గురువారం దుస్తులు ఉతకకూడదా?

First Published | Mar 7, 2024, 10:53 AM IST

గురువారం శ్రీమహావిష్ణువుతో పాటుగా బృహస్పతికి అంకితం చేయబడిందిగా భావిస్తారు. బృహస్పతిని విష్ణుమూర్తి రూపంగా నమ్ముతారు. అందుకే విష్ణుమూర్తి అనుగ్రహం పొందడానికి గురువారం నాడు  కొన్ని నియమాలను పాటించాల్సి ఉంటుంది. 

ఒక వ్యక్తి అదృష్టాన్ని పెంచే ఎన్నో నియమాలు శాస్త్రాలలో ప్రస్తావించబడ్డాయి. ఒకవేళ మీరు వీటిని విస్మరిస్తే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. హిందూ మతంలో..  ప్రతి పనికి ఒక నిర్దిష్ట రోజు ,  సమయం నిర్దేశించబడింది. ఉదాహరణకు.. కొన్నిరోజుల్లో జుట్టును కట్ చేయడం, గోర్లు కట్ చేయడం లేదా బట్టలు ఉతకడం నిషిద్ధం. అయితే గురువారం నాడు దుస్తులు ఉతకడం కూడా నిషిద్దమే. అసలు గురువారం నాడు ఎందుకు దుస్తులు ఉతకూడదో  ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

washing machine

జ్యోతిష్య కారణాలు

జ్యోతిషశాస్త్రంలో.. సుఖసంతోషాలకు కారకమైన బృహస్పతిని దేవగురువు అని కూడా అంటారు.  అయితే సాధారణంగా ఆడవాల్లు ఇళ్లలో దుస్తులు ఉతుకుతుంటారు. కానీ లాండ్రీ శని గ్రహంతో సంబంధం కలిగి ఉంటుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. 


అందుకే గురువారం నాడు ఆడవాళ్లు దుస్తులు ఉతకడం వల్ల అశుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీనితో పాటుగా గురువారం ఇళ్లు మురికిగా ఉండకూడదని కూడా చెప్తారు. అందుకే మురికి దుస్తులు ఉతకడం ఈ రోజు నిషిద్ధం. దీంతో దుస్తుల మురికి నీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్లదు. 

ఈ పనులు కూడా నిషిద్దమే

గురువారం నాడు షేవింగ్ చేయడం లేదా గోర్లు కత్తిరించడం కూడా నిషిద్ధంగానే భావిస్తారు. ఎందుకంటే ఈ రోజు ఈ పనులను చేయడం వల్ల బృహస్పతి గ్రహంపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇది ఒక వ్యక్తి జీవితంపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో వీళ్లు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

గురువారం లేదా రాత్రిపూట దుస్తులు ఉతకకూడదని జ్యోతిష్యులు చెబుతున్నారు. లేదంటే మీరు ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు ఉండవని నమ్ముతారు.మీరు ఎన్నో ఆర్థిక సమస్యలను కూడా ఎదుర్కోవలసి ఉంటుంది.

Latest Videos

click me!