Tripushkar Yoga: రేపు త్రిపుష్కర యోగం, ఈ 5 రాశులకు విపరీతంగా కలిసి వచ్చే ఛాన్స్

Published : Sep 12, 2025, 07:24 PM IST

సెప్టెంబరు 13 నుంచి అయిదు రాశుల (Zodiac Signss)  వారికి ధనయోగం కలిగే అవకాశం ఉంది. సెప్టెంబర్ 13న సర్వార్థ సిద్ధి, రవియోగం, త్రిపుష్కర యోగం ఏర్పడుతుంది. ఈ యోగాలు అయిదు రాశుల వారికి విపరీతంగా కలిసి వచ్చేలా చేస్తాయి. 

PREV
15
మేష రాశి

సెప్టెంబరు 13 నుంచి మేష రాశి లాభం చేకూరుతుంది. ఆస్తి సంబంధిత పనులు పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో మీకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. మీరు ఎక్కడ 1 పైసా పెట్టుబడి పెట్టినా దానికి పెట్టుబడి ఆదాయం వస్తుంది. పుష్కర యోగం మీకు ప్రయోజనం చేకూరుస్తుంది. బంగారం లేదా నగల వ్యాపారంలో ఉన్నవారికి చాలా కలిసి వస్తుంది.  రేపు మీరు తండ్రి వైపు నుండి ప్రయోజనాలు పొందవచ్చు. 

25
మిథున రాశి

సెప్టెంబర్ 13న మిథున రాశి వారికి అదృష్టం తెచ్చే రోజు.  మీరు కష్టపడి పనిచేస్తారు. విజయం మీదే అవుతుంది. కార్యాలయంలోనే కాదు, కుటుంబంలో, సమాజంలో కూడా మీకు గౌరవం లభిస్తుంది.  సహోద్యోగుల ప్రవర్తన, వారి సహాయంతో ఈరోజు మీరు ఉద్యోగంలో లాభం పొందుతారు. రేపు మీరు విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. 

35
సింహరాశి

సింహ రాశి వారికి సెప్టెంబరు 13 కలిసి వచ్చే రోజు.  మీరు ఉద్యోగం, వ్యాపారంలో మీ సామర్థ్యాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటారు. రేపు మీరు కొత్త ప్రాజెక్ట్‌లో పనిచేయడం ప్రారంభించవచ్చు. మీరు ఇల్లు కొనాలని ప్రయత్నిస్తుంటే, ఈరోజే ప్రయత్నించండి. మీకు మంచి ఇల్లు దొరికే అవకాశం ఉంది.

45
వృశ్చిక రాశి

సెప్టెంబర్ 13న వృశ్చిక రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. రేపు మీకు లాభాలు కలుగుతాయి. అన్ని వైపుల నుండి మీకు శుభ యోగాలు దక్కుతాయి. మీరు కొన్ని శుభకార్యాలు చేయవచ్చు. కుటుంబంతో వినోదంగా గడిపే అవకాశం ఉంది. 

55
మకర రాశి

మకర రాశి వారికి ఉన్న  సమస్యలు తొలగిపోతాయి.  మీ జీవిత భాగస్వామి సహాయంతో ఏదైనా అసంపూర్ణమైన పనిని పూర్తి చేయగలుగుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందుతారు. రేపు ఉద్యోగంలో మంచి రోజు. అధికారుల నుండి మీకు పూర్తి సహకారం, మద్దతు కూడా లభిస్తుంది. ఏదైనా నెరవేరని కోరిక నెరవేరే ఆనందం ఉంటుంది. వాహన సుఖం పొందే అవకాశం కూడా ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories