Today Horoscope: ఈ రోజు ఓ రాశివారికి అకస్మిక ధనలాభం

First Published | Apr 5, 2024, 5:30 AM IST

Today Horoscope: రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికి శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

telugu astrology


5-4-2024,  శుక్రవారం మీ  రాశి ఫలాలు (దిన ఫల,తారా ఫలాలు తో..)

మేషం (అశ్విని  భరణి  కృత్తిక 1)
నామ నక్షత్రాలు (చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
తారాధిపతి
అశ్విని నక్షత్రం వారికి ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) చేపట్టిన పనులు ఆలస్యం అయినా పూర్తి కాగలవు. యంత్రాలతో పనిచేసేవారు జాగ్రత్త అవసరం. అపవాదము రాగలదు.

భరణి నక్షత్రం వారికి క్షేమతార ( క్షేమ తారాధిపతి గురువు) మీకు ఇష్టమైన కార్యాలు సిద్ధిస్తాయి. ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు పెరుగుతాయి. ధన లాభం.

కృత్తిక నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) చేసే వ్యవహారాలలో భావోద్వేగాలను అదుపు చేసుకుని వ్యవహరించాలి. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-తలపెట్టిన కార్యాలలో విజయం సాధిస్తారు.వ్యాపారాల్లో ధనాభివృద్ధి. ఆరోగ్య విషయంలో ఉపశమనం లభిస్తుంది.విద్యార్థులకు అనుకూలం.కార్యసాధన పై మనసు నిలుపుతారు. పలుకుబడితో పనులు నెరవేరుతాయి.సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.ఆదాయం పెరుగుతుంది.మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు.ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాధిపతి
రోహిణి నక్షత్రం వారికి సంపత్తార  (‌సంపత్ తారాధిపతి బుధుడు) మీ ప్రయత్నాలు లో సానుకూల ఫలితాలను పొందగలరు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలు ధన లాభం.

మృగశిర నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోవడం. కుటుంబంలో ప్రతికూలత.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

దిన ఫలం:-తలపెట్టిన పనులు నిదానంగా పూర్తి కాగలవు.ఆర్థిక విషయాలు కొంతమేర ఇబ్బందులు కలుగును. ఉద్యోగంలో అధిక శ్రమ ఒత్తిడి పెరుగుతుంది.ప్రభుత్వ పనులు సకాలంలో పూర్తవుతాయి. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. శుభకార్యాలకు హాజరవుతారు.దైవ కార్యక్రమంలో పాల్గొంటారు.సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి.ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఓం భానవే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 


telugu astrology


మిథునం (మృగశిర 3 4 ఆరుద్ర పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాధిపతి
ఆరుద్ర నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) చేపట్టిన పనులు ఆలస్యం అయినా పూర్తి కాగలవు. యంత్రాలతో పనిచేసేవారు జాగ్రత్త అవసరం. అపవాదము రాగలదు.

పునర్వసు నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి

దిన ఫలం:-వ్యాపారంలో అధిక ఆదాయం లభిస్తుంది. తలచిన కార్యాలు అప్రయత్నముగా పూర్తగును. విలాసవంతంగా గడుపుతారు.చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి.మానసికంగా ప్రశాంతత లభిస్తుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు పొందవచ్చు.సంతానం విద్యా విషయాలు లో శుభవార్త వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు.ఓం ధనలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాధిపతి
పుష్యమి నక్షత్రం వారికి నైధన తార (నైధన తారాధిపతి శని) సోదరులతో చిన్నపాటి విభేదాలు రాగలవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వ్యవహారాలు శ్రమతో పూర్తి కాగలవు.

ఆశ్రేష నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా జరుగును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

దిన ఫలం:-వ్యక్తిగతంగా విలువ పెరుగుతుంది.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఇంటా బయటా పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి.ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు.అధికారులు తో ఆదరణ పొందుతారు.సహోద్యోగుల సహకారం లభిస్తుంది.శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి.నూతన వాహనం కొనుగోలు చేస్తారు .ఓం శశిధరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

telugu astrology

సింహం (మఖ , పుబ్బ ,ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాధిపతి
మఘ నక్షత్రం వారికి  ప్రత్యక్తార (ప్రత్యక్ తారాధిపతి కేతువు ) ఉద్యోగాలలో అధికారులు తో వాదోపవాదములు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అకారణ కలహాలు ఏర్పడతాయి.

పూ.ఫ నక్షత్రం వారికి  క్షేమ తార ( క్షేమ తారాధిపతి గురువు) మీకు ఇష్టమైన కార్యాలు సిద్ధిస్తాయి. ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు పెరుగుతాయి. ధన లాభం.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి విపత్తార (విపత్ తారాధిపతి రాహువు) చేసే వ్యవహారాలలో భావోద్వేగాలను అదుపు చేసుకుని వ్యవహరించాలి. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-కుటుంబంలో గందరగోళ పరిస్థితులు.చేసే పనుల్లో మానసిక ఒత్తిడి అధికమవుతుంది.వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.ఖర్చుల నియంత్రణ అవసరం.చిన్న విషయాన్ని కూడా నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు.శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.ఇంటాబయటా సమస్యలు ఉత్పన్నమవుతాయి. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology


క‌‍న్య (ఉత్తర 2 3 4 హస్త  చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
తారాధిపతి
హస్త నక్షత్రం వారికి సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) మీ ప్రయత్నాలు లో సానుకూల ఫలితాలను పొందగలరు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలు ధన లాభం.


చిత్త నక్షత్రం వారికి జన్మ తార (జన్మ తారాధిపతి రవి) ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోవడం. కుటుంబంలో ప్రతికూలత.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

దిన ఫలం:-అన్ని వృత్తుల వారికి అనుకూలంగా ఉండును. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.ఆర్థిక విషయాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.స్నేహితులతో మంచి అనుబంధం ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. నగలు, బట్టలు కొనుక్కుంటారు.  ప్రభుత్వ రంగంలో అవకాశాలు కోసం ఎదురు చూసే వారికి మంచి ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగాలు లో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు.వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఓం భాగ్యలక్ష్మి యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి  విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాధిపతి
స్వాతి నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) చేపట్టిన పనులు ఆలస్యం అయినా పూర్తి కాగలవు. యంత్రాలతో పనిచేసేవారు జాగ్రత్త అవసరం. అపవాదము రాగలదు.

విశాఖ నక్షత్రం వారికి  మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) ముఖ్యమైన కార్యక్రమాలు లో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి

దిన ఫలం:-పరిస్థితికి తగిన విధంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యులు తో అకారణంగా విరోధాలు చిక్కులు వస్తాయి. తొందరపాటు నిర్ణయాల వలన ఇబ్బంది రావచ్చు.ఉద్యోగాలలో  ఓర్పు సహనం వహించాలి. వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాలి.మనో ధైర్యం పెంచుకోండి.వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ వాతావరణం చిరాకుగా ఉంటుంది.ఓం కామేశ్వర్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology

వృశ్చికము (విశాఖ 4, అనూరాధ జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాధిపతి
అనూరాధ నక్షత్రం వారికి  నైధన తార (నైధన తారాధిపతి శని) సోదరులతో చిన్నపాటి విభేదాలు రాగలవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వ్యవహారాలు శ్రమతో పూర్తి కాగలవు.

జ్యేష్ట నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా జరుగును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

దిన ఫలం:-ఖర్చుల విషయంలో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అవసరం.ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.వ్యవహారాల్లో జాగ్రత్త పడాల్సిన అవసరం.ప్రయాణాల విషయంలో కొంత ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది.ముఖ్యమైన వ్యవహారాల్లో స్థిరత్వం లేని ఆలోచనలు వలన నష్టం జరగవచ్చు.ఓం మహాదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology

ధనుస్సు (మూల పూ.షాఢ, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు (యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాధిపతి
మూల నక్షత్రం వారికి ప్రత్యక్తార(ప్రత్యక్ తారాధిపతి కేతువు ) ఉద్యోగాలు లో అధికారులు తో వాదోపవాదాలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అకారణ కలహాలు ఏర్పడతాయి.

పూ.షాఢ నక్షత్రం వారికి క్షేమ తార( క్షేమ తారాధిపతి గురువు) మీకు ఇష్టమైన కార్యాలు సిద్ధిస్తాయి. ఉన్నతమైన వ్యక్తులు తో పరిచయాలు పెరుగుతాయి. ధన లాభం.

ఉ.షా నక్షత్రం వారికి  విపత్తార(విపత్ తారాధిపతి రాహువు) చేసే వ్యవహారాలలో భావోద్వేగాలను అదుపు చేసుకుని వ్యవహరించాలి. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండాలి.

దిన ఫలం:-అనవసరపు ఖర్చులు పెరుగుతాయి.తలపెట్టిన పనులు వాయిదా వేస్తారు.వాహన ప్రయాణాలలో తగు జాగ్రత్త అవసరం.వ్యాపార లావాదేవీలు లో మిశ్రమ ఫలితాలు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.విద్యార్థిని విద్యార్థులు కృషి పట్టుదలతో చదవాలి.ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నిలకడ తక్కువగా ఉంటుంది.. ఉద్యోగాలు లో అదనపు బాధ్యతలు పెరుగుతాయి. వృధా ప్రయాణాలు చెయ్యాల్సి వస్తుంది.ఓం లక్ష్మీ గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

telugu astrology


మకరము (ఉ.షాఢ 2 3 4 శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాధిపతి
శ్రవణా నక్షత్రం వారికి  సంపత్తార (సంపత్ తారాధిపతి బుధుడు) మీ ప్రయత్నాలు సానుకూల ఫలితాలను పొందగలరు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం. వృత్తి వ్యాపారాలు ధన లాభం.

ధనిష్ఠ నక్షత్రం వారికి జన్మ తార(జన్మ తారాధిపతి రవి) ప్రారంభించిన పనులు మధ్యలో నిలిచిపోవడం. కుటుంబంలో ప్రతికూలత.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

దిన ఫలం:-మానసిక క్షోభకు గురి అవుతారు.ఆర్థికంగా కొంత ఇబ్బందులు కలుగుతాయి. బంధుమిత్రులతో అకారణంగా వివాదాలు రాగలవు.తెలివి తేటలతో సమస్యలు అధిగమిస్తారు.వ్యవహారాలలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి.నిరుద్యోగుల కలలు సాకర మౌతాయి. ధన వ్యవహారాలు కలిసివస్తాయి. మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.ఓం కార్తికేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4 శతభిషం 1 2 3 4 పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాధిపతి
శతభిషం నక్షత్రం వారికి పరమ మిత్ర తార (పరమ మిత్ర తారాధిపతి కుజ) చేపట్టిన పనులు ఆలస్యం అయినా పూర్తి కాగలవు. యంత్రాలతో పనిచేసేవారు జాగ్రత్త అవసరం. అపవాదము రాగలదు.

పూ.భాద్ర నక్షత్రం వారికి మిత్ర తార (మిత్ర తారాధిపతి శుక్ర) ముఖ్యమైన కార్యక్రమాలలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును.ఉద్యోగాలు అనుకూలిస్తాయి

దిన ఫలం:-ఆశించిన ఫలితాలను పొందవచ్చు. వ్యవహార శైలిలో మార్పులు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. ఉద్యోగాలలో ఆశించిన ఫలితాలను పొందవచ్చు. ఉద్యోగాలు లో ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా వుంటాయి.ఆకస్మిక ధన లాభం.ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.చిన్ననాటి మిత్రులు తో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఓం వెంకటేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4 ఉ.భాద్ర, రేవతి )
నామ నక్షత్రాలు(దీ--దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాధిపతి
ఉ.భాద్ర  నక్షత్రం వారికి  నైధన తార (నైధన తారాధిపతి శని) సోదరులతో చిన్నపాటి విభేదాలు రాగలవు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. వ్యవహారాలు శ్రమతో పూర్తి కాగలవు.

రేవతి నక్షత్రం వారికి సాధన తార (సాధన తారాధిపతి చంద్రుడు) వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా జరుగును. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

దిన ఫలం:-కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహ పరుస్తాయి. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు.చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి కాక చికాకులు పెరుగుతాయి.ఓం పార్వత్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందగలరు.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Latest Videos

click me!