Unlucky Zodiac Signs: పాపం ఈ 3 రాశులవారు... మంచి చేసినా వారికి చెడే ఎదురవుతుంది

Published : Jul 07, 2026, 10:04 AM IST

Unlucky Zodiac Signs: పన్నెండు రాశుల్లో మూడు రాశుల వారికి అదృష్టం తక్కువగా ఉంటుంది. వీరు పక్కవారికి సహాయం చేయడానికి వెళ్లి  వారే సమస్యల్లో ఇరుక్కుంటారు. జ్యోతిషశాస్త్రం ప్రకారంఇలా మంచి చేయబోయి చెడులో ఇరుక్కునే రాశులేవో తెలుసుకోండి.

PREV
13
వృషభ రాశి

పన్నెండు రాశుల్లో వృషభ రాశి రెండవది.  ఈ రాశిలో పుట్టిన వాళ్లు ప్రేమను పంచేందుకు ముందుంటారు. తమకు సాయం చేయమని అడిగిన ప్రతిఒక్కరికీ కాదనకుండా సాయం చేయాలనే గుణం ఈ రాశి వారికి ఉంటుంది. వీళ్లకున్న మంచి గుణాన్నే కొందరు అవకాశంగా తీసుకుంటారు. ఈ రాశివారు ఇతరులకు చేసే సాయం వీరికే సమస్యలు తెచ్చిపెడుతుంది.  వీరు ఇతరులను గుడ్డిగా నమ్మి చేసే సాయం వీళ్ల పేరును చెడగొడుతుంది.

23
కర్కాటక రాశి

కర్కాటక రాశిలో పుట్టిన వాళ్లకు భావోద్వేగాలు ఎక్కువ. ఈ రాశివారు ఇతరుల కన్నీళ్లు చూస్తే చాలు మనసు కరిగిపోతుంది.  ఎవరిని చూసినా పాపం అనిపిస్తే చాలు వెంటనే సాయం చేసేస్తారు. సంబంధం లేకపోయినా సాయం చేస్తారు. వీరి జాలి గుణమే వీరికి సమస్యలు తెచ్చిపెడుతుంది.  కొన్నిసార్లు వీళ్ల దగ్గర సాయం పొందిన వాళ్లే వీరికి తలనొప్పిగా తయారవుతారు. ఈ రాశుల వారు ఇతరులను సులభంగా నమ్మేసి సమస్యలు తెచ్చుకుంటారు.

33
తులా రాశి

తులా రాశి వారు మంచి వారు.  తమ చుట్టూ ఉన్నవాళ్లందరూ బాగుండాలని  వీరు కోరుకుంటారు. ఇందుకోసం వాళ్లకు సలహాలు, సూచనలు ఇస్తారు. వారికి మార్గనిర్దేశం చేస్తారు. వీళ్ల సలహాతో ఎదిగిన వారు ఓడిపోతే, ఆ నిందను తులా రాశి వారిపైనే వేస్తారు. దీంతో తులారాశి వారు ఎంతో బాధపడే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories