Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర తుల రాశి ఫలితాలు

First Published | Apr 5, 2024, 2:35 PM IST


శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన  తుల రాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు  తులరాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.

Libra

 తుల రాశి   అధిపతి గురుడు 3-6 శని 4-5
 
తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)

ఆదాయం:-2
వ్యయం:-8

రాజపూజ్యం:-1
అవమానం:-5

ఈ రాశి వారికి గురుడు 1-5-24 వరకు కళత్ర స్థానంలో లోహ మూర్తి గా సంచరించి. తదుపరి సంవత్సరాంతం అష్టమ స్థానంలో లోహ మూర్తి గా సంచారం.

శని ఈ సంవత్సరమంతా రజత మూర్తి గా పంచమ స్థానంలో సంచారం.

రాహువు ఈ సంవత్సరమంతా శత్రు స్థానంలో లోహ మూర్తి గా సంచారం.

కేతువు ఈ సంవత్సరమంతా లోహ మూర్తి గా వ్యయ స్థానంలో సంచారం.

మే నుంచి అష్టమ స్థానం వలన పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.వ్యవహారాల్లో ముందుచూపు అవసరం.ప్రతి పని పట్టుదలతో ప్రయత్నించాలి. రుణభారం పెరగనీయకుండా ఖర్చులు యందు నియంత్రణ అవసరం.వ్యాపారస్థులకు ఈ సంవత్సరం సామాన్యంగా ఉంటుంది.దొంగతనాలు జరిగే అవకాశం. ఉద్యోగాలలో అధికారులు తో కత్తి మీద సాము వలె ఉంటుంది.ఊహించని విపత్తులు సంఘటనలు ఎదురవుతాయి.సన్నిహితులతో మీ ప్రవర్తన వలన వివాదాలు రాగలవు.జీవన విధానం సాఫీగా జరగడం కోసం తగిన జాగ్రత్తలు నియమాలు పాటించడం అవసరం.ఆర్థిక ఇబ్బందులు ఎదురవగలవు. ఆర్థిక పరమైన విషయంలో జాగ్రత్త వహించాలి.విదేశీ ప్రయాణాలు ప్రయత్నాలు ఫలిస్తాయి.అకారణంగా అన్నదమ్ముల తో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు మనస్పర్థలు రాగలవు. శారీరక ఇబ్బందులు పెరుగుతాయి.

శని ఈ సంవత్సరం అంతా పంచమ స్థానంలో సంచారం. మానసికంగా ఆందోళన గా ఉండటం.సంతాన మూలకంగా ఇబ్బందులు. కుటుంబానికి దూరంగా జీవనం చేయవలసి వస్తుంది.

రాహువు సంచారం అనుకూలం. శత్రువుల పై చేయి సాధిస్తారు.సాహసోపేతమైన కార్యం తలపెట్టి తారు.అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పరిశ్రమల్లో లేక వ్యవస్థలో కార్య నిర్వహణ సక్రమంగా నిర్వహించగలరు.విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించుటలో పోటీపడతారు.కళాకారులు విశేషమైన గౌరవ పురస్కారాలు లభిస్తాయి.గృహంలో శుభకార్యాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి.

కేతు సంచారం వలన పనులు లో శ్రమ అధికంగా ఉంటుంది.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. విదేశీ ప్రయాణాలు లో అనుకున్న దానికన్నా అధికంగా ఖర్చవుతుంది.


చిత్త నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి జన్మతారలో లో సంచారం.

శని 3-10-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి సంపత్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు విపత్తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  క్షేమ తార లో సంచారం

కేతువు 11-11-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం మిత్ర తార లో సంచారం

Libra - Tula

స్వాతి నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి మిత్ర తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి పరమ మిత్ర తార లో లో సంచారం.

శని 3-10-24 వరకు సంపత్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి జన్మతారలో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు సంపత్తార లో సంచారం.

రాహు 7-7-24 వరకు క్షేమతార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  విపత్తార లో సంచారం.

కేతువు 11-11-24 వరకు మిత్ర తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం నైధనతార లో సంచారం

విశాఖ నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి నైధనతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి మిత్ర తార లో సంచారం.

శని 3-10-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 04-12-24 నుంచి పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు జన్మతారలో సంచారం.

రాహువు 7-7-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  సంపత్తార లో సంచారం.

కేతువు 11-11-24 వరకు నైధనతార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం సాధన తార లో సంచారం

(ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని కేతు సంచారం అనుకూలంగా లేనందున గురు చరిత్ర పారాయణం మరియు ఆంజనేయ మరియు గణపతి ఆరాధన చేయడం మంచిది)

ఏప్రిల్
గ్రహ సంచారం ప్రతికూలంగా ఉండుడిచే అన్ని విషయాలు లో ఆటంకాలు ఏర్పడతాయి.నూతనమైన పనులు ప్రారంభించ గలరు. ఇతరుల వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది. వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది. ఆరోగ్య విషయాలు అనుకూలిస్తాయి. ఆర్థికపరమైన విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం. విందులు వినోదాల్లో పాల్గొంటారు. సంతాన సౌఖ్యం లభిస్తుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకు తగాదాలు రావొచ్చు.

మే
అనారోగ్య సమస్యలు రాగలవు.వ్యవహారాల్లో ఆలోచనలు సక్రమంగా లేకపోవడం వలన వస్తు నష్టము ఆటంకాలు ఏర్పడతాయి.ఉద్యోగాలలో అంకిత భావంతో వ్యవహరించాలి.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. అన్ని రంగాల వారికి అన్ని విధాలా బాగుంటుంది. తలపెట్టిన కార్యాలు సకాలంలో పూర్తి చేస్తారు.సంతాన సౌఖ్యం లభిస్తుంది. వివాహాలు శుభకార్యాలలో పాల్గొంటారు.సమాజంలో ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు ఏర్పడతాయి.

జూన్
సమాజంలో మీ మాటకు ఎదురుండదు.మీ సలహాలు తీసుకుని ఇతరులు లబ్ధి పొందుతారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.నూతన వస్తు మరియు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.అన్ని విధాల అందరికీ యోగదాయకం గా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.ఉద్యోగాలలో ప్రోత్సాహకరంగా ఉంటాయి. గత సమస్యలు ఏవైనా ఉంటే తిరిగి సమస్య గా మారతాయి. బంధు వర్గం తో విరోధాలు రాగలవు. కోర్టు వ్యవహారాలు తేలిక పోవుట వలన ఇబ్బందులు పడతారు.కోపతాపాలు ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి.

జూలై
ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి.విద్యార్థులు లక్ష్యాన్ని చేరుకుంటారు. సమాజంలో అందరి మన్ననలను పొందుతారు. వ్యవహారాల్లో మీదే పైచేయి గా ఉంటుంది. ఆరోగ్య విషయాలు బాగుంటాయి.గత సమస్యలు ఏవైనా ఉంటే అవి పరిష్కారం అవును. ఉద్యోగాలలో అధికారం లభిస్తుంది.భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ఆనందంగా గడుపుతారు.నూతన పరిచయాలు లాభిస్తాయి.ఆర్థిక విషయాలు బాగుంటాయి. కుటుంబంలో చిన్నపాటి ఉత్సవాలు జరుగును. ఖర్చు విషయంలో నియంత్రణ అవసరం.

ఆగస్టు
ఈనెల గ్రహ సంచారం తో అనుకూల ఫలితాలను పొందగలరు. ప్రయత్నం జన కార్యాలలో వేగవంతంగా పూర్తి అవుతాయి. ఆరోగ్య సమస్యలు తీరి ప్రశాంతత లభిస్తుంది.శుభవార్తలు వింటారు. ఆర్థిక విషయాలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.విద్యార్థులు స్నేహ వర్గంతో జాగ్రత్తలు చూపించుకోవాలి నూతన ఆలోచనలు ప్రణాళికలతో ముందంజ వేస్తారు.రుణ బాధలు తీరుతాయి.వివాహాది శుభకార్యాలు ముందు కు సాగును. మిత్రుల వలన పెద్దవారితో స్నేహ సంబంధాలు కలుగుతాయి.
 

సెప్టెంబర్
భూ సంబంధమైన వ్యవహారములలో జాగ్రత్త వహించడం మంచిది. అనుకోని సమస్యల వలన కుటుంబంలో కలహాలు రాగలవు. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు వద్దు అనుకున్న లేకపోయినా కొన్ని ప్రయాణాలు తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది.బంధు వర్గం చిన్నపాటి విమర్శలు విరోధాలు ఎదుర్కోవలసి ఉంటుంది. ఉద్యోగులకు స్థానచలనం వార్త వింటారు.
ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబంలో మరియు అందరితోనూ మాట పట్టింపులు రాగలరు.
 

అక్టోబర్
వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి ముందుకు సాగుతారు. అవసరాలకు అనుగుణంగా ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి.బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.కష్టపడి న శ్రమకు తగ్గ ప్రతిఫలం లభిస్తుంది.భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి.దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.స్థిరాస్తి విషయంలో జాగ్రత్త అవసరం.ఆర్థిక వికాసం కలుగుతుంది.
 

నవంబర్
కుటుంబం ఆనందదాయకంగా ఉంటుంది.ఆరోగ్య విషయాలు అనుకూలంగా ఉంటాయి.బంధు మిత్రులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. చేయు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.అనేక మార్గాల ద్వారా ఆదాయం లభిస్తుంది. తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.బాధ పెట్టే సమస్య ఉంటే అవి పరిష్కారం లభిస్తుంది.ఉద్యోగాలలో అధికారులు తో మన్ననలు పొందగలరు.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు.

డిసెంబర్
ఈ నెల అంతా ఉత్సాహంగా గడుపుతారు.భవిష్యత్తు ఆలోచన చేస్తారు.ప్రతిభకు తగ్గ గౌరవం లభిస్తుంది.ఉద్యోగాలలో పదోన్నతులు అనుకూలమైన బదిలీలు ఉంటాయి.బంధుమిత్రులు ఉపకారము ఏర్పరచుకుంటారు.గతంలో వాయిదా పడిన పనులు పునఃప్రారంభం అవుతాయి.శుభవార్తలు వింటారు. సొంత తెలివితేటలు వల్ల అందరినీ ఆకర్షిస్తారు.మీ శక్తి సామర్థ్యాలను రుజువు చేసుకుంటారు. ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. గతంలో ఉన్న సమస్యల పరిష్కారం అవును.

తులరాశి :- ఈ నెలలో అనవసరమైన సమస్యలకు దూరంగా ఉండాలి. ఆత్మీయ మిత్రుల, బంధువుల అండ దండలు లభిస్తాయి. శుభకార్యా నిర్వాహణకు పరిస్థితులు అనుకూలిస్తాయి.దైర్య సాహసాలు తగ్గినను నష్టాలు మాత్రం కలుగవు. శాస్ర్త చికిత్స అవసరపడవచ్చు ఆరోగ్యాన్ని, ఆహారాన్ని జాగ్త్రత్తతో చూసుకోవాలి. జీవిత భాగస్వామి సలహాలను పెడచెవిన పెట్టవద్దు.చేసే పనిలో ఒకటికి రెండు సార్లు ఆలోచన బలంగా చేయాలి.రెండవ వారంలో కుటుంబ అంశాలలో దృష్టి సారించాలి. ఇంటి సమస్యలను ఇతరులకు చెప్పకండి. ఎవరిని విమర్శించవద్దు. అనుకూలమైన శుభ ఫలితాల కొరకు పావురాలకు బెల్లం పట్టించిన ధాన్యపు గింజలను,త్రాగడానికి నీళ్ళను వాటికి అందివ్వండి.


జనవరి
అనుకున్న పనులు పూర్తి చేసుకోగలరు. ప్రయత్నించే కార్యాలలో లక్ష్యం ఏర్పరచుకోవాలి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.వివాహ ఉద్యోగ  ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్య విషయాలు బాగుంటాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.వ్యవహారాల ధైర్యంగా పట్టుదలతో ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో అనుకూలమైన వాతావరణం.నూతన వస్తు వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.


ఫిబ్రవరి
వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది.నూతన అవకాశాలు పొందుతారు.స్థిరాస్తి   ఏర్పాటు చేసుకుంటారు.బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.నూతన వ్యాపారాలు వ్యవహారాలకు శ్రీకారం చుడతారు.అన్ని రంగాల వారికి అనుకూలం.ఆదాయ మార్గాలు అనుకూలంగా ఉంటాయి.గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఉద్యోగాలలో అధికారుల సహకారం లభిస్తుంది. శత్రువులపై ఆధిక్యత సాధిస్తారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం.

మార్చి
సమాజంలో చిన్నపాటి విమర్శలకు గురవుతారు.బంధువర్గం అవసరములకు దూరంగా ఉంటారు.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. ప్రయత్నించిన కార్యాలలో తెలియని ఆటంకాలు ఏర్పడతాయి. ఉద్రేకం కోపం ఉండటం వల్ల తలపెట్టిన కార్యాలు ఆలస్యం అవుతాయి. ఇతరులను బాధపెట్టే మాటల వల్ల ఇబ్బందులు కలుగుతాయి.బంధుమిత్రులతో ఆ కారణంగా కలహాలు రాగలవు.వాహన ప్రమాదం లేక శరీర గాయాలు తగలవచ్చు.చిన్నపాటి స్వల్పంగా ఇబ్బందులు ఉంటాయి.ఆదాయ మార్గాలు బాగుంటాయి.సంతాన సౌఖ్యం లభిస్తుంది. దైవ ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

 జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  

Latest Videos

click me!