Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు!

Published : Aug 02, 2026, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 02.08.2026 ఆదివారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని అవరోధాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం ఉంటుంది. నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఆర్థికంగా ఆశించిన ఫలితాలు ఉండవు.

313
వృషభ రాశి ఫలాలు

చిన్ననాటి మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు శాలరీ విషయంలో శుభవార్తలు అందుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు.

413
మిథున రాశి ఫలాలు

ఉద్యోగాలలో మీ పనితీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. స్నేహితుల సహాయంతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. బంధువులతో వివాదాలు పరిష్కారమవుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి.

513
కర్కాటక రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాలు మరింత నిరుత్సాహ పరుస్తాయి. చేపట్టిన కార్యక్రమాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఉద్యోగ వాతావరణం అంతగా అనుకూలించదు. సంతాన ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి.

613
సింహ రాశి ఫలాలు

నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. సన్నిహితులతో మాటపట్టింపులు ఉంటాయి. వృథా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆందోళన కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో బాధ్యతలు పెరగటం వల్ల తగినంత విశ్రాంతి లభించదు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

713
కన్య రాశి ఫలాలు

అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వ్యాపారానికి నూతన పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి బయటపడతారు.

813
తుల రాశి ఫలాలు

అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. ఇంట్లో కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో లాభాలు అందుకోవడానికి మరింత కష్టపడాలి. ఉద్యోగాలలో అధికారులతో జాగ్రత్తగా వ్యవహారించాలి.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముఖ్యమైన కార్యక్రమాలు పూర్తిచేస్తారు. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు ఉన్నపటికీ సమర్థంగా పనులు పూర్తిచేస్తారు.

1013
ధనుస్సు రాశి ఫలాలు

సోదరులతో స్ధిరాస్తి వివాదాలు చికాకు పరుస్తాయి. వృత్తి, వ్యాపారాలలో మరింత నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. వాహన ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది.

1113
మకర రాశి ఫలాలు

ముఖ్యమైన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి, వ్యాపారాలు పుంజుకుంటాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహంతో అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

1213
కుంభ రాశి ఫలాలు

నిరుద్యోగుల కలలు సాకరమవుతాయి. చిన్ననాటి మిత్రుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. భూ క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. వ్యాపారాలలో మరింత ఉత్సాహంగా పని చేసి లాభాలు అందుకుంటారు. చేపట్టిన పనులు అప్రయత్నంగా పూర్తవుతాయి.

1313
మీన రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టే విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories