Ugadi Rasi Phalalu 2024: శ్రీ క్రోధి నామ సంవత్సర సింహ రాశి ఫలితాలు.

First Published | Apr 4, 2024, 3:22 PM IST


శ్రీ క్రోధి నామ సంవత్సరానికి సంబంధించిన  సింహ రాశి ఫలితాలివి. ఈ ఉగాది మొదలుకుని వచ్చే ఏడాది వరకు  సింహరాశి వారికి సంబందించిన మాస, వార్షిక ఫలితాలను ఇక్కడ చూడొచ్చు. అలాగే జన్మ నక్షత్రం ఆధారంగానూ ఫలితాలను ఇక్కడ తెలుసుకోవచ్చు.
 

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ 1 2 3 4, ఉత్తర 1):
నామ నక్షత్రాలు (మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)

ఆదాయం:-2
వ్యయం:-14

రాజపూజ్యం:-2
అవమానం:-2
 

గురుడు 1-5-25 వరకు భాగ్య స్థానంలో తామ్ర మూర్తి గా సంచరించి.తదుపరి రాజ్య స్థానంలో సువర్ణమూర్తి గా సంచారం.

శని ఈ సంవత్సరం అంతా కళత్ర స్థానంలో లోహ మూర్తి గా సంచారం.

రాహువు ఈ సంవత్సరం అంతా తామ్ర మూర్తి గా అష్టమ స్థానంలో సంచారం.

కేతువు ఈ సంవత్సరం అంతా తామ్ర మూర్తి గా ధన స్థానంలో సంచారం.


మే నెల నుంచి గురుడు దశమ స్థానం అనగా రాజ్య స్థానంలో సంచారం. ఈ సంచారం వలన వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఉద్యోగాలలో అధికారులు తో అకారణంగా కలహాలు రాగలవు.ఉద్యోగాలు లో చేర్పులు మార్పులు జరుగును.వ్యాపారాల్లో పెట్టుబడులు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. కుటుంబంలో చికాకులు అధికమవుతాయి.సంతానం తో ఇబ్బందులు.ఆరోగ్య సమస్యలు రాగలవు.శారీరకంగా మానసిక ఇబ్బందులుంటాయి .అనేక ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.శరీరంలో ఆరోగ్య బాధలు ఇబ్బందులకు గురి కావడం.నిరుత్సాహంగా ఉంటుంది.ఆలోచన విధానాలు మందగిస్తాయి.పరిశ్రమల నిర్వహణ శక్తి సామర్థ్యాలు తగ్గుతాయి.మనస్సునందు భయం గా ఉంటుంది .ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.సమాజంలో గౌరవం తగ్గుతుంది.అనవసర ప్రయాణాలు వలన ధన నష్టం కలుగుతుంది.మానసికంగా శారీరకంగా బలహీన పడతారు. విలువైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.పుత్ర సంతానం వలన సంఘంలో గౌరవం పెరుగుతుంది.విద్యార్థులకు కోరుకున్న విద్యలు లభిస్తాయి.నూతన వ్యాపారం ప్రారంభం చేస్తారు.శని కళత్ర స్థానంలో సంచారం ఈ సంచారం.మానసిక భయాందోళన .భార్యాభర్తల మధ్య అన్యోన్యత తగ్గి విరోధాలు రావచ్చు.వివాహ ప్రయత్నాలు లో నిరాశ చెందుతారు. వ్యాపారంలో ధన నష్టం. వ్యాపార అభివృద్ధి విషయాలు మందంగా ఉంటాయి.అకారణంగా ఇతరులతో కలహాలు రాగలవు.చోర భయం.దుష్ట కార్యకలాపాలకు దూరంగా ఉండాలి.రాహువు సంచారం వలన ప్రభుత్వ అధికారులు తో విరోధాలు.తలపెట్టిన కార్యాలలో ఆటంకాలు.

కేతు సంచారం అనుకూలంగా లేదు


మఘ నక్షత్రం వారికి
గురుడు 30-05-24 వరకు విపత్తార లో సంచారం తదుపరి 13-6-24 వరకు క్షేమతార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి ప్రత్యక్ తార లో సంచారం

శని 3-10-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి సాధనతార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు నైధన తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు పరమ మిత్ర తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  మిత్ర తార లో సంచారం

కేతువు 11-11-24 వరకు క్షేమ తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం విపత్తార లో సంచారం

పూ.ఫల్గుణి నక్షత్రం వారికి
గురుడు 13-06-24 వరకు సంపత్తార లో సంచారం తదుపరి 13-6-24 నుంచి విపత్తార లో సంచారం తదుపరి 20-8-24 నుంచి క్షేమతార లో సంచారం

శని 3-10-24 వరకు సాధన తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి ప్రత్యక్తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు సాధన తార లో సంచారం.

రాహు 7-7-24 వరకు మిత్ర తార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  నైధనతార లో సంచారం

కేతువు 11-11-24 వరకు విపత్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం సంపత్తార లో సంచారం

ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి
గురుడు 13-06-24 వరకు జన్మతారలో సంచారం తదుపరి 13-6-24 నుంచి సంపత్తార లో  సంచారం తదుపరి 20-8-24 నుంచి  విపత్తార లో సంచారం.

