వారఫలితాలు తేదీ 5 నవంబర్ శుక్రవారం నుండి 11 గురువారం 2021

First Published Nov 5, 2021, 9:52 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి   ఈ వారం నెమ్మదించినా పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి.

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం అనుకున్న పనులు సకాలంలోనే పూర్తి చేస్తారు. ఆర్థిక ఇబ్బందులు తొలగి ఊరట లభిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మనస్పర్థలు తొలగి ఆప్తులు దగ్గరవుతారు. వాహనాలు, భూములు కొంటారు. చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. విద్యార్థులు మరింత ఉత్సాహంగా ముందుకు సాగుతారు. వ్యాపారాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు, తగినంత లాభాలు తథ్యం. ఉద్యోగులకు పనిభారం తగ్గుతుంది. రాజకీయవర్గాలకు  కొత్త పదవులు దక్కుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయం. అనారోగ్య సూచనలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 


వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  ఈ వారం నెమ్మదించినా పనులు పూర్తి కాగలవు. ఆలోచనలు అమలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు అనుకూలురుగా మారతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో కొత్త హోదాలు ఉత్సాహాన్నిస్తాయి. కళారంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. బంధువులతో తగాదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  ఈ వారం ఆశించిన రాబడి దక్కి అవసరాలు తీరతాయి. ఆప్తులు, శ్రేయోభిలాషుల నుంచి సహాయసహకారాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. కొత్త ఇంటి నిర్మాణయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థుల ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు మరింతగా లాభిస్తాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం. ఉద్యోగులకు శుభవార్తలు అందుతాయి. పారిశ్రామికవర్గాలకు నూతనోత్సాహం.  వారం మధ్యలో శ్రమాధిక్యం. బంధువులతో విభేదాలు. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం కష్టసాధ్యమైనా ఇచ్చిన మాటను నిలుపుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. బంధువులతో వివాదాలు ఏర్పడతాయి. ఆలోచనలు అంతగా కలసిరావు. మీ ప్రమేయం లేకుండానే కుటుంబసభ్యులు నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వివాహ, ఉద్యోగయత్నాలు నెమ్మదిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ముఖ్య విషయాలు చర్చిస్తారు. వ్యాపారాలు కొంతవరకు లాభిస్తాయి. ఉద్యోగాలలో పని ఒత్తిడులు పెరుగుతాయి. రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం ప్రారంభంలో శుభవార్తలు. ధన,వస్తులాభాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-  ఈ వారం కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కొన్ని సమస్యలను చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఎంతటి వారినైనా మీదారికి తెచ్చుకుంటారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటుంది. వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. కాంట్రాక్టర్లకు కలసివచ్చే సమయం. మీపై వచ్చిన కొన్ని విమర్శలు తొలగుతాయి. నిరుద్యోగుల ఎదురుచూపులు ఫలిస్తాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉన్నతస్థితి దక్కవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత ఉత్సాహం కలిగించే సమాచారం రావచ్చు. వారం చివరిలో ధనవ్యయం. ఆరోగ్యభంగం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
 

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొన్ని పనులు నెమ్మదించినా ఎట్టకేలకు పూర్తి కాగలవు. మీలోని దాతృత్వాన్ని పదిమంది గుర్తిస్తారు. విద్యార్థుల్లో ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శత్రువులను కూడా మిత్రులుగా మార్చుకుంటారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులు సమకూరి ఉత్సాహంగా సాగుతారు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. కళారంగం వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. మానసిక అశాంతి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం కొత్త వ్యక్తులు పరిచయం. బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు విజయవంతమైన కాలం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో పనిభారం కొంత తగ్గే సూచనలు. పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వారం చివరిలో వ్యయప్రయాసలు. అనారోగ్యం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం అనుకున్న ఆదాయం లభించి ముందుకు సాగుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. యుక్తితో వ్యవహరించి కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. మీ జీవితాశయం నెరవేరుతుంది. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు ఇంటిలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడే అవకాశం. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగి ఊరట లభిస్తుంది. రాజకీయవర్గాలకు కొత్త ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో బంధువులతో తగాదాలు. ఆరోగ్య సమస్యలు. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

ధనుస్సురాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆదాయం క్రమేపీ మెరుగుపడుతుంది. సన్నిహితులు, కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆస్తి వ్యవహారాలలో ఒప్పందాలు చేసుకుంటారు.  పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది. అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. ఆరోగ్యం కొంత మెరుగుపడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కొందరు ప్రముఖులు కొంత చేయూతనిచ్చే అవకాశాలు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. వ్యాపారాలు క్రమేపీ లాభిస్తాయి. ఉద్యోగాలలో ఆశించిన హోదాలు రావచ్చు. కళారంగం వారికి చిక్కులు వీడతాయి. వారం ప్రారంభంలో మనోధైర్యం తగ్గుతుంది. మిత్రులతో విభేదాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం అనుకున్న ఆదాయం సమకూరుతుంది. రెట్టించిన ఉత్సాహంతో పనులు చక్కదిద్దుతారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు లభిస్తాయి. ముఖ్య సమావేశాలలో పాల్గొంటారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. చాకచక్యంగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. సోదరులతో ఆస్తుల విషయంలో  అగ్రిమెంట్లు చేసుకుంటారు.  వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. పారిశ్రామికవర్గాలకు విశేష యోగవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో మిత్రులతో కలహాలు. రుణాలు చేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ  11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం ఆర్థికంగా మునుపటి కంటే మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తుల పరిచయం. చేపట్టిన పనులువేగంగా పూర్తి చేస్తారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. సంఘంలో కీర్తిప్రతిష్ఠలు పొందుతారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. సోదరులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో మరింత పురోభివృద్ధి కనిపిస్తుంది. కళారంగం వారికి అవకాశాలు దక్కుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది. 


మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-  ఈ వారం ఏ వ్యవహారమైనా పూర్తి చేసే వరకూ విశ్రమించరు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. భూముల వివాదాలు కొలిక్కి వస్తాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చాకచక్యంగా వ్యవహరించి కొన్ని విజయాలు సాధిస్తారు. మీ అంచనాలు నిజం చేసుకునే సమయం. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఇంటి నిర్మాణాలు తిరిగి పుంజుకుంటాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి,  పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.
click me!