ఏ రంగు కారు కొంటే అదృష్టం కలిసొస్తుంది..?

First Published Jun 2, 2021, 12:16 PM IST

జోతిష్య శాస్త్రం ప్రకారం.. కారు కొనేటప్పడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో మనం ఇప్పుడు  చూద్దాం..

కొత్తగా కారు కొనాలని అనుకుంటున్నారా..? ఏ రంగు కారు కొనాలి..? కారుకి నెంబర్ ఏది ఉండాలో కూడా డిసైడ్ అయ్యారా..? అయితే.. మీ జాతకం ప్రకారం.. ఏ రంగు కారు వాడితే మీకు అంతా సవ్యంగా కలిసి వస్తుందో ఇప్పుడు చూద్దాం..
undefined
మధ్యతరగతి కుటుంబానికి కారు కొనడం అనేది అతి పెద్ద డీల్. ఆ కారు కొనడానికి ఎన్ని రోజుల నుంచి సేవింగ్స్ దాచిపెట్టారో వారికి మాత్రమే తెలుసు. కాబట్టి.. అంత విలువైన కారుని కొనేటప్పుడు ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనమీదే ఉంటుంది.
undefined
జోతిష్య శాస్త్రం ప్రకారం.. కారు కొనేటప్పడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. జోతిష్య నిపుణులు ఏం చెబుతున్నారో మనం ఇప్పుడు చూద్దాం..
undefined
ఏ రంగు కారు ఎంచుకుంటున్నారనేది మీ వ్యక్తిగత విషయం అయినప్పటికీ.. మీకు సూటయ్యే రంగు ఎంచుకుంటే ఇంకా బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. అది మీరు పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి మారుతుంది. కాబట్టి.. దానిని బట్టి నిపుణులను సంప్రదించి మీకు నప్పే కారు రంగును ఎంచుకుంటే మీకు అంతా మంచే జరుగుతుంది.
undefined
ఇక కారు నెంబర్ విషయంలోనూ చాలా మంది పర్టిక్యులర్ గా ఉంటారు. ముఖ్యంగా లక్కీ నెంబర్ ఉండేలా చూసుకుంటారు. అయితే. మీ లక్కీ నెంబర్ ని మీరు పుట్టిన తేదీ ప్రకారం లెక్కించాలి. అంటే ఉదాహరణకు మీరు 21వ తేదీన పుడితే.. (2+1) =3. మీ లక్కీ నెంబర్ కూడా 3 అవుతుంది. కారు నెంబర్ కూడా మొత్తం యాడ్ చేస్తే.. మీ లక్కీ నెంబర్ వచ్చేలా ఎంచుకోండి.
undefined
కారు కొన్న తర్వాత.. దానిని డెలివరీ ఇచ్చే తేదీ కూడా మంచిదో కాదో చెక్ చేసుకోవాలి. క్యాలెండర్ ప్రకారం.. కారు డెలివరీ వచ్చే మంచి రోజును ఎంచుకోవాలి. ఏదైనా వస్తువు కొనడమైనా, అమ్మడమైనా మంచి రోజున చేస్తే మంచి జరుగుతుంది.
undefined
ఇక రోజుతోపాటు.. సమయం కూడా చేసుకోవాలి. ప్రతిరోజులో కేవలం కొన్ని గంటలు మాత్రమే శుభ గడియలు ఉంటాయి. రాహు కాలం కూడా ఉంటుంది. కాబట్టి.. శుభ గడియల్లో పని జరిగేలా చూసుకోవాలి.
undefined
ఇక కారులో డ్యాష్ బోర్డ్ మీద దేవుడి చిన్న విగ్రహాలు పెట్టుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వినాయకుడి విగ్రహం పెట్టుకోవడం చాలా అవసరమట. ప్రమాదాల నుంచి మనల్ని కాపాడటానికి వినాయకుడు సహాయం చేస్తాడని నమ్మకమట.
undefined
ఇక కారు కొన్న తర్వాత.. ఫస్ట్ రైడ్ గుడికి వెళ్లడం మంచిది. అది కూడా వినాయక, ఆంజనేయ స్వామి ఆలయాలకు వెళ్లి పూజ చేయించుకుంటే చాలా మంచిదట. ఈ ఇద్దరు దేవుళ్లు.. చెడు దృష్టి పడకుండా చేస్తారట.
undefined
click me!