సంఖ్యాశాస్త్రం ప్రకారం ప్రతి తేదీకి ఒక మూలసంఖ్య ఉంటుంది. ప్రతి సంఖ్య ఒక ప్రత్యేకమైన శక్తిని, వ్యక్తిత్వాన్ని, జీవనశైలిని సూచిస్తుంది. మూలసంఖ్య ఆధారంగా పెళ్లి తేదీని బట్టి మీ మ్యారేజ్ లైఫ్‌లో ప్రేమ, అనురాగం, సవాళ్లు ఎలా ఉంటాయో తెలుసుకోవచ్చు.
పెళ్లి అనేది రెండు మనసులు, రెండు కుటుంబాలు, రెండు ప్రపంచాల కలయిక. ఈ బంధం ప్రేమ, నమ్మకం, సమన్వయం అనే మూడు స్తంభాలపై నిలుస్తుంది. కానీ జాతకం, నక్షత్రం, పేరు, రాశి వంటివి కూడా పెళ్లి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. పెళ్లి తేదీ ఆధారంగా మీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చని సంఖ్యా శాస్త్రం చెబుతుంది. మరి ఆలస్యమెందుకో తెలుసుకోండి.
210
మూల సంఖ్య 1
ఏ నెలలో అయినా 1, 10, 19, లేదా 28 తేదీలలో పెళ్లి చేసుకున్న వారి మూలసంఖ్య 1. ఈ సంఖ్య సూర్యుడి శక్తిని సూచిస్తుంది. ఈ తేదీలలో పెళ్లైన వారు సాధారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఈ తేదీల్లో పెళ్లి జరిగిన భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉన్నప్పటికీ వీరి బంధం బలంగా ఉంటుంది.
310
మూలసంఖ్య 2
ఏ నెలలో అయినా 2, 11, 20, లేదా 29 తేదీలలో పెళ్లి చేసుకున్న వారి మూలసంఖ్య 2. ఈ సంఖ్య చంద్రుడి శక్తిని సూచిస్తుంది. ఈ తేదీన పెళ్లైన వారు భావోద్వేగపరులు, ప్రేమతో నిండినవారు. వీరిద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఉంటుంది. కానీ అతి సున్నితత్వం కొన్నిసార్లు చిన్న అపార్థాలకు దారితీస్తుంది. ఒకరికి ఒకరు సహనంతో ఉంటే వీరి బంధం చాలా మధురంగా ఉంటుంది.
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 3, 12, 21, లేదా 30 తేదీలలో పెళ్లి చేసుకున్నవారి మూలసంఖ్య 3. ఈ సంఖ్య గురు గ్రహానికి సంబంధించినది. వీరు సరదాగా, ఉల్లాసంగా, సృజనాత్మకంగా జీవిస్తారు. వీరి జీవితంలో ప్రేమతో పాటు స్నేహం కూడా బలంగా ఉంటుంది. కొన్నిసార్లు ఒకరి ప్రాధాన్యం మరొకరికి తక్కువగా అనిపించవచ్చు. కానీ పరస్పర గౌరవం ఉంటే ఈ జంటల జీవితం చిరునవ్వులతో నిండిపోతుంది.
510
మూలసంఖ్య 4
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో 4, 13, 22, లేదా 31 తేదీలలో పెళ్లి జరిగితే వారి మూలసంఖ్య 4. ఈ సంఖ్యపై యూరేనస్ ప్రభావం ఉంటుంది. వీరు బాధ్యత కలవారు. వీరిద్దరూ స్థిరమైన జీవితం కోరుకుంటారు. అంకితభావంతో ఉంటారు. అయితే అతి క్రమశిక్షణ కొన్నిసార్లు నిరుత్సాహంగా మారవచ్చు.
610
మూలసంఖ్య 5
ఏ నెలలో అయినా 5, 14 లేదా 23 తేదీలలో పెళ్లి చేసుకున్న వారి మూలసంఖ్య 5. ఈ సంఖ్య బుధుడి శక్తిని సూచిస్తుంది. ఈ తేదీన పెళ్లైన వారు స్వేచ్ఛా స్వభావం కలవారు. కొత్త అనుభవాలను ఇష్టపడతారు. వీరి జీవితం ఆసక్తికరంగా ఉంటుంది. కానీ కొన్నిసార్లు స్థిరత్వం లోపిస్తుంది. సంభాషణలో పారదర్శకత ఉంటే వీరి సంబంధం చాలా బలంగా ఉంటుంది.
710
మూలసంఖ్య 6
ఏ నెలలో అయినా 6, 15 లేదా 24 తేదీలలో పెళ్లి చేసుకున్నవారి మూలసంఖ్య 6. ఈ సంఖ్య శుక్ర గ్రహానికి సంబంధించినది. ఇది ప్రేమ, అందం, సంతోషానికి సంకేతం. వీరు ఒకరినొకరు లోతుగా ప్రేమిస్తారు. జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకుంటారు. కళ, సంగీతం, రొమాన్స్ వీరి జీవితంలో సహజంగా ఉంటాయి. కానీ అవే కొన్నిసార్లు చిన్న చిన్న కలహాలకు దారితీస్తాయి.
810
మూలసంఖ్య 7
ఏ నెలలో అయినా 7, 16 లేదా 25 తేదీలలో పెళ్లి చేసుకున్న వారి మూలసంఖ్య 7. ఈ సంఖ్యపై నెప్ట్యూన్ ప్రభావం ఉంటుంది. ఈ తేదీన పెళ్లైన వారు లోతైన ఆత్మీయ బంధాన్ని పంచుకుంటారు. అయితే కొన్నిసార్లు వీరు తమ లోతైన భావాలను పంచుకోవడంలో కొంత సంకోచం చూపవచ్చు.
910
మూలసంఖ్య 8
సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 8, 17 లేదా 26 తేదీలలో పెళ్లి చేసుకున్న వారి మూలసంఖ్య 8. ఈ సంఖ్య శనిగ్రహానికి సంబంధించినది. వీరు జీవితం పట్ల బాధ్యత కలవారు. కష్టపడే స్వభావం కలవారు. వీరి జీవితం అంత సులభంగా ఉండదు. కానీ ఒకరికి ఒకరు అండగా నిలబడితే గొప్ప విజయాలను సాధిస్తారు.
1010
మూలసంఖ్య 9
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 9, 18 లేదా 27 తేదీలలో పెళ్లి చేసుకున్న వారి మూలసంఖ్య 9. ఈ సంఖ్య మంగళ గ్రహానికి సంబంధించినది. ఈ తేదీల్లో పెళ్లి చేసుకున్నవారు ప్రేమలో ఉదాత్తమైనవారు. కానీ కొన్నిసార్లు ఆవేశపరులు కూడా. జంటలో ఒకరు కొంచెం సహనంతో వ్యవహరిస్తే వీరి బంధం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.