జోతిష్యశాస్త్రం ప్రకారం ప్రతి రాశికీ ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే.. కొన్ని రాశుల అమ్మాయిలకు అయితే విపరీతమైన అదృష్టం ఉంటుందట. వారు.. ఆ అదృష్టాన్ని తమ భర్తకు కూడా పంచగలరట. ఏ రాశి అమ్మాయిలను పెళ్లి చేసుకుంటే.. జీవితం ఆనందంగా, సిరి సంపదలతో తులతూగుతారో తెలుసుకుందాం..
కుంభ రాశి భార్యలు
కుంభ రాశి అమ్మాయిలు:
వీళ్ళు తెలివైనవాళ్ళు. అందరితోనూ కలిసిపోతారు. ధైర్యవంతులు. ఎప్పుడూ ఇతరులకి సాయం చేయడానికి ముందుంటారు. కొత్తగా ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. అందులో సక్సెస్ అవుతారు. డబ్బు విషయాల్లో వీళ్ళని మించినవారు లేరు. భర్తని చాలా ప్రేమిస్తారు.
వృషభ రాశి భార్యలు
వృషభ రాశి అమ్మాయిలు:
జ్యోతిష్యంలో రెండో రాశి వృషభం. ఈ రాశి అధిపతి శుక్రుడు. ధనం, ప్రేమ, ఆకర్షణకి కారకుడు. ఈ రాశి అమ్మాయిలు బాధ్యతగా ఉంటారు. డబ్బు విషయాల్లో మంచి అవగాహన ఉంటుంది. డబ్బుని ఎలా దాచుకోవాలో బాగా తెలుసు. దీనివల్ల ఇంట్లో సంతోషం, ఆనందం ఉంటుంది. కుటుంబంలో సందడి ఉంటుంది.
మీన రాశి భార్యలు
మీన రాశి అమ్మాయిలు:
వీళ్ళకి ఆధ్యాత్మికం మీద నాటం ఎక్కువ. అంతే ప్రేమ మీదా. జీవిత భాగస్వామికి సపోర్ట్ గా ఉంటారు. డబ్బు విషయాల్లో మంచి అవగాహన ఉంటుంది. కలల్ని నిజం చేసుకోవడానికి కష్టపడతారు. సెన్సిటివ్ గా ఉంటారు. ఈ రాశి అమ్మాయి దొరికితే లైఫ్ సంతోషంగా ఉంటుంది.
కర్కాటక రాశి భార్యలు
కర్కాటక రాశి అమ్మాయిలు:
ఈ రాశి అమ్మాయిలు కుటుంబాన్ని, భర్తను ప్రేమగా ఉంటారు. ఇంటి పరిస్థితిని అర్థం చేసుకుంటారు. చుట్టూ ఉన్నవాళ్ళని సంతోషంగా ఉంచాలనుకుంటారు. భర్తని చాలా ప్రేమిస్తారు. డబ్బు విషయాల్లో బాగా ఉంటారు. దీనివల్ల కుటుంబానికి సాయం చేస్తారు. భర్తకి ధనం, విజయం వస్తాయి.
సింహ రాశి భార్యలు
సింహ రాశి అమ్మాయిలు:
సింహ రాశి అమ్మాయిలు స్వ గౌరవాన్ని ఇష్టపడతారు. ధైర్యవంతులు, ఆత్మవిశ్వాసం ఉంటుంది. వీళ్ల వ్యక్తిత్వం అత్తగారినీ ఆశ్చర్యపరుస్తుందట. ఇతరులని లీడ్ చేయగల గుణం ఉంటుంది. భర్త కోరికల్ని తీరుస్తారు. భర్తకు అదృష్టాన్ని తెస్తారు.