Zodiac signs: 200 ఏళ్ల తర్వాత మకర రాశిలో అద్భుతం... మూడు రాశులకు మహర్దశ

Published : Nov 24, 2025, 02:25 PM IST

Zodiac signs: మకర రాశిలో త్రి గ్రహి యోగం ఏర్పడబోతోంది. ఈ యోగం కొన్ని రాశుల వారికి ప్రతి రంగంలోనూ అదృష్టాన్ని, విజయాన్ని అందిస్తుంది.పట్టిందల్లా బంగారమే అవుతుంది. 

PREV
14
త్రిగ్రహి యోగం..

మరో నెల రోజుల్లో మనమంతా కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం. 2026 ప్రారంభంలో అనేక శుభ యోగాలు, రాజయోగాలు ఏర్పడతాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో మకర రాశిలో బలమైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శుక్రుడు, బుధుడు కలయికతో ఈ యోగం ఏర్పడుతుంది.  ఇది కొన్ని రాశులవారికి చాలా మేలు చేయనుంది. ఈ రాశులవారు కొత్త ఉద్యోగం, అపారమైన సంపదను పొందే అవకాశం ఉంది.  మరి, ఆ రాశులేంటో చూద్దాం…

24
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారికి త్రిగ్రాహి యోగం సానుకూలంగా ఉంటుంది. ఈ యోగం మీ రాశి రెండో ఇంట్లో ఏర్పడటం వల్ల, ఈ సమయంలో మీరు ఊహించని ఆర్థిక లాభాలను పొందుతారు. ఈ కాలంలో వ్యాపారాలు కూడా మంచి లాభాలను పొందుతారు. అన్ని రకాల సవాళ్లను చాలా తెలివిగా ఎదుర్కొంటారు.  కుటుంబంలో, సమాజంలో మీ కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి.

34
మేష రాశి

మేష రాశివారికి త్రిగ్రాహి యోగం ఏర్పడటం శుభప్రదంగా ఉంటుంది. ఎందుకంటే ఈ యోగం మీ రాశిచక్రంలో వృత్తి,  వ్యాపార స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి, ఈ సమయంలో మీరు మీ పని, వ్యాపారంలో మంచి పురోగతిని సాధించవచ్చు. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి ఉద్యోగం లభించవచ్చు. ఆకస్మిక ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది.

44
మీన రాశి

మీన రాశివారికి త్రిగ్రాహి యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ యోగం ఈ రాశి వారి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభాలు వస్తాయి. మీరు కొత్త ఆదాయ వనరుల నుండి కూడా డబ్బు సంపాదించవచ్చు.  మీ కుటుంబంలో సంతోషం, శ్రేయస్సు ఉంటుంది.  స్నేహితులు, సహోద్యోగుల నుండి సపోర్ట్ పొందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories