Today Horoscope: ఓ రాశివారు శుభకార్యాలకు శ్రీకారం చుడతారు

First Published Mar 8, 2024, 5:30 AM IST

Today Horoscope:ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి.  ఓ రాశివారికి ఈ రోజు.. ఊహించని రీతిలో ధనము ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులు తో గొడవలు రాగలవు. మానసిక అశాంతి ఏర్పడును. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవగలవు. 
 


8-3-2024, శుక్రవారంమీ  రాశి ఫలాలు (దిన ఫలం,తారా ఫలాలు తో..)

జోశ్యుల రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు పెట్టండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం
 

telugu astrology


మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో)
తారాబలం
అశ్విని నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరులతో అకారణంగా విరోధాలు రాగలవు. వ్యాపారంలో ధన నష్టము.పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

భరణి నక్షత్రం వారికి  (క్షేమతార)సమాజమునందు గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును

దిన ఫలం:-కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. సమాజము నందు  గొడవలు ఎదుర్కోవాల్సి వస్తుంది. భావోద్రేకాలు అధికంగా ఉంటాయి. వ్యాపారముల యందు జాగ్రత్త అవసరం. ప్రయత్నించిన పనుల్లో ఫలితం కనబడటం కష్టంగా నుండును. మానసిక అశాంతి ఏర్పడగలదు. వృత్తి లో సహచరుల యొక్క ఇబ్బందులు కలుగగలవు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తలు అవసరం.ఓం ఆంజనేయాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు(ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
తారాబలం
కృత్తిక నక్షత్రం వారికి (విపత్తార)వ్యాపారంలో జాగ్రత్త అవసరం. సంఘములో అవమానాలు కలగవచ్చు.చేసే వ్యవహారములో కోపం అధికంగా ఉంటుంది.

రోహిణి నక్షత్రం వారికి (సంపత్తార)బంధుమిత్రుల యొక్క కలయిక.వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

దిన ఫలం:-ఊహించని రీతిలో ధనము ఖర్చు చేస్తారు. కుటుంబ సభ్యులు తో గొడవలు రాగలవు. మానసిక అశాంతి ఏర్పడును. తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవగలవు. ఇతరులతో వాదోపవాదాలకు దూరంగా ఉండవలెను. ఇతరుల నిందలకు పాత్రులవుతారు. ఉద్యోగం నందు అధికారుల తో గొడవలు ఏర్పడగలవు. ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులకు గురి అవుతారు.ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
తారాబలం
మృగశిర నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగుతాయి.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు పడతారు.

ఆరుద్ర నక్షత్రం వారికి (పరమైత్రతార) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధననష్టం రావచ్చు.

దిన ఫలం:-చేయు వ్యవహారములలో ఆలోచన శక్తి పెరిగి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. సమాజము నందు కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. నూతన ఉత్సాహంతో పనులన్నీ సక్రమంగా పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. సంతాన మూలక అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. దైవ కార్యక్రమంలో పాల్గొంటారు. బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తుంది.ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కర్కాటకం (పునర్వసు 4 పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4)
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
తారాబలం
పునర్వసు నక్షత్రం వారికి  (మిత్ర తార) వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.

పుష్యమి నక్షత్రం వారికి  (నైధనతార)మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి.చేసే పనుల్లో కోపం అధికంగా ఉంటుంది.

ఆశ్రేష నక్షత్రం వారికి (సాధన తార) బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దిన ఫలం:-ధనాదాయ మార్గాలు బాగుంటాయి. చేయు వ్యవహారాలలో నూతన ఉత్సాహంతో వ్యవహరిస్తారు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు పొందగలరు. భార్య నుండి సహాయ సహకారాలు అంది వస్తాయి. ఊహించని రీతిలో ధనాదాయం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు విద్యా చర్చలు యందు పాల్గొంటారు. శారీరక మానసిక సౌఖ్యం లభిస్తుంది. ఈరోజు ఈ రాశి వారు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


సింహం (మఖ 1 2 3 4 పుబ్బ 1 2 3 4, ఉత్తర 1)
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
తారాబలం
మఘ నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరులతో అకారణంగా విరోధాలు రావచ్చు.జాగ్రత్త వహించవలెను.వ్యాపారంలో ధన నష్టము.పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి (క్షేమతార)సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి (విపత్తార) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సంఘములో  అవమానాలు కలుగవచ్చు.చేసే వ్యవహారంలో కోపం అధికంగా ఉంటుంది.

దిన ఫలం:-కష్టమైన పనిని సులభంగా పూర్తి చేస్తారు. తక్కువ శ్రమ బుద్ధి బలం తో అధిక లాభాలు పొందగలరు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. అన్ని రకాల అవకాశాలు కలిసి వస్తాయి. బంధు మూలకం గా సహాయ సహకారాలు లభిస్తాయి. విందు వినోదాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవం గుర్తింపు లభించును. ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలు పొందగలరు.ఓం లక్ష్మీనృసింహాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

క‌‍న్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-)
తారాబలం
హస్త నక్షత్రం వారికి (సంపత్తార)బంధుమిత్రుల యొక్క కలయిక.వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

చిత్త నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధలు పెరుగుతాయి. అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు పడతారు.

దిన ఫలం:-శారీరక సౌఖ్యం మానసిక శాంతి పొందగలరు. ఉద్యోగాలలో అధికారుల ఆదరాభిమానాలు పొందగలరు. స్థిర నిర్ణయంతో అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. సంఘంలో గౌరవ మర్యాదలు పొందగలరు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా జరుగును. ధర్మ కార్యాచరణలో పాల్గొంటారు. ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు.బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

తుల (చిత్త 3 4 స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు(రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
తారాబలం
స్వాతి నక్షత్రం వారికి (పరమమిత్ర తార)వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రావచ్చు.

విశాఖ నక్షత్రం వారికి(మిత్ర తార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.


దిన ఫలం:-వృత్తి ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలను పొందగలరు.శుభవార్తలు వింటారు.క్రయ విక్రయాలు లాభసాటిగా జరుగును. సమాజంలో గౌరవ మర్యాదలు పొందగలరు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూలం. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. బంధు మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడగలవు.ఓం మహాలక్ష్మ్యై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology

వృశ్చికము (విశాఖ 4 అనూరాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4)
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
తారాబలం
అనూరాధ నక్షత్రం వారికి (నైధనతార)వాహన ప్రయాణంలో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి. ధన నష్టం రావచ్చు.

జ్యేష్ఠ నక్షత్రం వారికి(సాధన తార)బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దిన ఫలం:-మానసిక అశాంతి తో పాటు కళాకాంతులు తగ్గును. ప్రతి చిన్న విషయంలో అధికంగా కోపం పడవలసి వస్తుంది. చిన్న చిన్న అనారోగ్య బాధిస్తాయి.శారీరక మానసిక శ్రమకు గురవుతారు. ఇతరులతో అకారణంగా కలహాలు ఏర్పడగలవు. అనుకున్న పనులు సాధించలేక బాధపడవలసి వస్తుంది. మానసిక ఆందోళన ఎక్కువగా నుండును. అనవసరమైన ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology


ధనుస్సు (మూల 1 2 3 4 పూ.షాఢ 1 2 3 4, ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
తారాబలం
మూల నక్షత్రం వారికి (ప్రత్యక్తార)ఇతరులతో అకారణంగా విరోధాలు రాగలవు.   వ్యవహారాల్లో జాగ్రత్త వహించవలెను.వ్యాపారం ధన నష్టము. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.

పూ.షాఢ నక్షత్రం వారికి (క్షేమతార) సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆసక్తికరమైన విషయాలు వింటారు.తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి అగును.

దిన ఫలం:-తలపెట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి.అనేక ఆలోచనలు తో చికాకుగా ఉంటుంది. వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.ఇతరులతో అనవసరమైన వాదనలు వెయ్యకండి. కుటుంబ సభ్యులు తో కొంత సమయం ఆనందంగా గడుపుతారు.వృథా ఖర్చు అవుతాయి. ప్రతి విషయం నందు జాగ్రత్తగా ఉండాలి.ఓం సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

telugu astrology


మకరం (ఉ.షాఢ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు(భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
తారాబలం
ఉ.షాఢ నక్షత్రం వారికి (విపత్తార) వ్యాపారములో జాగ్రత్త అవసరం. సంఘములో  అవమానాలు కలుగవచ్చు .చేసే వ్యవహారంలో కోపం అధికంగా ఉండును.

శ్రవణా నక్షత్రం వారికి (సంపత్తార)బంధుమిత్రుల యొక్క కలయిక. వృత్తి వ్యాపారంలో ధన లాభం పొందగలరు.అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

ధనిష్ఠ నక్షత్రం వారికి (జన్మతార)శారీరక బాధ పెరుగుతుంది.అధికారుల వలన భయాందోళన గా ఉంటుంది.తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి

దిన ఫలం:-కుటుంబ సభ్యులతో అకారణంగా కలహాలు రాగలవు. అనవసరపు నిందలు రాగలవు. అనవసరమైన ఖర్చులు తగ్గించు కొనవలెను. దుష్ట సావాసాలు వలన కష్టనష్టాలు ఏర్పడగలవు. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా నుండును. ఉద్యోగం నందు అధికారుల తో కలహాలు రాగలవు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. ఓం గం గణపతయే నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

కుంభం (ధనిష్ట 3 4 శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు:-(గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
తారాబలం
శతభిషం నక్షత్రం వారికి (పరమమిత్ర తార) వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. తలపెట్టిన పనులు పూర్తి గాక ఇబ్బందులు ఎదురవుతాయి.

పూ.భాద్ర నక్షత్రం వారికి (మిత్ర తార)వృత్తి వ్యాపారాలలో ధన లాభం పొందగలరు.నూతన పరిచయాలు ఏర్పడగలవు.శుభవార్తలు వింటారు.

దిన ఫలం:-చేసే పనుల్లో శ్రమ ఎక్కువగా ఉండును. ఇతరులతో అనవసరపు విరోధాలు ఏర్పడవచ్చు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు రాగలవు. వాహన ప్రయాణంలో జాగ్రత్త అవసరం. అనవసరమైన ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి అవుతారు. సంఘం లో అపనిందలు ఏర్పడగలవు. వ్యవహారము నందు సరైన అవగాహన లేక ఇబ్బందులకు గురి అవుతారు.ఏదో ఒక రకమైన మానసిక ఆందోళన ఉంటుంది.ఓం మహేశ్వరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4)
నామ నక్షత్రాలు:-(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
తారాబలం
ఉ.భా  నక్షత్రం వారికి  (నైధనతార):- మానసిక చికాకులు.ప్రయాణాల యందు ఇబ్బందులు ఎదురవుతాయి. చేసే పనుల్లో కోపం అధికంగా ఉంటుంది.అపవాదము రాగలవు.

రేవతి నక్షత్రం వారికి(సాధన తార)బంధు మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు.రావలసిన సొమ్ము వసూలు చేసుకుంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

దిన ఫలం:-శారీరకంగా మానసికంగా ఉత్సాహంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాలు లాభదాయకంగా ఉంటాయి. ఉద్యోగ అభివృద్ధి  అవకాశాలు పొందగలరు. విద్యార్థులు చదువుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. గృహము నందు శుభకార్యాలు నిర్వహిస్తారు.   స్నేహితుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు.శుభవార్త వింటారు.ఓం నమో నారాయణాయ అని జపించడం మంచిది.

click me!