బెడ్ రూమ్ లో నుంచి ఇవి తీసేస్తే, మీ లైఫ్ మారిపోతుంది..!

First Published | Nov 27, 2024, 9:55 AM IST

వాస్తు శాస్త్రం మన జీవితంపై ఎక్కువ ప్రభావమే చూపిస్తుంది. వాస్తు ప్రకారం  కొన్ని రూల్స్ పాటించడం వల్ల.. మన జీవితం సంతోషంగా ఉంటుందట.

వాస్తు శాస్త్రం మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. అందుకే.. కేవలం ఇంటిని కొనేటప్పుడు వాస్తు చూడటమే కాదు.. ఇంట్లో వస్తువులను పెట్టే విషయంలోనూ వాస్తు శాస్త్రాన్ని పాటించాలి.  ముఖ్యంగా బెడ్రూమ్ లో మనం పెట్టే కొన్ని వస్తువులే సమస్యలకు కారణం అవుతాయట. అందుకే.. జీవితంలో సమస్యలు రాకుండా ఉండాలంటే.. ఈ వస్తువులు మాత్రం బెడ్రూమ్ లో అస్సలు ఉండకూడదు. వీటిని వెంటనే తీసేస్తే... మీ జీవితంలో మార్పులు చూస్తారు.

మన కుటుంబ సభ్యులపై మనకు చాలా ప్రేమ ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు. అయితే.. వారిపై ఎంత ప్రేమ ఉన్నా.. చనిపోయిన తర్వాత  వాళ్ల ఫోటోలను బెడ్రూమ్ లో పెట్టుకోకూడదు. ఇంట్లో దక్షిణ దిక్కులో మాత్రమే ఉంచుకోవాలి. అంతేకాకుండా బెడ్‌రూమ్‌లో దేవుడి ఫోటోలు కూడా పెట్టకూడదు. దేవుడి ఫోటోలు పెట్టడానికి  ఇంటిలో ప్రత్యేక స్థానం ఉంది.


బెడ్‌రూమ్‌లో ముదురు రంగులు వాడకూడదు. గుండ్రంగా లేదా అండాకారంలో ఉన్న ఫర్నీచర్ బెడ్‌రూమ్‌లో ఉంచకూడదు. మంచం మీద కూర్చుని తినడం మంచిది కాదు. అంతేకాదు మంచం ఎదురుగా అద్దం ఉంచకూడదు.

ఆగిపోయిన గడియారాలు బెడ్‌రూమ్‌లో పెట్టకూడదు. మంచం కింద పాత్రలు పెట్టకూడదు. ఈశాన్యంలో చెత్త పెట్టకూడదు. మీ భాగస్వామి ఫోటోను నైరుతి దిక్కున ఉంచండి. బెడ్‌రూమ్‌లో ప్రేమ పక్షుల జంట చిత్రాలు ఉంచాలి. ఈ నియమాలు పాటిస్తే మీ జీవితంలో సమస్యలు తగ్గుతాయి.

Latest Videos

click me!