మిత్ర గ్రహాల కలయిక...
వేద జోతిష్య శాస్త్రంలో బుధుడిని గ్రహాలకు యువరాజుగా పరిగణిస్తారు. ఈ గ్రహం వాక్చాతుర్యం, విద్య, వ్యాపారాలకు కారకుడుగా పరిగణిస్తారు. అంతేకాకుండా, గ్రహాలన్నింటిలోనూ అతి తక్కువ సమయంలో తన స్థానాన్ని మార్చుకునే గ్రహం బుధుడు మాత్రమే. ఇది ఎప్పటికప్పుడు తన రాశిని మార్చుకుంటూ ఉంటుంది. ఈ బుధ గ్రహం తన మిత్ర గ్రహమైన సూర్యుడితో కలవనుంది. మే 16వ తేదీన సూర్యుడు, బుధుడు వృషభ రాశిలో కలవనున్నాయి. ఈ రెండూ మిత్ర గ్రహాలు కావడంతో.. ఇది కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందించనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం...