Vastu Tips: మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఎక్కడ ఉంది? వాస్తు ప్రకారం ఈ మూలలో ఉంటే ఇంట్లో ధన ప్రవాహమే..!

Published : Apr 08, 2026, 03:22 PM IST

Vastu Tips: వాస్తు ప్రభావం కేవలం ఇంటి ప్రధాన ద్వారం దగ్గరే ఆగిపోదు. ఇంట్లో ఉంచే వస్తువులపై కూడా ఉంటుంది. ఏ వస్తువు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే... ఆ ఇంట్లో సంపదకు లోటు ఉండదు. 

PREV
13
Vastu Tips

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంట్లోని ప్రతి వస్తువుకు దానికంటూ ఓ ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ముఖ్యంగా కిచెన్ లో మనం ఉంచే వస్తువులు.. ఇంటి ఆర్థిక పరిస్థితిని కూడా ప్రభావితం చేస్తాయి. వంట గదిలో స్టవ్, సింక్ తర్వాత... రిఫ్రిజిరేటర్ అత్యంత ముఖ్యమైన వస్తువు. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటోంది. అదొక నిత్యావసర వస్తువుగా మారింది. అయితే.. చాలా మంది దీనిని ఇంట్లో ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ పెట్టేస్తూ ఉంటారు. కానీ, వాస్తు ప్రకారం, దానిని సరైన ప్లేస్ లో ఉంచితే... ఆర్థికంగా బాగా కలిసొస్తుంది. మరి, ఫ్రిడ్జ్ ని ఇంట్లో ఏ మూలలో ఉంచాలో తెలుసా?

రిఫ్రిజిరేటర్ నుండి వెలువడే శక్తి ఇంటి వాస్తుకు అనుకూలంగా లేకపోతే... అది పేదరికం, అనారోగ్యానికి కారణం అవుతుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

23
డబ్బు సమస్యలు తగ్గాలంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటి నైరుతి దిశలో రిఫ్రిజిరేటర్ ఉంచడం అత్యంత శుభప్రదంగా పరిగణిస్తారు. ఈ దిశ స్థిరత్వానికి చిహ్నంగా పరిగణిస్తారు. ఈ దిశలో ఫ్రిడ్జ్ ఉంచడం వల్ల ఇంట్లోని ఆహారం తాజాగా ఉండటమే కాకుండా.. ఇంట్లో పొదుపు కూడా పెరుగుతుంది. ఇది అనవసర ఖర్చులను నివారిస్తుంది. బ్యాంకు బ్యాలెన్స్ పెంచుతుంది.

2. ఫ్రిడ్జ్ ఉంచే దిశ...

ఇంట్లో నైరుతి దిశ ఖాళీగా లేకపోతే... వేరే దిశలను కూడా ఎంచుకోవచ్చు...

పడమర: ఈ దిశ భారీ ఎలక్ట్రానిక్ వస్తువులకు కూడా మంచి దిశగా పరిగణిస్తారు.

వాయువ్యం.. దీనిని వావ్య కోణం అంటారు. ఇక్కడ రిఫ్రిజిరేటర్ ఉంచడం వల్ల ఇంటికి అతిథులు ఎక్కువ వస్తారు.

33
ఫ్రిడ్జ్ ని ఈ దిశలో మాత్రం ఉంచకూడదు...

రిఫ్రిజిరేటర్‌ను ఈశాన్య దిశలో ఎప్పుడూ ఉంచవద్దు. ఇది దేవతల స్థానం. ఇక్కడ బరువైన వస్తువులను ఉంచడం వల్ల మానసిక ఒత్తిడి , ఆర్థిక నష్టం కలగవచ్చు.

స్టవ్ ముందు: గ్యాస్ స్టవ్ ముందు లేదా పక్కన రిఫ్రిజిరేటర్‌ను ఉంచుకోకూడదు. అగ్ని, నీటి కలయిక కుటుంబంలో సమస్యలు తెచ్చిపెడుతుంది.

ఇంట్లో ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటే...

శుభ్రత: రిఫ్రిజిరేటర్‌లో పాడైన ఆహారాన్ని ఎప్పుడూ ఉంచవద్దు. మురికిగా ఉన్న రిఫ్రిజిరేటర్ రాహువుకు నేరుగా హాని చేస్తుంది, ఇది ఇంట్లో ఊహించని సమస్యలకు కారణం కావచ్చు.

రంగులు: తెలుపు, క్రీమ్ లేదా వెండి రంగులో ఉన్న రిఫ్రిజిరేటర్‌ను ఎంచుకోవడానికి ప్రయత్నించండి. ఈ రంగులు శాంతి , శ్రేయస్సుకు చిహ్నాలు. వాస్తు ప్రకారం, ముదురు ఎరుపు లేదా నలుపు రంగు ఇంట్లో సమస్యలను తెస్తుంది..

Read more Photos on
click me!

Recommended Stories