శని 3-10-24 వరకు ప్రత్యక్తార లో సంచారం తదుపరి 04-12-24 నుంచి క్షేమ తార లో సంచారం తదుపరి 27-12-24 నుంచి సంవత్సరాంతం వరకు ప్రత్యక్తార లో సంచారం.

రాహువు 7-7-24 వరకు నైధనతార లో సంచారం తదుపరి సంవత్సరాంతం  సాధన తారలో సంచారం

కేతువు 11-11-24 వరకు సంపత్తార లో సంచారం. తదుపరి 12-11-24 నుంచి సంవత్సరాంతం జన్మతారలో సంచారం


(ఈ సంవత్సరం ఈ రాశి వారికి గురు శని రాహు కేతు సంచారం బాగా లేదు. కావున దుర్గారాధన మరియు గురు చరిత్ర పారాయణ  తరచూ చేసుకోవడం వలన శుభ ఫలితాలు పొందగలరు.)


ఏప్రిల్
ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహారాల్లో వ్యక్తిగత పర్యవేక్షణ అవసరం.ఇతరులతో సంయమనం చేసుకొనుట తప్పనిసరి.అనవసరపు ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి.ఆరోగ్యం విషయంలో ముందు జాగ్రత్తలు పాటించాలి. అన్ని రంగాల వారికి గ్రహ సంచారం అంత అనుకూలం కాదు.చేసే పనులు లో శారీరక శ్రమ అధికంగా ఉండి అలసటకు గురి కావాల్సి వస్తుంది.సమయం కానీ సమయంలో భోజనం చేయవలసి వస్తుంది.బంధు మిత్రులతో వివాదాలు కలుగును. కుటుంబం నందు కలహాలు అశాంతి వాతావరణం ఉండును.ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలి.ఆర్థికపరమైన చిక్కులు ఏర్పడతాయి.


మే
వ్యవహారాల్లో మానసికంగా ధైర్యంగా వ్యవహరిస్తారు.నూతన అవకాశాలు మంచివి కొన్ని రాగలవు.అన్ని రంగాల వారికి అన్ని విధాలుగా బాగుంటుంది.వృత్తి వ్యాపారాల్లో రాణింపు ఉంటుంది.ఆరోగ్యం బాగుంటుంది.ఉద్యోగాలలో ఉత్సాహం చూపుతారు.ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉంటాయి.బాకీ రావలసిన ధనం సరైన సమయంలో చేతికి అందుతాయి.ఉత్సాహంగా ఉల్లాసంగా ఆనందంగా గడుపుతారు.బంధుమిత్రుల తో సఖ్యత పెరుగుతుంది.ఏ పనిలోనైనా స్వయంకృతాపరాధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
 


జూన్
తలచిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు.అని వ్యవహారాల నందు జాగ్రత్తగా సరిచూసుకొని ముందుకు వెళ్ళవలసి ఉంటుంది.వైవాహిక జీవితం ఆనందమయంగా గడుపుతారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి. చేతి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి.గృహంలో వివాహాది శుభకార్యాలు జరుగును. నూతన వాహన మరియు అలంకార వస్తువులు కొనుగోలు చేస్తారు.సమాజము నందు మంచి గౌరవం లభిస్తుంది.మీ మాటకు విలువ పెరుగుతుంది.సంతానం ద్వారా సంతోషకరమైన వార్త వింటారు.

జూలై
ఈ నెలలో మొదటి రెండు వారాలు అన్ని రంగాల వారికి బాగుంటుంది.తదుపరి ఆదాయానికి మించిన ఖర్చులు పెరుగుతాయి.చిన్నపాటి ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి.బంధుమిత్రులతో విరోధాలు రాగలవు.ఉద్యోగస్తులకు స్థానచలనం లేదా గృహమునందు గృహ మార్పులు తప్పవు.ఇంటా బయట సమస్యలు అధికంగా ఉంటాయి.వసూలు కావాల్సిన బాకీలు వసూలు కాక ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఉద్యోగస్తులకు పై అధికారులు తో మాటపడవలసి వస్తుంది. మానసికంగా ఆందోళన ఒత్తిడి అధికంగా ఉంటాయి.


ఆగస్టు
అన్ని విధాలా బాగుంటుంది. చేయు వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులు విద్య యందు మంచి ఉత్తీర్ణత సాధిస్తారు.వివాహ ప్రయత్నాలు చేయువారికి వివాహ అవకాశాలు మెరుగుపడతాయి.ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.ఆస్తికి సంబంధించిన వివాదాలు చక్కబడతాయి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.వ్యవహారంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో సమస్యలు చక్కబడతాయి.ఉద్యోగస్తులకు పదోన్నతులు అధికారులు యొక్క అనుగ్రహం లభిస్తుంది.దైవ సంబంధిత కార్యాలు ఆచరించడం లేక పాల్గొనడం చేస్తారు.

