bad dreams
మనకు రాత్రిపూట ఏదో ఒక కల పడుతుంటుంది. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మనల్ని భయం కలిగించేవి, బాధపెట్టేవి, ఏడిపించేవి ఉంటాయి. డ్రీమ్ సైన్స్ ప్రకారం.. మనకు పడే ప్రతి కల మన భవిష్యత్తు గురించి ఏదో ఒక విషయాన్ని చెప్తుంది. అయితే మనలో చాలా మందికి కలలో దెయ్యాలు కనిపిస్తుంటాయి. దెయ్యాల కలల వల్ల అర్థరాత్రిళ్లు అకస్మత్తుగా లేచి భయపడిపోతుంటారు. ఇక అప్పటి నుంచి తెల్లవార్లూ మెలుకువగా కూడా ఉంటారు. దెయ్యాలు ఉన్నాయన్న విషయాన్ని చాలా మంది నమ్మరు. కానీ కొంతమంది మాత్రం బాగా నమ్ముతారు. ఎవరి నమ్మకాలు వాళ్లకున్నా.. జ్యోతిష్యం ప్రకారం.. కలలో దెయ్యాలు కనిపిస్తే అర్థమేంటో తెలుసుకుందాం పదండి.
bad dreams
కలలో దెయ్యాన్ని చూస్తే..
మీకు ఎప్పుడూ ఏదో ఒక పీడకల పడుతూనే ఉంటుందా? అయితే మీరు మానసికంగా బలహీనంగా ఉన్నారని డ్రీమ్ సైన్స్ చెబుతోంది. అవును మానసికంగా బలంగా లేనప్పుడు మాత్రమే ఇలాంటి దెయ్యాల కలలు, పీడకలలు పడతాయట. ఇది మానసిక బలహీనతకు సంకేతం.
మరింత భావోద్వేగానికి గురికావడం
మీరు ఏదైనా తప్పు చేసారని అనుకున్నప్పుడు లేదా వేరేవాళ్లు మిమ్మల్ని నిందించినప్పుడు బాగా భావోద్వేగానికి లోనవుతారు. ఇది మీకు ఎంతో బాధకలిగిస్తుంది. అయితే ఇలాంటప్పుడు కూడా మీ కలలో దెయ్యాలు కనిపిస్తాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.
దెయ్యం మీపై దాడి చేస్తే..
కలలో మీపై ఒక దెయ్యం వచ్చి మీపై దాడిచేస్తున్నట్టు లేదా కనిపించని ఆత్మ మీపై దాడిచేసిన్నప్పుడు మీరు దాని చేతిలో ఓడిపోయినట్టు కలగన్నారా? అయితే ఏదో ఒకటి మిమ్మల్ని మీ విజయానికి దూరం చేస్తున్నట్టు అర్థం. ఏదో మీరు సాధించుకుండా అడ్డుపడుతుందని మీ మనస్సులో ఉందని ఈ కల సూచిస్తుంది.
భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ..
దెయ్యం కలలో మీపై దాడి చేయడమంటే.. మీ భవిష్యత్తు గురించి మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు. అలాగే చాలా భయపడుతున్నారనడానికి కూడా సంకేతం. మీరు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడే దెయ్యాలకలలో వస్తాయి.
రియల్ లైఫ్ పై ప్రభావం..
మీరు కలలో దెయ్యాలను చూసి లేదా వాటి గురించే ఎక్కువగా ఆలోచిస్తూ భయపడితే మాత్రం పక్కాగా మీ నిజ జీవితంపై చాలా ప్రభావం పడుతుంది. ఎందుకంటే దెయ్యాలు ఉన్నాయని మీరు నమ్మి ఎక్కడికీ వెళ్లకుండా ఉంటారు. చీకట్లో ఏది చూసినా దెయ్యమే అనుకుంటారు. భయం వల్ల మీరు ఎటూ వెళ్లలేరు. ఏ పని చేయలేరు. దీనివల్ల మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
దెయ్యాలతో మాట్లాడితే..
మీరు కలలో దెయ్యంతో మాట్లాడినట్టు కలగంటే మీరు ఎన్నో గండాలు, కష్టాల నుంచి మీరు బయటపడుతుండటాన్ని ఇది సూచిస్తుంది. అయితే మీరు కలలో చూసినదాన్ని గుర్తుంచుకోవాలి.
అద్దంలో దెయ్యాలను చూస్తే..
మీరు మీ కలలో అద్దంలో దెయ్యాన్ని చేస్తే.. కనిపిస్తే, మీరు కొన్ని రోజులుగా ఆందోళన చెందుతున్న సమస్యలు త్వరలోనే పరిష్కరామవబోతున్నాయని అర్థం. ఇది మీ సమస్యల పరిష్కారాన్ని సూచిస్తుంది.