వారఫలితాలు తేదీ 4 జూన్ శుక్రవారం నుండి 10 గురువారం 2021

First Published | Jun 4, 2021, 8:07 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఈ వారం సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూ, గృహయోగ సూచనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. దైవదర్శనాలు చేసుకుంటారు. 

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళాకారులు అనుకున్న అవకాశాలు అప్రయత్నంగా దక్కించుకుంటారు. వాహనయోగం. వారం చివరిలో దూరప్రయాణాలు. ధనవ్యయం. వ్యవహారాలలో విజయం. శుభకార్యాలకు కొంత డబ్బు వెచ్చిస్తారు. సంఘంలో ఆదరణ. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. ప్రత్యర్థులు సైతం మీ సమర్థతను మెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. వ్యాపారాలలో అనూహ్యమైన లాభాలు అందుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. భూ, గృహయోగ సూచనలు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. నిరుద్యోగులకు అనుకూల వాతావరణం. దైవదర్శనాలు చేసుకుంటారు. పారిశ్రామికవర్గాల ఆశలు కొంతమేర ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ఆస్తి వివాదాలు. మిత్రుల నుంచి ఒత్తిడులు. తల్లి ఆరోగ్య విషయమై కొంత అలజడిగా ఉంటుంది, స్వల్ప అనారోగ్యం. ముఖ్యమైన పనులు మరింత సాఫీగా సాగుతాయి. ఆర్థిక విషయాలలో ఒడిదుడుకులు తొలగుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మరింత సంతోషంగా గడుపుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం నిర్ణయాలలో తొందరపాటువద్దు. విద్యార్థులు శ్రమానంతరం ఫలితం పొందుతారు. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలు క్రమేపీ వృద్ధి చెందుతాయి. రాజకీయవర్గాలకు ఉత్సాహవంతమైన కాలం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉండి అవసరాలకు సొమ్ము అందుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. పనులు కొంత నెమ్మదిగా సాగుతాయి. బంధువులు, మిత్రులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు చేపడతారు. పనిభారం తగ్గే సూచనలు. కళారంగం వారికి అవకాశాలు కొన్ని దక్కవచ్చు. వారం చివరిలో వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. ఆర్థిక వ్యవహారాలలో మరింత ప్రగతి కనిపిస్తుంది. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రేయోభిలాషుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆరోగ్య సమస్యలు తీరతాయి. విద్యార్థుల నైపుణ్యం వెలుగులోకి వస్తుంది. వాహన, గృహయోగాలు. కొత్త వ్యక్తుల పరిచయం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలలో తగినంత లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. వారం చివరిలో దనవ్యయం. దాంపత్య జీవితంలో స్వల్ప భేదాభిప్రాయాలు కనబడుతాయి. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. కొత్త ఆశలతో ముందడుగు వేసి పనులు చక్కదిద్దుతారు. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో పురోగతి సాధిస్తారు. బంధుమిత్రుల సలహాలతో నిర్ణయాలు తీసుకుంటారు. సంఘంలో పరపతి పెరుగుతుంది. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. కాంట్రాక్టులు సైతం లభిస్తాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం కొన్ని వివాదాలు నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో పొరపాట్లు సరిదిద్దుకుని ముందడుగు వేస్తారు. పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. వారం ప్రారంభంలో అనారోగ్యం. బంధువులతో విభేదాలు. మానసిక అశాంతి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థుల్లోని సత్తా, నైపుణ్యం వెలుగులోకి వస్తాయి. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వస్తులాభాలు. ఆస్తి వ్యవహారాలలో కొత్త అగ్రిమెంట్లు చేసుకుంటారు. ఒక ప్రకటన నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం పెట్టుబడులు సైతం ఆలస్యమవుతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉండవచ్చు. రాజకీయవర్గాలకు శ్రమాధిక్యమే తప్ప ఫలితం కనిపించదు. వారం ప్రారంభంలో శుభకార్యాలలో పాల్గొంటారు. నూతన ఉద్యోగప్రాప్తి. ఆర్థిక వ్యవహారాలు కొంత నిరాశ పరుస్తాయి. రుణాల కోసం అన్వేషిస్తారు. నిర్ణయాలలో పొరపాట్లు సరిచేసుకునే యత్నాలు చేస్తారు. ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి. ఆస్తి విషయాలలో సోదరులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు నెరవేరతాయి. కళారంగం వారికి మొదట్లో ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. వారం చివరిలో మిత్రుల నుంచి సమస్యలు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యభంగం. మానసిక అశాంతి. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. కొన్ని ప్రధాన సమస్యలు సైతం తీరతాయి. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. కొన్ని ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలలో ముందడుగు వేస్తారు. కోర్టు వ్యవహారంలో సానుకూల సంకేతాలు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం వ్యాపారాలు సాధారణంగా కొనసాగుతాయి. పెట్టుబడుల్లో జాప్యం. ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు. ఒత్తిడులు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు నిరుత్సాహమే. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలాభం. విచిత్ర సంఘటనలు. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. కొత్త రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. బంధువులు, మిత్రులతో అకారణంగా విభేదాలు నెలకొంటాయి. ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి. కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. విద్యార్థులకు అంచనాలు తారుమారు కాగలవు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం కుటుంబ విషయాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. గృహ, వాహనయోగాలు కలుగుతాయి. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. వ్యాపారాలలో అనుకోని లాభాలు దక్కవచ్చు. ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. కళాకారులకు కొన్ని అంచనాలు ఫలిస్తాయి. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. ఆప్తులతో కలహాలు. అనారోగ్యం. కొత్త పనులను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులు,సోదరీలతో వివాదాలు తీరతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం సంఘంలో గౌరవమర్యాదలు పెరుగుతాయి. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో చిక్కులు తొలగుతాయి. కొత్త పెట్టుబడులకు అవకాశాలు. ఉద్యోగాలలో కొన్ని బాధ్యతలు తగ్గవచ్చు. ఉత్సాహవంతంగా ఉంటుంది. రాజకీయవర్గాలకు కొంత ఊరట లభిస్తుంది. వారం ప్రారంభంలో బంధువులతో తగాదాలు. అనారోగ్య సూచనలు. కొత్త మిత్రులు పరిచయమవుతారు. అనుకోని విధంగా పనులు చక్కదిద్దుతారు. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. మిత్రుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలలో ముందడుగు వేస్తారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం కొన్ని పాతబాకీలు సైతం అంది ఆర్థికంగా బలం పుంజుకుంటారు. కొన్ని పనులు చకచకా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వ్యాపారాలు వృద్ధి చెంది లాభాలు గడిస్తారు. ఉద్యోగాలలో ఆటుపోట్లు తొలగుతాయి. రాజకీయవర్గాలకు కొన్ని పదవులు దక్కవచ్చు. వారం మధ్యలో కుటుంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. శ్రమాధిక్యం. చిన్ననాటి మిత్రుల నుంచి అనుకోని ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి విషయాలలో సమస్యలు తీరి ఒడ్డునపడతారు. కోర్టు వ్యవహారాలు పరిష్కారం. శుభకార్యాలకు ఏర్పాట్లు చేసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ఇష్ట దైవ ప్రార్ధన చేయండి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.

Latest Videos

click me!