Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర కన్య రాశి ఫలితాలు

First Published | Apr 4, 2024, 3:44 PM IST


శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన  కన్య రాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు  కన్య రాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.


కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు (టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)

ఆదాయం:-5
వ్యయం:-5

రాజపూజ్యం:-5
అవమానం:-2

Virgo daily horoscope

గురుడు 1-5-24 వరకు అష్టమ స్థానంలో రజత మూర్తి గా సంచరించి.తదుపరి భాగ్య స్థానంలో రజత మూర్తి గా సంచారం.

శని ఈ సంవత్సరాంతం తామ్ర మూర్తి గా శత్రు స్థానంలో సంచారం.

రాహువు  ఈ సంవత్సరమంతా కళత్ర స్థానంలో రజత మూర్తి గా సంచారం.

కేతువు ఈ సంవత్సరమంతా రజత మూర్తి గా జన్మ రాశిలో సంచారం.

మే నెల నుంచి గురుగ్రహ సంచారం అనుకూలంగా ఉంది. భాగ్య స్థానంలో  గురు సంచారం. ఈ సంచారం వలన ఎంతటి కష్టతరమైన పని అయినా ప్రణాళికాబద్ధంగా విజయం సాధిస్తారు.స్థలాలు లేదా గృహం కొనడం లేక నిర్మాణం చేయడం గాని చేస్తారు.వ్యవహారాలలో జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.కోర్టు విషయాలు ఏమైనా ఉంటే ఈ సంవత్సరం మీకు అనుకూలంగా తీర్పు రాగలవు. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఉన్నత విద్య ప్రయత్న ప్రయత్నాలు ఫలించును. వివాహ ప్రయత్నాలు చేసే వారికి ఈ సంవత్సరం అనుకూలం. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.

శని సంచారం వలన అన్ని విధాల అభివృద్ధి కలుగును.ప్రత్యర్థులపై పై చేయి సాధిస్తారు.అన్ని రంగాల వారికి సమాజంలో గౌరవం లభిస్తుంది.సర్వ కార్యములందు లాభాలు పొందగలరు.వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి ధనాభివృద్ధి పొందుతారు. ప్రారంభించి మధ్యలో ఆగిన పనులు పూర్తి అగును.ఆరోగ్య విషయాలు బాగుంటాయి.పరిశ్రమలు అభివృద్ధి చెందుతాయి.ఉద్యోగాలలో అధికారంతో కూడిన బదిలీ.

రాహు సంచారం వలన అనారోగ్య సమస్యలు రాగలవు.వృధా అనవసరమైన ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

కేతు సంచారం సామాన్యంగా నుండును.ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని సంచారం అనుకూలంగా ఉన్నాయి. ఈ సంవత్సరం అన్ని విధాల యోగిస్తుంది. అన్ని వర్గాల వారు ముందుకు దూసుకుపోతారు.
 


Virgo

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి
గురుడు 13-06-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 13-6-24 నుంచి సంపత్తార లో  సంచారం తదుపరి 20-8-24 నుంచి  విపత్తార లో సంచారం.

శని 3-10-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి క్షేమ తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు ప్రత్యక్తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  సాధన తార లో సంచారం

కేతువు 11-11-24 వరకు సంపత్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం జన్మతారలో సంచారం

హస్త నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు జన్మ తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి సంపత్తార లో సంచారం.

శని 3-10-24 వరకు క్షేమ తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి విపత్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు క్షేమ తార లో సంచారం.

రాహు 7-7-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  ప్రత్యక్తార లో సంచారం

కేతువు 11-11-24 వరకు జన్మతారలో సంచారం.తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం పరమ మిత్ర తార లో సంచారం

Virgo daily horoscope

చిత్త నక్షత్రం వారికి
గురుడు 13-05-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి జన్మతారలో లో సంచారం.

శని 3-10-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి సంపత్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు విపత్తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  క్షేమ తార లో సంచారం

కేతువు 11-11-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం మిత్ర తార లో సంచారం

(రాహు కేతు సంచారం అనుకూలం కాదు కావున ఈ రాశి వారు ఈ సంవత్సరం దుర్గా మరియు గణపతి ఆరాధన చేయడం మంచిది.)
 


