మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక విషయాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు క్రమేపీ విస్తరిస్తారు. లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో అనుకున్న మార్పులు జరిగే సూచనలు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. పసుపు, నేరేడు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి :- ఈ వారం ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. సంఘంలో ఆదరణ మరింత పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమించి ముందడుగు వేస్తారు. ఉద్యోగులకు పనిభారం నుంచి కొంత విముక్తి లభిస్తుంది. పారిశ్రామికవర్గాల శ్రమ ఫలిస్తుంది. వారం చివరిలో కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆకుపచ్చ, గులాబీ రంగులు. దక్షిణ దిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు విష్ణు సహస్ర నామాలను చదువుకోవాలి. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం పరిస్థితులను క్రమేపీ అనుకూలంగా మలచుకుంటారు. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. ఆహ్వానాలు అంది ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థిక లావాదేవీలలో చిక్కులు తొలగుతాయి. దీర్ఘకాలిక సమస్యలు క్రమేపీ పరిష్కారమవుతాయి. భూములు కొనుగోలు ప్రయత్నాలు కలసివస్తాయి. అత్యంత నేర్పుగా శత్రువులను కూడా ఆకట్టుకుంటారు. ఇంటి నిర్మాణాలపై దృష్టి సారిస్తారు. వ్యాపారాలు మునుపటి కంటే లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు కొంత పెరుగుతాయి. కళారంగం వారి ఆశలు ఫలించే సమయం. వారం ప్రారంభంలో అనుకోని ధనవ్యయం. ఎరుపు, పసుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గోచార రిత్య అష్టమ శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి కాకులకు బెల్లంతో చేసిన గోధుమ రొట్టెలను వేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- ఈ వారం పనుల్లో కొంత జాప్యం జరిగినా ఎట్టకేలకు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి మరింత ఆదరణ పొందుతారు. ఆర్థిక విషయాలలో గందరగోళం తొలగుతుంది. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వచ్చి ఊరట చెందుతారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. ఒక ప్రధాన సమస్య తీరి ఒడ్డునపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాల విస్తరణ యత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. పారిశ్రామికవర్గాలకు కొత్త సంస్థల ఏర్పాటులో ఆటంకాలు తొలగుతాయి. వారం ప్రారంభంలో అనారోగ్యం. గులాబీ, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని రుణబాధల నుంచి విముక్తి లభిస్తుంది. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. భూముల కొనుగోలులో వివాదాలు సర్దుకుంటాయి. ఒక సమాచారం నిరుద్యోగులకు ఉత్సాహాన్నిస్తుంది. సంఘంలో కీర్తి గడిస్తారు. ఎన్నడో పోగొట్టుకున్న కొన్ని డాక్యుమెంట్లు తిరిగి లభ్యమవుతాయి. వ్యాపార లావాదేవీలు మరింత లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో పనిఒత్తిడుల నుంచి బయటపడతారు. కళారంగం వారికి అవకాశాలు అప్రయత్నంగా దక్కుతాయి. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. ఆకుపచ్చ, గులాబీ రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- ఈ వారం ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. కష్టానికి తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మిత్రులతో అకారణంగా విరోధాలు నెలకొంటాయి. అనుకున్న వ్యవహారాలలో అవాంతరాలు ఎదురుకావచ్చు. ఇంటి నిర్మాణయత్నాలు ముందుకు సాగుతారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. విద్యార్థులకు కొంత గందరగోళంగా ఉంటుంది. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు విధులు చికాకు పరుస్తాయి. పారిశ్రామికవర్గాలు, కళాకారులకు కొత్త సమస్యలు. వారం మధ్యలో శుభవార్తలు. ఆకస్మిక ధనలబ్ధి. తెలుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గరికతో గణపతికి పూజ చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- ఈ వారం ఉత్సాహంగా అనుకున్న వ్యవహారాలు పూర్తి చేస్తారు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరుకుంటాయి. ఆర్థిక పరిస్థితి మరింత అనుకూలించి తరచూ ధనలాభాలు కలిగే సూచనలున్నాయి. వాహనాలు, భూముల కొనుగోలులో అవాంతరాలు అధిగమిస్తారు. ఎంతటి సమస్యనైనా అవలీలగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు విస్తరణ, పురోగతిలో స్వీయనిర్ణయాలు మంచిది. ఉద్యోగాలలో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తారు. రాజకీయవర్గాలకు ఊహించని పదవులు రావచ్చు. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం పాటించాలి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- ఈ వారం పొరపాట్లు సరిదిద్దుకుని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగి విజయం సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఊపందుకుంటాయి. సోదరులు, మిత్రుల ప్రోత్సాహంతో కీలక విషయాలలో ముందడుగు వేస్తారు. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. ఒక మరపురాని సంఘటన ఎదురుకావచ్చు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో ఆశించినస్థాయిలో లాభాలు దక్కించుకుంటారు. ఉద్యోగాలలో పనిఒత్తిడుల నుంచి గట్టెక్కుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారుల ప్రయత్నాలలో పురోగతి ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు. గులాబీ, తెలుపు రంగులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గోమాతకు గ్రాసం పెట్టండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
ధనుస్సురాశి ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :- ఈ వారం ఆర్థికంగా కొంత ఇబ్బంది నెలకొన్నా అవసరాలు తీరతాయి. ఆప్తుల నుంచి అందిన సమాచారం మీలో కొత్త ఉత్సాహాన్నిస్తుంది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువుల నుంచి ఆస్తిలాభ సూచనలున్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు క్రమేపీ పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యల బారి నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు, వైద్యరంగం వారి సేవలు విస్తృతమవుతాయి. వారం మధ్యలో అనారోగ్యం. అనుకోని ధనవ్యయం. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మృత్యంజయ జపం చేయడం మంచిది. పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- ఈ వారం వీరికి అన్ని విధాలా విశేషయోగదాయకమైన కాలం. ఆర్థికంగానూ, సామాజికంగానూ బలపడతారు. రావలసిన డబ్బు సకాలంలో అందుతుంది. ఏ పని చేపట్టినా విజయమే. ఆప్తులు, శ్రేయోభిలాషులు మీపై ప్రేమానురాగాలు చూపుతారు. వివాహాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత ఇబ్బంది కలిగించవచ్చు. అకారణ ఆహారవిహారాదులకు స్వస్తి చెప్పండి. వాహనయోగం. వ్యాపారాలు మరింత విస్తరించి ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో కష్టాలు తొలగుతాయి. పారిశ్రామికవేత్తలు, కళాకారులు లక్ష్యసా«దనలో ముందుకు సాగుతారు. వారం మధ్యలో బంధువులతో విభేదాలు. మానసిక ఆందోళన. నీలం, తెలుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు ప్రతీ రోజూ రావి చెట్టుకు 'ఓం నమో భగవతే వాసుదేవాయ' అని స్మరిస్తూ 11 ప్రదక్షిణలు చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
కుంభరాశి ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :- ఈ వారం వీరు ఏ కార్యక్రమం చేపట్టినా పూర్తి కావడమే ధ్యేయంగా ముందుకు సాగుతారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. మాటల నైపుణ్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. సేవాతత్పరతతో కొన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగలాభం ఉండవచ్చు. శ్రమకు తగిన ఫలితం అందుకోనున్నారు. విద్యార్థులు కొత్త అవకాశాలను దక్కించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో మీపై వచ్చిన అపవాదులు తొలగుతాయి. రాజకీయవేత్తలు, కళాకారుల ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఆరోగ్యభంగం. పసుపు, నేరేడు రంగులు. దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు గోమాత సమేత ఐశ్వర్య కాళీ అమ్మవారి పటానికి ఎర్రని పూలతో పూజించండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :- ఈ వారం మొదట్లో పడిన ఇబ్బందులను దాటుకుంటూ ముందుకు సాగుతారు. అనుకున్న వ్యవహారాలు పూర్తి కావడంలో సోదరులు సహకరిస్తారు. ఒక వ్యక్తి ద్వారా ఊహించని రీతిలో ధనలాభం ఉండవచ్చు. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉద్యోగాలు దక్కి నిరుద్యోగులు సంతోషంగా గడుపుతారు. భూములు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా కొనసాగుతాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు. పారిశ్రామిక, రాజకీయవేత్తలకు అన్నివిధాలా అనుకూల సమయం. వారం ప్రారంభంలో ఆరోగ్యసమస్యలు. బంధువులతో తగాదాలు. గులాబీ, ఎరుపు రంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు సూర్య దేవుని ఆరాధన చేయండి, పశు, పక్ష్యాదులకు త్రాగడానికి నీళ్ళను ఏర్పాటు చేయండి శుభం కలుగుతుంది.
గమనిక :- ప్రస్తుతకాల గోచార గ్రహస్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని సామూహిక ఫలితాలు తెలియజేయడం జరుగుతుంది, ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. వ్యక్తిగత జాతక వివరాల కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు . . . డా. ఎం . ఎన్. చార్య
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు.సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
డిసెంబర్ 26 తేదీలో ఏర్పడే సూర్య గ్రహణం ఆ సమయంలో ఆరు గ్రహములు ఒకే రాశిలో ఉండటం వలన పన్నెండు రాశులపై ప్రభావం ఎలా ఉండబోతుంది, కొత్త సంవత్సరంలో తీసుకోబోయే నిర్ణయాలు గురించి వివరంగా తెలుసుకుందాం.