యలతో బాధపడేవారు చాలా మంది ఉంటారు. ఇంట్లో ఎప్పుడూ గొడవలు, ఆర్థిక సమస్యలతో కనుక మీరు ఇబ్బంది పడుతుంటే..కేవలం గుర్రపు నాడాతో వాటికి చెక్ పెట్టొచ్చు.
భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి ఏదో ఒక సందర్భంలో సమస్యలు వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలన్నీ తలుచుకొని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కొన్నిసార్లు మన జీవితంలో సమస్యలు రావడానికి, వాస్తు దోషం కూడా కారణం కావచ్చు. వాస్తు మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందుకే.. కొన్ని పొరపాట్ల కారణంగా ఇబ్బందుల్లో పడుతూ ఉంటాం. అలాంటి సమస్యలన్నింటి కి కేవలం ఒకే ఒక వాస్తు మార్పుతో చెక్ పెట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం...
25
గుర్రపు నాడా ప్రాముఖ్యత....
వాస్తు శాస్త్రం ప్రకారం, గుర్రపు నాడాను చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. దీనిని ఇంటి గుమ్మం దగ్గర ఉంచడం వల్ల ఇంట్లో పాజిటివిటీ పెరుగుతుంది. అదృష్టం కూడా పెరుగుతుంది.
35
ఆర్థిక సమస్యలకు పరిష్కారం....
మీ జీవితంలో ఆర్థిక సమస్యలు చాలా ఎక్కువగా వస్తూ ఉంటే, గుర్రపు నాడా మీకు చాలా ప్రయోజకరంగా ఉంటుంది. దీని కోసం, మీరు చేయాల్సిందల్లా... గుర్రపు నాడాను ఎర్రటి వస్త్రంలో చుట్టి ఉంచాలి. దీనిని మీ ఇంట్లో డబ్బు ఉంచే ప్రదేశంలో దీనిని ఉంచాలి. ఇలా ఉంచడం వల్ల లక్ష్మీ కటాక్షం కలుగుతుందని, ఇంటికి శుభం కలుగుతుందని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల ... జీవితంలో ధన ప్రవాహం పెరుగుతుంది.
చాలా సంవత్సరాలుగా కష్టపడి పని చేసినా.. మీకు ఉద్యోగంలో గుర్తింపు రావడం లేదని ఫీలౌతున్నారా? కెరీర్ లో ఎలాంటి పురోగతి రావడం లేదని బాధపడేవారికి ఈ గుర్రపు నాడా చాలా బాగా ఉపయోగపడుతుంది. దీని శనివారం ఒక చిన్న రెమిడీ పాటించాలి. శనివారాన్ని శని గ్రహానికి సంబంధించిన రోజుగా పరిగణిస్తారు. అందుకే.. ఆ రోజున మీరు మీ చేతి మధ్య వేలికి గుర్రపు నాడా ఆకారం ఉన్న ఉంగరం ధరించాలి. ఇలా చేయడం వల్ల, మీకు ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యలు తగ్గుతాయి. ప్రమోషన్స్ అందుకునే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
55
శని దోషం ఉంటే....
మీ జాతకంలో శని దోషం ఉంటే... దానిని కూడా ఈ గుర్రపు నాడాతో చెక్ పెట్టొచ్చు. దాని కోసం మీరు గుర్రపు నాడాను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయాలి. దీని వల్ల శని దేవుడి దయ మీపై ఉంటుంది. శని దోషం నుంచి విముక్తి కూడా పొందుతారు. శని దోషం నుంచి బయటపడతారు. సమస్యలన్నీ తగ్గుతాయి.
ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ...
మీ కుటుంబంలో ఏవైనా గొడవలు, మనస్పర్థలు పెరిగి... ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరిగిందని మీకు అనిపిస్తే.. అప్పుడు కూడా ఈ గుర్రపు నాడా మీకు సహాయపడుతుంది. మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద గుర్రపు నాడా వేలాడదీయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. పాజిటివిటీ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్థలు కూడా తగ్గిపోతాయి. ఇంటి వాతావరణం చాలా ప్రశాంతంగా మారుతుంది.