Shani Sade Sati: ఈ 3 రాశులపై 2027 వరకు ఏలినాటి శని ప్రభావం

Published : Feb 04, 2026, 01:50 PM IST

Shani Sade Sati: జ్యోతిషశాస్త్రంలో ఏలినాటి శని ఎంతో ప్రభావవంతమైనది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి, కుటుంబ సమస్యలు, పనిలో ఆటంకాలు వస్తాయి. మూడు రాశుల వారికి 2027 వరకు ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. 

PREV
13
మేష రాశి

మేష రాశి వారిపై ఏలినాటి శని ప్రభావం ఉంటుంది. అందుకే వీరు ఎంతో సహనంతో ఉండాలి. అనుభవజ్ఞుల సలహా తీసుకున్న తర్వాతే కొత్త పనులు మొదలుపెట్టండి. ఈ సమయంలో ఖర్చులు పెరుగుతాయి. ఏ పని చేయడానికైనా అడ్డదారులు తొక్కకూడదు. మీ దగ్గరి సంబంధాల్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. వీరు పరిహారంగా శనీశ్వరుడికి నల్ల నువ్వులు సమర్పిస్తే మంచిది.

23
కుంభ రాశి

కుంభ రాశి వారు ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరు ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఎక్కవైనా పెట్టుబడుల విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఈ సమయంలో ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి దగ్గరి బంధువులతో గొడవలు రావచ్చు. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వారికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. వీరు పరిహారంగా నల్లని వస్తువులు ఎవరికైనా దానం చేస్తే మంచిది.

33
మీన రాశి

మీన రాశి వారిపై కూడా ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది. వీరు కొత్త స్నేహితులు, బంధుత్వాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సొంత ఆరోగ్యంపై  తగినంత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. వీరికి 2027 వరకు ఆర్థిక సమస్యలు వెంటాడుతాయి.  వాహనం కొనాలనుకునేవారికి ఎన్నో ఇబ్బందులు వస్తాయి. కోర్టు తీర్పులు ఈ రాశి వారికి వ్యతిరేకంగా వస్తాయి. వీరు పరిహారంగా రావి చెట్టు కింద దీపం పెడితే మంచిది.

Read more Photos on
click me!

Recommended Stories