మీన రాశివారు ప్రేమ విషయంలో చాలా ఎమోషనల్. వీరు చాలా సహజమైన, సున్నితమైన, శృంగార భరితమైన ప్రేమను కోరుకుంటారు. వీరికి ఆత్మీయ సన్నిహితులు జీవితంలోకి రావాలని కోరుకుంటారు. వీరిదీ డీప్ లవ్. అలాంటి ప్రేమే ఎదుటి వారి నుంచి కోరుకుంటారు. వీరితో జీవితంలో రోలర్ కోస్టర్ లా ఉంటుంది. వీరు.. తాము ప్రేమించిన వారికి అన్ని ఎమోషన్స్ ని పరిచయం చేస్తారు. లైఫ్ ఎప్పుడూ ఒకేలా సింపుల్ గా ఉండదు వీరితో. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.