Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు!

Published : Feb 15, 2026, 07:00 AM IST

Weekly Horoscope: ఈ వార ఫలాలు 15.2.2026 నుంచి 21.2.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఇంటా బయటా ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వస్తాయి. నాయకత్వ లక్షణాలు చూపించే అవకాశం ఉంటుంది. వ్యాపారాలలో కొత్త ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి.పెట్టుబడుల్లో తొందరపాటు మంచిది కాదు. కుటుంబంలో పెద్దల సలహా తీసుకోవడం మంచిది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

313
వృషభ రాశి ఫలాలు

ఆర్థికంగా స్థిరత్వం కనిపిస్తుంది. గతంలో ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని భారం పెరిగినా ఫలితం అనుకూలంగా ఉంటుంది. కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన పెరుగుతుంది. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి.

413
మిథున రాశి ఫలాలు

ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. మంచి మాటతీరుతో అందరిని ఆకట్టుకుంటారు. నిరుద్యోగులకు అనుకూల ఫలితాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. స్నేహితులతో కలిసి సంతోషంగా గడుపుతారు. 

513
కర్కాటక రాశి ఫలాలు

కుటుంబంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో చిన్నపాటి వివాదాలు ఉంటాయి. స్థిరాస్తి లేదా గృహ నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో పురోగతి ఉంటుంది. ఆరోగ్య పరంగా చిన్న చిన్న సమస్యలు రావచ్చు. వృత్తి, వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం.

613
సింహ రాశి ఫలాలు

సమాజంలో గౌరవ మర్యాదలు, గుర్తింపు పెరుగుతుంది. ఉద్యోగాలలో ఉన్నత అధికారులతో సంబంధాలు మెరుగుపడతాయి. వ్యాపారాలలో లాభదాయక ఒప్పందాలు కుదిరే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు మంచి అవకాశాలు అందుతాయి. డబ్బు వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది.

713
కన్య రాశి ఫలాలు

ఆలోచనా శక్తి పెరుగుతుంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు లేదా కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. సహోద్యోగుల సహకారంతో అనుకున్న పనులు అనుకున్న టైంకి పూర్తిచేస్తారు. ఖర్చులకు తగిన ఆదాయం ఉండదు. సమాయానికి నిద్రాహారాలు ఉండవు. వ్యాపారాలు అంతంతమాత్రంగా ఉంటాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.

813
తుల రాశి ఫలాలు

వృత్తి, ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు లభిస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు పొందుతారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

శక్తి, ఉత్సాహం పెరుగుతాయి. కోపంపై నియంత్రణ అవసరం. ఉద్యోగంలో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ మద్దతు ధైర్యాన్ని ఇస్తుంది. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహా తీసుకొని ముందుకు సాగడం మంచిది. 

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. అన్నదమ్ములతో ఉన్న గొడవలు సర్దుమణుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

1113
మకర రాశి ఫలాలు

క్రమశిక్షణతో వ్యవహరించడం మంచిది. ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. వృథా ఖర్చులు తగ్గించడం మంచిది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

1213
కుంభ రాశి ఫలాలు

కొత్త ఆలోచనలు, కొత్త ప్రణాళికలు కార్యరూపం దాలుస్తాయి. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చకు వస్తుంది. స్నేహితుల సహకారంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. వ్యాపారంలో కొన్ని మార్పులు చేస్తారు. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. పెద్ద పెట్టుబడుల్లో జాగ్రత్త అవసరం. ఉద్యోగాలలో తోటివారి వల్ల సమస్యలు రావచ్చు. 

1313
మీన రాశి ఫలాలు

ఇంటా బయటా సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. ఉద్యోగాలలో ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. డబ్బు వ్యవహారాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు లాభదాయకం. అధికారుల అనుగ్రహంతో నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.    

Read more Photos on
click me!

Recommended Stories