ఏప్రిల్
ఉద్యోగాలు లో అంకితభావంతో వ్యవహరించాలి.కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం కష్టం. ఆదాయమును మించిన ఖర్చులు ఉంటాయి.వృత్తి వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు వహించాలి.చేయు వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రమే ఉంటాయి.అన్ని రంగాల వారికి ఇబ్బందులు తప్పవు.ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.ఆర్థిక ఇబ్బందులు కూడా కలుగుతాయి.శారీరకంగా శ్రమ అధికమవుతుంది.సమయం కానీ సమయంలో భోజనాలు చేయవలసి ఉంటుంది.కుటుంబ వ్యక్తులు తో విభేదాలు రాగలవు.


మే
ఈనెల కూడా గ్రహ సంచారం ప్రతికూలంగా ఉంది.నెలలో మొదటి రెండు వారాలు వృత్తి వ్యాపారాల్లో నష్టాలు రాగలవు.సమాజంలో అంతంతమాత్రం గౌరవ మర్యాదలు ఉంటాయి.శ్రమకు తగ్గ ఆదాయం లభిస్తుంది.మానసిక ఆందోళన వెంటాడుతాయి.ప్రతి పనిలోనూ ఓర్పు సహనం అవసరం.అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.విద్యార్థుల చదువు లో శ్రద్ధ తగ్గి ఆందోళనకు లోనవుతారు. నెలలో చివరి రెండు వారాల్లో వృత్తి వ్యాపారాలు రాణిస్తాయి.ఆదాయం బాగుంటుంది.గత సమస్యలు ఏమైనా ఉంటే వాటి నుండి బయటపడతారు.
 


జూన్
ఈనెల గ్రహ సంచారం అనుకూలంగా ఉంది.అవసరాలకు సరిపడా ఆదాయం లభిస్తుంది. ఉద్యోగాలు లో అధికారులు యొక్క అనుగ్రహం లభిస్తుంది.కుటుంబ సభ్యులతో అన్యోన్యత పెరిగి ఆనందంగా గడుపుతారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి.అన్ని వర్గాల వారు లాభాలు పొందుతారు.ఆరోగ్యం బాగుంటుంది.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.కొన్ని పనులు లో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.


జూలై
తలపెట్టిన కార్యాల్లో విజయం సాధిస్తారు.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.నూతన వ్యవహారాలు కలిసివస్తాయి.ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.ఉద్యోగస్తులు ఆనందకరమైన జీవితాన్ని సాగిస్తారు.మంచి గుర్తింపు కూడా లభిస్తుంది.శత్రువుల పై ఆధిక్యత ప్రదర్శిస్తారు.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.నూతన పెట్టుబడులు కు దూరంగా ఉండటం మంచిది. శారీరకంగా మానసికంగా ధైర్యంగా ఉంటారు.
 


ఆగస్టు
ఈనెల శుభాశుభములు మిశ్రమంగా ఉండును.ఉద్యోగాలు లో అంకితభావంతో సాగుట మంచిది.మనోధైర్యం అవసరం.ఆర్థిక విషయాలు సామాన్యంగా ఉంటాయి. విందులు వినోదాల్లో పాల్గొంటారు.గృహంలో శుభకార్యములు జరుగును.తలపెట్టిన కార్యాలు సిద్ధిస్తాయి.శారీరకంగా శ్రమ పెరుగుతుంది.ఆస్తి విషయంలో అనుకోని సమస్యలు ఎదురవుతాయి.గృహంలో దొంగతనాలు జరగకుండా వస్తువులు భద్రపరిచి జాగ్రత్తగా ఉండటం అప్రమత్తతో వ్యవహరించుట మంచిది.ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది.వృధా ఖర్చు చేస్తారు

సెప్టెంబర్
మధ్యలో నిలిచిపోయిన పనులు పూర్తి కాగలవు.అవసరానికి సరిపడా ఆదాయం లభిస్తుంది.బంధుమిత్ర వర్గం నుండి సహాయ సహకారాలు లభిస్తాయి.శుభకార్య ప్రయత్నాలు అనుకూలిస్తాయి.మీ మాటలు సమాజంలో ఇతరులకు ఇబ్బందులు కలిగించే రకంగా ఉంటాయి.వ్యాపార అభివృద్ధి ప్రణాళికలు రచిస్తారు.ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడతారు.సంతానం ద్వారా ఉన్న ఇబ్బందులు పరిష్కారం అవును.ఆరోగ్యం అనుకూలించును.ఆర్థికంగా నిలదొక్కు ఉంటారు.కుటుంబ సౌఖ్యం లభిస్తుంది.


అక్టోబర్
అని వ్యవహారాల్లో మంచి మార్కులు చూడగలుగుతారు.అవకాశాలను అందిపుచ్చుకుంటారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.ముఖ్యమైన సమస్యల నుంచి బయటపడతారు.చెడు సావాసాల వలన ఎదురు దెబ్బలు తగలవచ్చు.ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించడం తప్పనిసరి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉత్సాహంగా ఉంటాయి.రావలసిన బాకీలు వసూలు అవ్వ గలవు.కొన్ని విషయాలు మనస్సుకు ఆనందం కలుగజేస్తాయి.రాజకీయ నాయకులు కు సంఘంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
 


నవంబర్
ఈనెల గ్రహ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది.వ్యవహారాల్లో మానసికంగా ధైర్యంగా వ్యవహరిస్తారు.అన్నింటా విజయం పొందుతారు.కొంతకాలంగా పడుతున్న బాధలు తొలగును.ఇబ్బందుల నుంచి బయట పడతారు.చేయు వృత్తి వ్యాపారాలలో రాణింపు ఉంటుంది.ఆర్థిక విషయాలు బాగుంటాయి.మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.కుటుంబంలో ఆనందకరమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి.వ్యక్తిగతంగా అభివృద్ధి చెందుతారు.నిరుద్యోగులకు శుభవార్త వింటారు.ఇంటా బయట గుర్తింపు లభిస్తుంది.


డిసెంబర్
కొద్దిపాటి చికాకులు ఉన్నప్పటికీ బంధుమిత్రుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు.ఆర్థిక వ్యవహారాలు ప్రయోజనకరంగా ఉంటాయి.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.గత సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవుతాయి. స్థలం లేక ఇల్లు కొనడం జరుగుతుంది.అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు.ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు.నూతన కార్యాలకు శ్రీకారం చుడతారు.శత్రువులపై విజయం సాధిస్తారు.నూతన పరిచయాల వల్ల లాభాలు.
 


జనవరి
ఈనెల మిశ్రమ ప్రయోజనాలు పొందుతారు.ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి.చేసే పనుల్లో శ్రమ ఒత్తిడి అధికంగా ఉంటుంది.నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు.దూరపు ప్రయాణాలు కలిసి వస్తాయి.పాత మిత్రులను కలుసుకుంటారు.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు.గత సమస్యల నుంచి బయటపడతారు.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.అనుకోని సమస్యలు తలెత్తగలవు.శుభ కార్యక్రమాలు వాయిదా పడే అవకాశం.ఉద్యోగస్తులకు అధికారుల నుండి లేదా ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది.
 


ఫిబ్రవరి
ఈనెల ప్రయోజనకరంగా ఉంటుంది. గత సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం అవును.ఇంకా బయట మంచి గుర్తింపు లభిస్తుంది. రుణ రోగం శత్రు బాధల నుండి విముక్తి పొందుతారు. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు చూడగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది. ఆర్థికంగా చిన్నపాటి ఇబ్బందులు కల గలవు. కోపావేశము ఉండడం వల్ల సమస్యలు కొని తెచ్చుకుంటారు. బంధుమిత్రులతో అకారణంగా విరోధాలు రాగలవు. ప్రయాణాల్లో దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు లో వికాసం ఉన్నతి కలగవచ్చు.

మార్చి
ఈ నెల గ్రహ సంచారం ప్రతికూలంగా ఉన్నాయి.తరచూ ప్రయాణాలు చేయవలసి వస్తుంది.చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.కుటుంబంలో ఎవరి తీరు వారిదిగా ఉంటుంది.ఖర్చు మితిమీరు చేయవలసి ఉంటుంది.వివాహ ప్రయత్నాలు లో ఆటంకాలు ఎదురవుతాయి.సమయం కానీ సమయంలో భోజనం చేయవలసి వస్తుంది.సమాజంలో అపవాదులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సోదర వర్గంతో సఖ్యత ఏర్పడుతుంది.భూ సంబంధిత వ్యవహారాలు లాభిస్తాయి. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తారు.గృహంలో శుభకార్యాలు జరుగుతాయి.

Latest Videos

click me!