పెళ్లైన అమ్మాయి పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోకూడదో తెలుసా?

Published : Nov 23, 2024, 03:09 PM IST

  వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రం..  కొన్ని వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదట. మరి, ఎలాంటివి తెచ్చుకోకూడదో ఇప్పుడు చూద్దాం..  

PREV
17
 పెళ్లైన అమ్మాయి పుట్టింటి నుంచి ఏం తెచ్చుకోకూడదో తెలుసా?


 

ప్రతి అమ్మాయి పెళ్లి తర్వాత తన పుట్టింటిని వదిలేసి అత్తింటికి వెళ్లాల్సి వస్తుంది. అయితే..  అత్తారింట్లో కూతురు కష్టపడకూడదు అని… పుట్టింటి నుంచి వస్తువులు, పిండి వంటలు, ఇంట్లో కి కావాల్సిన వస్తువులు అన్నీ పంపిస్తూ ఉంటారు. అయితే.. వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రం..  కొన్ని వస్తువులను పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదట. మరి, ఎలాంటివి తెచ్చుకోకూడదో ఇప్పుడు చూద్దాం..

 

27

 

పదునైన వస్తువులు ఏవీ పుట్టింటి నుంచి అత్తారింటికి తీసుకువెళ్లకూడదట.  అంటే.. కత్తులు, కొడవలి, సూదులు కూడా తీసుకువెళ్లకూడదట. పొరపాటున ఇవి తీసుకువెళితే… వారి దాంపత్య బంధంలో సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందట.

 

37

 

దీపారాధన కుందులు కూడా పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. ముఖ్యంగా వాళ్ల అమ్మ ఇంట్లో వాడినవి మాత్రం పొరపాటున కూడా తెచ్చుకోకూడదట. వాళ్ల అమ్మ వాడినవి.. మళ్లీ వీళ్లు వాడితే.. ఇంటికి లక్ష్మీదేవి రాదట. లక్ష్మీ కటాక్షం లేక ఆదాయం తగ్గి ఇబ్బందులు పడాల్సి వస్తుందట.

 

47

 

పుట్టింటి నుంచి పొరపాటున కూడా చీపిరి తెచ్చుకోకూడదట. దాని వల్ల అత్తారింట్లో చాలా సమస్యలు ఎదుర్కోవాలసి వస్తుందట. చీపిరి మాత్రమే కాదు… క్లీనింగ్ కి సంబంధించిన ఎలాంటి వస్తువులు కొనకూడదట.

 

57

 

పుట్టింటి నుంచి బియ్యం కొలిచే పాత్ర కూడా తెచ్చుకోకూడదు. ఒకప్పుడు సోల, మానిక అంటూ బియ్యం కొలిసే పాత్రలు ఉండేవి. అలాంటివి  కూడా తెచ్చుకోకూడదట. వాటి వల్ల కూడా అత్తారింట్లో సమస్యలు, ముఖ్యంగాపేదరికం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందట.

 

67

 

చేదు గా ఉండేవి కూడా ఎప్పుడూ తెచ్చుకోకూడదు. కాకరకాయ లాంటివి రుచికి చేదుగా ఉండేవి ఏవీ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదట, పాలకూర, మునగకాయ లాంటివి తెచ్చుకోకూడదు. రెండు ఇళ్లల్లోనూ సమస్యలు తెస్తాయట.

 

77

 

తడి దుస్తులు, మాంసాహార వస్తువులు కూడా ఏవీ పుట్టింటి నుంచి తెచ్చుకోకూడదు. ఇది కూడా రెండు ఇళ్లల్లోనూ  సమస్యలు వచ్చే అవకాశం ఉందట.

 

Read more Photos on
click me!

Recommended Stories