Birth date: ఈ తేదీలలో జన్మించిన వారికి పెళ్లి ఆలస్యం అవుతుంది, కానీ జీవితాంతం సంతోషంగా ఉంటారు

Published : Nov 06, 2025, 11:35 AM IST

Birth date: సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీలలో జన్మించిన వ్యక్తులకు పెళ్లి ఆలస్యం అవుతుంది. కానీ జీవితాంతం జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. మీరు ఎంతో నమ్మదగిన వారు. ఇంతకీ ఏ తేదీల్లో జన్మించిన వారు ఇలా ఉంటారో తెలుసుకోండి. 

PREV
15
ఈ తేదీలలో పుట్టిన వారు

సంఖ్యాశాస్త్రం గ్రహ సంబంధాలలో కలిగి ఉంటుంది. 12 రాశులకు సంఖ్యాశాస్త్రానికి అనుబంధం ఉంది. ప్రతి మూల సంఖ్య సొంత ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటుంది. ఒక వ్యక్తి పుట్టిన తేదీని బట్టి వారి మూల సంఖ్య నిర్ణయిస్తారు. మూల సంఖ్యని రాడిక్స్ నంబర్ అని కూడా అంటారు. ఒక నెలలో 4, 13, 22, 31 తేదీలలో జన్మించిన వారి రాడిక్స్ సంఖ్య నాలుగు అవుతుంది.

25
కష్టపడి పనిచేస్తారు

రాడిక్స్ సంఖ్య నాలుగు కలిగిన వారి సంబంధాలు, కెరీర్, జీవితంలో స్థిరత్వం, భద్రతా వంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వీరి స్వభావం కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ వ్యక్తులు చాలా నమ్మదగిన వారిగా ఉంటారు. వీరు తమ జీవితాలకు బలమైన పునాదిని వేసుకుంటారు. ప్రతి పనిని కూడా ప్రణాళికతోనే చేస్తారు. కృషికి, అంకిత భావానికి వీరు చిరునామాలా ఉంటారు.

35
నమ్మకమైన వారు

రాడిక్స్ సంఖ్య 4 కలిగి ఉన్నవారు ఏ పనినైనా ఒక క్రమ పద్ధతిలో చేసేందుకు ఇష్టపడతారు. మీరు కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదైనా పని పట్ల నిజమైన సంకల్పాన్ని చూపిస్తారు. వీరిని నమ్మకమైన మనస్తత్వం అంటే ఎవరైనా కూడా వీరిని నమ్మవచ్చు. వీరు మనసు ఎంతో స్థిరంగా ఉంటుంది.

45
ఎవరిని పెళ్లి చేసుకోవాలి?

డబ్బును, బాధ్యతలను వీరు చాలా చక్కగా నిర్వహిస్తారు. పొదుపును అధికంగా చేస్తారు. డబ్బును వృధా చేయడానికి ఇష్టపడరు. డబ్బును ఖర్చు చేసే ముందు ఆలోచిస్తారు. అనవసరమైన ఆడంబరాలకు పోరు. విలాసాలకు దూరంగా ఉంటారు. వీరు రాడిక్స్ సంఖ్య 9 కలిగిన వారిని పెళ్లి చేసుకుంటే ఉత్తమం. వీరికి వారే మంచి జోడి. అంటే ఒక నెలలో 9, 18, 27వ తేదీలో జన్మించిన వారిని మీరు పెళ్లి చేసుకుంటే ఉత్తమం.

55
వివాహం ఆలస్యం

అయితే వీరికి పెళ్లి త్వరగా కాదు. భావోద్వేగ పరంగా, ఆర్థికంగా వీరు స్థిరంగా ఉన్న తర్వాతే వివాహం చేసుకోవడానికి సిద్ధమవుతారు. అందుకే వీరి వివాహం ఆలస్యం అవుతూ ఉంటుంది. కానీ ఒకసారి పెళ్లి చేసుకుంటే జీవితాంతం నమ్మకమైన భాగస్వామిగా ఉంటారు. జీవిత భాగస్వామిని ఎంతో ఆనందంగా చూసుకుంటారు. వీరికి లోతైన ఆధ్యాత్మికత భావనలు ఉంటాయి. ధ్యానం, ప్రకృతిని ఇష్టపడడం, దేవుడిని ఆరాధించడం వంటివన్నీ కూడా వీరికి ఇష్టమైన పనులు.

Read more Photos on
click me!

Recommended Stories