Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర వృశ్చిక రాశి ఫలితాలు

First Published | Apr 5, 2024, 3:24 PM IST


శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన  వృశ్చిక రాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు  వృశ్చిక రాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
 

For Scorpios 01

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు (తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)

ఆదాయం:-8
వ్యయం:-14

రాజపూజ్యం:-4
అవమానం:-5

For Scorpios 02

ఈ సంవత్సరం గురుడు 1-5-24 వరకు షష్ఠమ స్థానంలో తామ్ర మూర్తి గా సంచరించి తదుపరి సంవత్సరాంతం తామ్ర మూర్తి గా కళత్ర స్థానంలో సంచారం.

శని ఈ సంవత్సరమంతా చతుర్ధ స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం.

రాహు ఈ సంవత్సరం అంతా పంచమ స్థానంలో తామ్ర మూర్తి గా సంచారం.

కేతు ఈ సంవత్సరం అంతా లాభ స్థానంలో తామ్ర మూర్తి గా సంచారం.

(ఈ రాశి వారికి అర్థాష్టమ శని)


మే నుంచి గురు బలం అనుకూలంగా ఉండటం చేత వృత్తి ఉద్యోగాల్లో సంతృప్తిని పొందుతారు. అవసరాలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులకు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం బాగుంటుంది. దాంపత్య జీవితం బాగుంటుంది. సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కుటుంబ ఆర్థిక విషయాలు సంతోషాన్ని కలిగేటట్లుగా ఉంటాయి.అన్నదమ్ములు బందో వర్గంతో ధనసహాయం పొందగలరు.
భూమి లేదా గృహమును కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.

శని సంచారం అనుకూలం కాదు. శారీరక బాధలు పెరుగుతాయి.మానసిక ఒత్తిడి మరియు ఇబ్బందులు కలుగుతాయి.పై అధికారులతో సంయమనము పాటించడం మంచిది.పనులలో ఆటంకాలు ఏర్పడిన ఆలస్యంగా  పూర్తి కాగలవు.
 


రాహు సంచారం అనుకూలం కాదు.

కేతు సంచారం అనుకూలం.అభివృద్ధి కరమైన ఆలోచనలు చేస్తారు.వృత్తి వ్యాపారాల్లో అధిక ఆదాయం మరియు సంపదలు పొందే అవకాశం.స్థిరాస్తి కొనుగోలు అమ్మకం వలన లాభాలు పొందగలరు.అన్ని వృత్తుల వారికి సంతృప్తికరంగా ఉంటుంది.మీ ఆశయాలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేరుతాయి. బంధు మిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.కొన్ని సందర్భాల్లో ధైర్యం కోల్పోయే సంఘటనలు జరగవచ్చు.కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.యొక్క పేరు ప్రతిష్టలు నలువైపులా వ్యాపిస్తాయి.అనవసరమైన చిక్కులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది.అందరి అండదండలు పుష్కలంగా ఉంటాయి.భ్రమించి వ్యవహారాల్లో హడావిడి చేస్తారు.ఊహించిన దానికన్నా ఎక్కువ ఖర్చు పెరగడం ఇబ్బందికరంగా మారుతుంది. విద్యార్థుల విద్యా సంబంధమైన విషయాలు లో పురోగతి సాధిస్తారు.వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వివాహ శుభ కార్యాలు నిర్విఘ్నంగా జరుగుతాయి.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

For Scorpios 03

విశాఖ నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి మిత్ర తార లో సంచారం.

శని 3-10-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 04-12-24 నుంచి పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు జన్మతారలో సంచారం.

రాహువు 7-7-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  సంపత్తార లో సంచారం.

కేతువు 11-11-24 వరకు నైధనతార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం సాధన తార లో సంచారం

అనూరాధ  నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి మిత్ర తార లో సంచారం.

శని 3-10-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి మిత్ర తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు పరమ మిత్ర తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు సంపత్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం జన్మతారలో సంచారం.

కేతువు 11-11-24 వరకు సాధన తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం ప్రత్యక్తార లో సంచారం

జ్యేష్ఠ  నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు క్షేమ తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి ప్రత్యక్తార లో  సంచారం తదుపరి 20-8-24 నుంచి సాధనతార లో సంచారం.

శని 3-10-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు మిత్ర తార లో సంచారం.

రాహు 7-7-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి సంవత్సరాంతం వరకు పరమ మిత్ర తార లో సంచారం

కేతువు 11-11-24 వరకు ప్రత్యక్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం క్షేమతార లో సంచారం

(ఈ సంవత్సరం ఈ రాశి వారికి శని రాహు కేతు సంచారం.అనుకూలంగా లేదు కావున సుందరకాండ పారాయణం మరియు దుర్గారాధన చేయడం వలన మంచి ఫలితాలను పొందగలరు.)

For Scorpios 04

ఏప్రిల్
గ్రహ సంచారం మధ్యస్థంగా ఉన్నాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.సమాజంలో మంచి గుర్తింపు ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సంయమనం పాటించాలి. సంతానం విషయంలో అధిక ఖర్చు చేయాల్సి వస్తుంది. విద్యార్థులు పట్టుదలతో చదవాల్సి ఉంటుంది. ఒక్కొక్క సమయాల్లో వ్యవహారాల్లో కోపాలకు ఉద్రేకాలకు లోనవుతారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. ఆదాయం సామాన్యంగా ఉంటుంది.శత్రువుల వలన ఇబ్బందులు తప్పవు.

మే
అన్ని రంగాల వారికి కలిసి వస్తుంది.విద్యార్థులకు ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి.వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలించును.మన సంకల్పం నెరవేరుతుంది.ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగస్తులకు సహ ఉద్యోగాలలో ఒత్తిడులు ఉంటాయి.లౌక్యం అవసరం.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.ప్రతి విషయంలోనూ ధైర్యంతో ముందుకు సాగుతారు.ప్రయాణ మరియు కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.సంతానం ద్వారా లాభాలు పొందుతారు.
 

జూన్
అవకాశాలను అందిపుచ్చు కుంటారు.నూతన వ్యాపార ప్రయత్నాలు ఫలిస్తాయి.ఏ పని తలపెట్టిన సకాలంలో పూర్తి అవుతాయి.మాసాంతంలో గ్రహ సంచారం అనుకూలంగా లేనందున సమస్యలు పెరుగుతాయి.మానసికంగా ఆందోళన పెరుగుతుంది.విద్యార్థులు చదువు విషయంలో మరింత శ్రద్ధ కృషి అవసరం. పెట్టుబడులు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించాలి.శత్రువర్గం వృద్ధి చెందుతుంది.కుటుంబ సభ్యులతో అకారణంగా మాట పట్టింపులు రాగలవు.


జూలై
మొదటి రెండు వారాలు గ్రహ సంచారం అంతా అనుకూలంగా లేదు. చివర రెండు వారాలు అనుకూలంగా ఉంటుంది.చేయు వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది. ఆర్థిక విషయాలు బాగుంటాయి.వ్యవహారాల యందు ధైర్యంగా ముందుకు సాగుతారు.గత సమస్యలకు కొన్ని పరిష్కారం అవును.సంతాన సౌఖ్యం లభిస్తుంది. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు.సంఘంలో ఉన్నతమైన స్థితి ఏర్పడుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.ఖర్చుల విషయంలో ఆచితూచి వ్యవహరించాలి.


ఆగస్టు
ఈనెల కొద్దిపాటి ప్రతికూల వాతావరణం ఉంటుంది.తలపెట్టిన పనుల్లో పట్టుదల శ్రమ చూపగలిగితే అన్నిటా విజయం సాధిస్తారు.ముఖ్యమైన వస్తువుల విషయంలో జాగ్రత్త శ్రద్ధ వహించవలెను.ఏ విషయాన్ని అయినా తేలికగా తీసుకోకూడదు. వ్యాపారంలో పోటీ తత్వానికి దూరంగా ఉండాలి.కుటుంబ సభ్యులు తో సంయమనం పాటించడం తప్పనిసరి.వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది.ఆర్థిక విషయాలు బాగుంటాయి.కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ పరిష్కారం అవుతాయి.

సెప్టెంబర్
వ్యవహారాల్లో అన్నింట మీదే పై చేయగా ఉంటుంది.అన్ని రంగాల వారికి అభివృద్ధి కనిపిస్తుంది.వైవాహిక జీవితాన్ని ఆనందంగా గడుపుతారు.దూరపు ప్రయాణాలు చేస్తారు.సోదరుల తో సఖ్యత ఏర్పడుతుంది.రాజకీయ నాయకులును కలుసుకుంటారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొద్దిపాటి మనస్పర్థలు రాగలవు.శుభకార్య ప్రయత్నాల్లో లౌక్యంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాల్లో జాగ్రత్తలు తప్పనిసరి.అప్పుల నుండి ఉపశమనం పొందుతారు.


అక్టోబర్
గృహ నిర్మాణాధి పనులు కలిసి వస్తాయి.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాల్లో అఖండమైన ఐశ్వర్యాలు పొందగలరు.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.తలచిన తలంపు గానే పనులన్నీ పూర్తి కా గలుగుతాయి. ఆదాయానికి మించిన ఖర్చులు దుబారా ఖర్చులు పెరుగుతాయి.అనవసరమైన విషయాలు లో తల దూర్చడం వల్ల విలువలు ను కోల్పోతారు.కుటుంబ సభ్యులతో విరోధాలు తలెత్తుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహంగా ఉంటుంది.


నవంబర్
ఈ మాసం మిశ్రమంగా ఉంటుంది.తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.శుభకార్యాల నిమిత్తం ఖర్చులు పెరుగుతాయి .శత్రువుల వలన ఇబ్బందులు తలెత్తుతాయి.కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు రాగలవు.సంతానం రీత్యా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి.ఎంతటి కార్యాన్ని అయినా ధైర్యంగా నిర్దిష్టమైన సమయంలో పూర్తి చేస్తారు.

డిసెంబర్
వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగును.ఆరోగ్యం బాగుంటుంది.ఆర్థికపరంగా నిలదొక్కుకుంటారు.రావలసిన బాకీలు వసూలు అవుతాయి.కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం.వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు. సంతాన సౌఖ్యం లభిస్తుంది.శత్రువులపై ఆధిక్యత ప్రదర్శిస్తారు.పొదుపు మార్గాలు అన్వేషణ చేస్తారు.అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల తో సత్సంబంధాలు పెరుగుతాయి.మీ మాటకు ఇంటా బయట గుర్తింపు ఏర్పడుతుంది.

జనవరి
ఇంటా బయట సహాయ సహకారాలు లభించవు.సమాజంలో నిందలు అపకారం జరిగే పరిస్థితి ఉంది.అనవసరమైన విషయాలు లో పట్టుదల ప్రదర్శించుట మంచిది కాదు.భాగస్వామిక వ్యాపారాల వలన వృద్ధి చెందుతారు.న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది.అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి.బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాలు లో పాల్గొంటారు.ఇతరుల విషయాల్లో జోక్యం చేసు కొనుట మంచిది కాదు.గతంలో ఉన్నటువంటి సమస్యలు తీరును.మానసికంగా ఆనందంగా గడుపుతారు.

ఫిబ్రవరి
అన్ని రంగాల వారికి ఆర్థికంగా బాగుంటుంది.ఆరోగ్యం అనుకూలిస్తుంది. ఆదాయానికి ఎటువంటి లోటు ఉండదు.గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగుతాయి.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.గతంలో పరిష్కారం కాని అనేక సమస్యలు పరిష్కరించుకుంటారు.సంతానం విషయంలో చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు.ఉద్యోగస్తులకు అనుకూలమైన సమయం.

మార్చి
ఇంటా బయట సామాన్యమైన పరిస్థితులు ఉంటాయి.ఆదాయం అవసరానికి సరిపడా లభించును.సహోద్యోగులతో మరియు సోదరి వర్గంతో ను లౌక్యం గా ఉండాలి.విద్యార్థులు పట్టుదల క్రమశిక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి.క్రయవిక్రయాల విషయంలో అనుభవజ్ఞులు సలహా తీసుకొనుట మంచిది.కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి.ఉద్యోగస్తులకు ప్రభుత్వ మరియు అధికారుల నుంచి వేధింపులు పెరుగుతాయి.ఇంటా బయట గొడవలు పెరుగుతాయి.

Latest Videos

click me!