Vastu Tips: డబ్బు లేక ఇబ్బంది పడుతున్నారా? ఈ వాస్తు మార్పులు చేసుకోవాల్సిందే

Published : Nov 01, 2025, 03:09 PM IST

Vastu Tips: ఎంత కష్టపడి, డబ్బు సంపాదించినా కూడా  ఇంట్లో రూాపాయి నిలబడటం లేదని చాలా మంది ఫీలౌతూ ఉంటారు. అలాంటివారు.. ఇంట్లో కొన్ని వాస్తు మార్పులు చేసుకుంటే, ఆ సమస్య నుంచి బయటపడొచ్చు. 

PREV
14
Vastu tips

భారతదేశంలో వాస్తు శాస్త్రాలను నమ్మేవారు చాలా మంది ఉన్నారు. మన చుట్టూ ఉన్న శక్తులు మన ఆర్థిక పరిస్థితిపై పెద్ద ప్రభావాన్ని చూపుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. మనకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలన్నా, ఆరోగ్యంగా బాగుండాలన్నా.. వాస్తు మార్పులు చేసుకోవాల్సిందే. మరీ ముఖ్యంగా... మీరు డబ్బు సమస్యలతో బాధపడుతున్నట్లయితే... కచ్చితంగా వాస్తు ప్రకారం కొన్ని నియమాలు పాటించాలి. అప్పుడు మీ సమస్యల నుంచి మీరు బయటపడే అవకాశం ఉంటుంది. మరి, అవేంటో చూద్దామా....

24
సానుకూల శక్తిని పెంచుకోవడానికి...

ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే సానుకూల శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం. దాని కోసం.. మనం నివసించే, పని చేసే స్థలాన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. అందుకోసం అవసరం లేని వస్తువులను తీసివేయాలి. అదేవిధంగా, ఇంటి ఉత్తర దిశ శుభ్రంగా ఉంచుకోవాలి. వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ఉత్తర దిక్కు కుబేరుడికి సంబంధించినది. హిందూ పురాణాల్లో కుబేరుడు సంపదకు దేవుడు. ఈ దిశ అవకాశాలను, డబ్బు ప్రవాహాన్ని సూచిస్తుంది.

34
వంట గదిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

ఇంటి ఉత్తర దిశలో వంట గదిని ఉంచవద్దు. ఇది పెరుగుదల,డబ్బు అవకాశాలపై ప్రతికూల ప్రభావాలను చూపుతుంది. అలాగే స్టవ్, సింక్ ఒకదాని పక్కన మరొకరటి ఉండకూడదు. అలా అయితే, మధ్యలో ఒక అవరోధం ఉంచడం మంచిది.

వాటర్ ఫౌంటైన్...

ఇంటి ఉత్తర దిశలో ఒక చిన్న వాటర్ ఫౌంటైన్ ఉంచడం చాలా ప్రయోజకరంగా ఉంటుంది. ఫౌంటైన్ నుంచి ప్రవహించే నీరు డబ్బు ప్రవాహంతో ముడిపడి ఉంటుంది. దీనిని అనుసరించడం వల్ల ఆర్థిక సమస్యలు తీరిపోతాయి. ఇంట్లో డబ్బు ప్రవాహం కూడా పెరుగుతుంది.

44
నైరుతి దిక్కు...

డబ్బు ఇంట్లో నిల్వ ఉండటానికి, నైరుతి దిశ ఉత్తమంగా పరిగణిస్తారు. ఈ దిశలో ఉత్తరం వైపు లాకర్లు లేదా డబ్బు పెట్టెలను ఉంచడం మంచిది. ఇది సాధ్యం కాకపోతే, మీరు పిగ్గీ బ్యాంకులో కొంత డబ్బును ఆదా చేసి ఈ దిశలో ఉంచవచ్చు. ఇది పొదుపును పెంచుతుంది. ఆర్థిక స్థిరత్వాన్ని కూడా అందిస్తుంది.

సానుకూల శక్తులను స్వాగతించాలి:

ఇంటి ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచాలి. చక్కగా అలంకరించాలి. ఇది చాలా మంది శుభ దినాలలో చేసే పని. ఇది సానుకూల శక్తిని స్వాగతించడంలో సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా చేయడం ద్వారా, మీరు ఎల్లప్పుడూ మీ ఇంటికి డబ్బు అదృష్టం కోసం సానుకూల శక్తిని స్వాగతిస్తున్నారని అర్థం.

Read more Photos on
click me!

Recommended Stories