వేద జోతిష్య శాస్త్రంలో శుక్రుడికి తొమ్మిది గ్రహాలలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ శుక్ర గ్రహం సంపద, వివాహం, ఆనందం,ప్రేమ, ఆకర్షణకు కారకుడిగా పరిగణిస్తారు. దీని ఫలితంగా శుక్రుడి సంచారం అన్ని రాశులపై ఉంటుంది. కాగా.. జనవరి 13వ తేదీన శుక్రుడు మకర రాశిలోకి అడుగుపెట్టాడు. ఫిబ్రవరి 6వ తేదీ వరకు అక్కడే ఉంటాడు. దీని ఫలితంగా శుక్రుడు సూర్యుడు, అంగారకుడు, బుధుడితో కలిసి శుక్రాదిత్య, లక్ష్మీ నారాయణ యోగాలను ఏర్పరుస్తాడు. శని రాశి అయిన మకరంలో ఉన్న శుక్రుడు, వృషభంలో ఉన్న యూరేనస్ తో కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరిచాడు. దీని కారణంగా ఈ నవ పంచమ రాజయోగం మూడు రాశుల జీవితాలను పూర్తిగా మార్చేయనుంది. ముఖ్యంగా డబ్బు పరంగా బాగా కలిసిరానుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దాం....