Jupiter Rise: ఆగస్టు 10 తర్వాత ఈ 4 రాశులకు తిరుగేలేదు.. కర్కాటకంలో ఉదయించబోతున్న గురుగ్రహం

Published : Aug 09, 2026, 06:23 AM IST

Jupiter Rise: గురు గ్రహం అతి త్వరలో ఆగస్టు 10న కర్కాటక రాశిలో ఉదయించబోతోంది. దీనివల్ల గురుడు శక్తివంతంగా మారతాడు. ఇది 4 రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు అందిస్తుంది. ఆ 4 రాశులు ఏవో తెలుసుకోండి.

PREV
14
కర్కాటకం

గురు గ్రహం కర్కాటక రాశిలోనే ఉదయించబోతున్నాడు.. కాబట్టి ఈ రాశి వారికి భారీ లాభాలు కలుగుతాయి. వీరిలో తమపై తమకు ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. చాలాకాలంగా ఆగిపోయిన పనులన్నీ ఈ సమయంలోనే పూర్తి చేస్తారు. అవి కూడా విజయవంతమవుతాయి. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్ రావచ్చు. జీతం కూడా పెరిగే అవకాశం ఉంది. వీరికి కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. కుటుంబం ప్రశాంతంగా జీవిస్తుంది. మొత్తమ్మీద సంతోషంగా ఉంటారు.

24
కన్యా రాశి

కన్యా రాశి వారికి గురు గ్రహం శక్తివంతంగా మారడం వల్ల ఆగస్టు 10 తర్వాత మీకు ఊహించని ప్రయోజనాలు అందుతాయి. వీరి ఆదాయం బాగా పెరుగుతుంది. ఇక వ్యాపారం చేస్తున్నవారికి ఎన్న ఆర్దిక లాభాలు వచ్చిపడతాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి రాబడి మొదలవుతుంది. ఇక సమాజంలో గౌరవం పెరుగుతుంది. డబ్బు పరంగా బలంగా మారుతారు కాబట్టి కుటుంబంలో కూడా ఆనందం పెరుగుతుంది.

34
తులా రాశి

గురు గ్రహం కర్కాటక రాశిలో ఉదయించడం వల్ల తులా రాశి వారికి భారీగా కలిసివస్తుంది. వీరు చేస్తున్న వృత్తి, వ్యాపార రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి కనిపిస్తుంది. పనిచేసే చోట వీరి కష్టానికి తగ్గ గుర్తించి దక్కుతుంది. ఇక ఉద్యోగం మారాలనుకునేవారికి మంచి జీతంలో కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. వ్యాపారం చేస్తున్న వారికి లాభాలు తెచ్చే ఒప్పందాలు జరుగుతాయి. గురు గ్రహం వల్ల ఆర్థిక సమస్యలు తొలిగిపోతాయి.

44
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి ఆగస్టు 10 తరువాత మంచి రోజులు మొదలవుతాయి. వీరికి ఆకస్మిక ధనలాభం కలిగే అవకాశం ఉంది. పూర్వీకుల ఆస్తికి సంబంధించి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. చేస్తున్న పని, ఉద్యోగంలో మంచి మార్పులు వస్తాయి. వీరి ఆర్థిక పరిస్థితి కూడా బలంగా మారుతుంది. కుటుంబంలో ఉన్న గొడవలు తగ్గిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత పెరుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories