
ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
మేష రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో కొత్త అవకాశాలు కనిపించినా వాటిని అందిపుచ్చుకోవడానికి సహనం అవసరం. నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిదికాదు. కుటుంబ పెద్దల సలహాలు కలిసివస్తాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపితే ఆశించిన ఫలితాలు వస్తాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది.
ఈ వారం వృషభ రాశివారికి ఆర్థిక విషయాల్లో కొంత ఊరట లభించే అవకాశం ఉంది. ఆదాయ వృద్ధికి అనుకూలంగా ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు రావచ్చు. వ్యాపారాలలో కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. బంధువులతో బంధాలు బలపడతాయి. దాంపత్య జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి.
మిథున రాశి వారికి ఈ వారం చురుకుదనం, కొత్త అవకాశాలు కలిసివచ్చే సూచనలు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాలలో ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ మార్పు కోరుకునేవారికి కొత్త ఆఫర్లు రావచ్చు. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. విద్యార్థులకు ఏకాగ్రత పెరుగుతుంది. సృజనాత్మక రంగాల వారికి మంచి గుర్తింపు దక్కే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థికంగా లాభాలు వచ్చినా పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం.
కర్కాటక రాశివారికి ఈ వారం కుటుంబం, ఆర్థికం, ఉద్యోగ బాధ్యతలు ప్రధానంగా ఉంటాయి. కొన్ని పనుల్లో ఆలస్యం జరిగినా చివరికి అనుకూల ఫలితాలు లభిస్తాయి. ఉద్యోగాలలో ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారాలకు సంబంధించి నిలిచిపోయిన డబ్బులు వసూలు అవుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. విద్యార్థులకు సమయపాలనతో మంచి ఫలితాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలుంటాయి. ఖర్చుల్లో నియంత్రణ అవసరం.
సింహ రాశివారికి ఈ వారం ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రశంసలు, కొత్త బాధ్యతలు, పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో శుభకార్యాలకు సంబంధించి చర్చలు జరుగుతాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల పరిస్థితులు ఉంటాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం. వృథా ఖర్చులను నియంత్రించడం మంచిది.
ఈ వారం కన్య రాశి వారికి శ్రమకు తగిన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి కనిపిస్తుంది. పెండింగ్ పనులు పూర్తి చేసి పై అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. కుటుంబంలో శుభవార్తలు వింటారు. సోదరులతో సఖ్యత పెరుగుతుంది. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు దక్కే అవకాశం ఉంది. విదేశీ అవకాశాలు అనుకూలిస్తాయి. ఆరోగ్యపరంగా చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.
ఈ వారం తుల రాశివారికి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త పరిచయాలు, అవకాశాలు కలిసివస్తాయి. సహోద్యోగులతో సమన్వయం పనులకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. జీవిత భాగస్వామితో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. పెళ్లి కాని వారికి శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు చదువులో పురోగతి సాధిస్తారు. ఆరోగ్యపరంగా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఆర్థికంగా ఖర్చులను నియంత్రించుకోవాలి.
వృశ్చిక రాశి వారికి ఈ వారం కష్టానికి తగిన ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రతిభకు గుర్తింపు, పదోన్నతికి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త ఒప్పందాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో శుభవార్తలు, పెద్దల ఆశీర్వాదం లభిస్తాయి. కోపాన్ని నియంత్రించుకోవడం అవసరం. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలుంటాయి. నూతన పెట్టుబడులను వాయిదా వేయడం మంచిది.
ధనుస్సు రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ మార్పు అవకాశాలు కలిసివస్తాయి. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. కుటుంబంలో శుభకార్యాల చర్చలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులకు పోటీ పరీక్షలు, ఉన్నత విద్యలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది.
ఈ వారం మకర రాశి వారికి క్రమశిక్షణ, సహనం విజయానికి దోహదపడతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో కొత్త అవకాశాలు కలిసివస్తాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. పెండింగ్ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. కుటుంబ పెద్దల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. స్థిరాస్తి, గృహా నిర్మాణానికి సంబంధించిన వ్యవహారాలు సానుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు లభించే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా జాగ్రత్త అవసరం.
కుంభ రాశివారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలలో కొత్త అవకాశాలు వస్తాయి. సహోద్యోగులతో సఖ్యతగా ఉండాలి. వ్యాపారులకు కొత్త పరిచయాల ద్వారా లాభాలు దక్కుతాయి. కుటుంబంతో సంతోషంగా సమయం గడుపుతారు. విద్యార్థులకు సాంకేతిక, శాస్త్రీయ రంగాల్లో పురోగతి ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులను నియంత్రించడం మంచిది.
ఈ వారం మీన రాశివారికి ఆధ్యాత్మికత పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు విజయవంతంగా నిర్వహించి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాలలో లాభదాయకమైన ఒప్పందాలు కుదురుతాయి. కుటుంబంలో శుభవార్తలు వింటారు. విద్యార్థులకు చదువుపై ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. వృథా ఖర్చులు పెరుగుతాయి.