
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
సోదరులతో స్థిరాస్తి వివాదాలు తొలగుతాయి. కుటుంబంలో శుభకార్యాల గురించి చర్చిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగి ఊరట చెందుతారు. నిరుద్యోగులు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆత్మీయుల రాక ఆనందం కలిగిస్తుంది. గృహ నిర్మాణ విషయంలో కీలక ఆలోచనలు అమలు చేస్తారు. ఆర్థికంగా కాస్త మెరుగైన పరిస్థితులుంటాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు. కొన్ని రంగాల వారికి శుభవార్తలు అందుతాయి.
సన్నిహితుల ప్రోత్సాహంతో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థుల పరీక్ష ఫలితాలు ఉత్సాహాన్నిస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. చిన్ననాటి మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఇంటా బయటా పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి రుణాలు తీర్చగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో నష్టాల నుంచి తెలివిగా బయట పడతారు. ఉద్యోగాలలో అధికారులు అనుగ్రహంతో హోదాలు పెరుగుతాయి.
స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఒక సంఘటన విశేషంగా ఆకట్టుకుంటుంది. కొన్ని రంగాల వారికి ఆశలు అంతగా ఫలించవు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలించి నూతన అవకాశాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు. బంధు మిత్రులతో వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. గృహ నిర్మాణ యత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.
చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థిక లాభాలు అందుతాయి. భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు లాభాల బాట పడతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
మీ నిర్ణయాలు ఇంట్లో అందరికి నచ్చుతాయి. సోదరులతో సఖ్యతగా వ్యవహారిస్తారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. విద్యార్థుల పరీక్ష ఫలితాలు కొంత ఊరట ఇస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి విలువైన సమాచారం సేకరిస్తారు. శత్రువులను కూడా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. ఉద్యోగాలలో పనిభారం నుంచి బయట పడతారు.
దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆప్తుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో చిన్నపాటి చికాకులు ఉన్నపటికీ అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి, ఉద్యోగాలలో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి విజయాలు అందుకుంటారు. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. దూర ప్రయాణ సూచనలు ఉన్నాయి.
నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పట్టుదలతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చిస్తారు. ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలు గతం కంటే లాభదాయకం. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. నిరుద్యోగులకు అధికారుల అనుగ్రహం లభిస్తుంది.
ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. బంధువులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయలు కలిసిరావు. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. నూతన రుణ యత్నాలు సాగిస్తారు. గృహ నిర్మాణ యత్నాలు మందగిస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వల్ల సమయానికి నిద్రహారాలు ఉండవు. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నాయి.
పాత విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు. సోదరులతో ఆస్తి వివాదాలు పరిష్కార దశకు చేరుకుంటాయి. గృహ నిర్మాణ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహన్నిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ నిర్ణయాలను ఇంటా బయటా అందరు గౌరవిస్తారు. వ్యాపారాలలో సమస్యలు అధిగమించి లాభలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు.
ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఆస్తుల క్రయ విక్రయాలలో సమస్యలు తొలగుతాయి. గృహ నిర్మాణాలు ప్రారంభిస్తారు. విద్యార్థులకు అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. చిన్న నాటి మిత్రులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు అనుకూలం.
చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు. విద్యార్థులకు అనుకూలం. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతాయి. సన్నిహితుల సాయంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు. సంఘంలో పేరు ప్రతిష్ఠలకు లోటు ఉండదు. వ్యాపారాలు క్రమంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన మార్పులు ఉంటాయి. వృథా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.
ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. సన్నిహితులతో సఖ్యత కలుగుతుంది. స్థిరాస్తి వివాదాలు పెద్దల సాయంతో పరిష్కరించుకుంటారు. కోర్టు వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. సంతాన వివాహ, ఉద్యోగ యత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది.