Cancer Horoscope: 12.09.2025 శుక్రవారానికి సంబంధించిన కర్కాటక రాశి ఫలాలు ఇవి. నేడు ఈ రాశివారికి ఆరోగ్యం, వ్యాపారం, ఉద్యోగాల్లో ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
కర్కాటక రాశి ఫలాలు (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష)
నేడు కర్కాటక రాశి వారి జాతకం ఎలా ఉండనుంది? ఈ రాశివారికి కలిగే లాభాలు, నష్టాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్న వివరాలు ఇలా ఉన్నాయి. ఓసారి తెలుసుకుందామా...
24
ఆర్థిక పరిస్థితి
ఆర్థికంగా అంతగా లాభాలు లేకపోయినా.. నష్టాలు తలెత్తే అవకాశం తక్కువే. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. ఆరోగ్య పరంగా కూడా పెద్దగా ఇబ్బందులు ఉండవు. దూరపు బంధువుల రాక వల్ల ఇంటి వాతావరణం సందడిగా మారుతుంది. దానివల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మీయులతో గడిపే ఈ సమయం మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది.
సమాజంలో ప్రముఖుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి కావడం వల్ల ఈ రాశివారికి మంచి గుర్తింపు దక్కుతుంది. ఇది భవిష్యత్తులో కొత్త అవకాశాలకు బాటలు వేస్తుంది. మీ సోషల్ నెట్వర్క్ మరింత బలపడుతుంది.
34
ఉద్యోగం
ఉద్యోగాల్లో కొంత అనుకూల వాతావరణం ఉంటుంది. పై అధికారుల నుంచి మద్దతు లభించకపోయినా.. ఒత్తిడిలేకుండా పని పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు కలిసివస్తుంది. గతంలో ఇచ్చిన దరఖాస్తులకు స్పందన లభించడం, ఇంటర్వ్యూలకు హాజరుకావడం వంటి సానుకూల ఫలితాలు ఉంటాయి. కోరుకున్న రంగంలో అవకాశాన్ని అందుకునే వీలుంది.
వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. లాభాలు ఆశించిన స్థాయిలో లేకపోయినా, నష్టాలు లేకుండా కొనసాగుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టకుండా.. ప్రస్తుత వ్యాపారాన్ని స్థిరంగా కొనసాగించడం ఉత్తమం.