తుల రాశిలో బుధ, శుక్రుల కలయిక.. ఈ 4 రాశులవారికి కష్టాలు తీరినట్లే!

Published : Nov 06, 2025, 03:56 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో రెండు శక్తివంతమైన గ్రహాలు ఒకే రాశిలో కలవనున్నాయి. వీటి కలయిక 4 రాశులవారి జీవితాల్లో ఊహించని మార్పులు తీసుకురానుంది. వారి వైవాహిక జీవితం సంతోషంగా మారడంతోపాటు.. వృత్తి, వ్యాపారాల్లో ఊహించని లాభాలు వస్తాయి. 

PREV
15
తుల రాశిలో బుధ, శుక్రుల కలయిక

జ్యోతిష్య శాస్త్రంలో శుక్ర, బుధ గ్రహాలను శుభ గ్రహాలుగా పరిగణిస్తారు. శుక్రుడు సంపద, విలాసం, అందం, జ్ఞానం, సౌకర్యాలకు కారకుడు. బుధుడు వ్యాపారం, వాక్కు, చదువు, తెలివితేటలకు అధిపతి. నవంబర్ 2న శుక్రుడు తుల రాశిలోకి ప్రవేశించాడు. నవంబర్ 26 వరకు అక్కడే ఉంటాడు. నవంబర్ 23న బుధుడు తుల రాశిలోకి ప్రవేశించి డిసెంబర్ 6 వరకు అక్కడే ఉంటాడు. బుధ, శుక్రుల కలయిక వల్ల 4 రాశులవారికి మేలు జరుగుతుంది. వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకోండి. 

25
తుల రాశి

బుధ, శుక్రుల కలయిక తుల రాశివారి మొదటి ఇంట్లో (లగ్న స్థానంలో) జరుగుతుంది. కాబట్టి ఈ రాశి వారు నవంబర్ 23 నుంచి అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వ్యక్తిగత ప్రతిభ, ఆత్మవిశ్వాసం రెండూ పెరుగుతాయి. మీ మాట తీరు మధురంగా, ఆకర్షణీయంగా మారుతుంది. దానివల్ల అనుకున్నది సాధిస్తారు. వివాహ జీవితం, ప్రేమ బంధంలో ఉన్న అభిప్రాయ భేదాలు తొలగిపోయి సంతోషం పెరుగుతుంది. కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాన్ని విస్తరించే అవకాశాలు ఉన్నాయి. 

35
కన్య రాశి

శుక్ర, బుధుల కలయిక కన్య రాశి 12వ ఇంట్లో జరుగుతుంది. కన్య రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఈ రాశివారు అనేక విధాలుగా ప్రయోజనం పొందుతారు. పాత పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందే అవకాశం ఉంది. బుధుడు రచన, వాక్చాతుర్యాన్ని అందిస్తాడు. దానివల్ల ఇతరులను సులభంగా ఆకర్షిస్తారు. పని ప్రదేశంలో, కుటుంబంలో ఉన్న మానసిక ఒత్తిళ్లు తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. కొందరికి విదేశీ పరిచయాల ద్వారా లాభం కలుగుతుంది.

45
మకరరాశి

బుధ, శుక్రుల కలయిక మకర రాశి తొమ్మిదవ ఇంట్లో (అదృష్ట స్థానం) జరుగుతుంది. కాబట్టి ఈ సమయంలో ఈ రాశివారికి అదృష్టం విపరీతంగా కలిసివస్తుంది. అడ్డంకులు తొలగిపోయి పనులు పూర్తవుతాయి. తండ్రి వైపు నుంచి మద్దతు లభిస్తుంది. గురువు లేదా మార్గదర్శకుల వల్ల మేలు జరుగుతుంది. విద్యార్థులకు మంచి అవకాశాలు వస్తాయి. దూర ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్న వారికి విదేశీ కంపెనీలలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి.

55
మిథునరాశి

మిథున రాశి ఏడవ ఇంట్లో బుధ, శుక్రుల కలయిక జరుగుతుంది. దీనివల్ల వృత్తి, భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి లాభాలు వస్తాయి. కొత్త భాగస్వాముల ద్వారా లాభాలు పెరగవచ్చు. జీవిత భాగస్వామితో సఖ్యత, పరస్పర అవగాహన పెరుగుతాయి. ఒకరికొకరు మద్దతుగా ఉంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. 

Read more Photos on
click me!

Recommended Stories