Leo


సెప్టెంబర్
అన్ని రంగాల వారికి గ్రహ సంచారం మధ్యస్థంగా ఉంది. ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ ప్రయోజనకరంగా ఉంటాయి.దూరపు ప్రయాణాలు చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యుల కు సరైన సమయం కేటాయించలేక పోతారు. వ్యవహారాల్లో బంధుమిత్రుల యొక్క సహకారాలు లభిస్తాయి.రావలసిన బాకీలు వసూలు అవుతాయి.భూ నూతన గృహ క్రయవిక్రయాలు చేస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గతము కంటే మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబంలో మీ మాట పై చేయగా ఉంటుంది.శత్రువులపై మీయొక్క ఆదిక్యత చూపిస్తారు.


అక్టోబర్
అన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం.అన్ని రంగాల వారికి అన్ని రకాలుగా బాగుంటుంది.ఆరోగ్యం చేకూరి ప్రశాంతత లభిస్తుంది.ధనాదాయ మార్గాలు సంతృప్తికరంగా ఉంటాయి.వ్యవహారాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు.నూతన వాహన విలువైన వస్తు కొనుగోలు చేస్తారు.అందరి నుంచి మంచి ప్రోత్సాహాలు పొందుతారు. తోబుట్టువుల నుండి అనుకూలమైన వాతావరణం.పిల్లల విషయంలో సంతోషకరమైన శుభవార్త వింటారు.ఆర్థికపరమైన చిక్కులు తొలగి ఆర్థికంగా బలపడతారు.శుభ కార్యక్రమం ప్రయత్నాలు చేస్తారు.


నవంబర్
ఈనెల ప్రతికూలమైన ఫలితాలు ఉండగలవు. ప్రతి విషయంలో దూకుడుగా దురుసుగా కోపంగా ప్రవర్తించడం వల్ల కార్యక్రమాల్లో ఆటంకాలు ఏర్పడి మధ్యలో నిలిచిపోవును. మధ్యలో నిలిచిపోయిన చివరికి మీకు అనుకూలంగా పూర్తి అవును. ఆర్థిక సర్దుపాట్లు అంతంత మాత్రమే ఉంటాయి.శత్రువర్గం వృద్ధి చెందే అవకాశం ఉంది.చిన్న పాటి అనారోగ్య సమస్యలు ఎదురవగలవు.విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు అవసరం.భార్యాభర్తల మధ్య చిన్నపాటి మనస్పర్థలు రాగలవు.నూతన పరిచయాలు లాభం చేకూరుస్తాయి.నమ్మిన వారి వల్ల దగా బడుదురు.

Leo


డిసెంబర్
శ్రమకు తగిన ఫలితాలు ఆలస్యంగా పొందుతారు.సమయానికి సందర్భానికి ఆలోచనలు అందక వ్యవహారాలలో ఇబ్బందులు పడతారు.సమాజంలో మీపై నిందలు అపనిందలు పడే అవకాశం ఉన్నది.ఖర్చులు మీ పరిధిని దాటి చేయవలసి ఉంటుంది.విద్యార్థులు చదువు యందు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాల్సి ఉంటుంది.సంగీతం వంటి కళలను సృజనాత్మకతను కనబరిచి సమయాన్ని వెచ్చించి ఆనందంగా గడుపుతారు.నూతన వస్తు సేకరణ చేస్తారు.మిత్రులతో విభేదాలు రాగలవు.వృత్తి వ్యాపారం అనుకూలంగా ఉంటాయి.


జనవరి
చిన్న తరహా శుభకార్యాలు ఉత్సవాలు వంటివి గృహంలో జరుగును.అవసరాలకు సరిపడా ధనం లభిస్తుంది.మూడో వారంలో అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది.పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.ఊహించని పరిణామాలు ఎదురవుతాయి.సమాజంలో అపవాదాలు రాగలవు.పెద్దలచే మాట బడుట. సోదరులతో విరోధాలు ఏర్పడతాయి.మాసాంతంలో బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.నూతన వస్తు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. విలాసాలను అనుభవిస్తారు.సమస్తమైన కోరికలు నెరవేరుతాయి.

Astro

ఫిబ్రవరి
ఈనెల శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. ఆదాయం వ్యయం సమానంగా ఉంటాయి.ఆరోగ్యరీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఊహించిన పరిణామాలు ఎదురయి మానసికంగా ఆందోళన చెందుతారు.వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు.దూరపు బంధువులను కలుసుకుంటారు. అత్యవసరమైన ఖర్చులు అధికంగా ఉంటాయి.ఆస్తికి సంబంధించిన వ్యవహారాలు చక్క పరుచుకుంటారు. తెలియని వ్యక్తులచే మాట పడవలసి ఉంటుంది.కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు.


మార్చి
విద్యార్థులు శ్రద్ధతో చదివి పరీక్షల్లో విజయం ఉత్తీర్ణత సాధిస్తారు.చేతివృత్తుల వారికి అనేక విధములైన లాభాలు ప్రోత్సాహకాలు లభిస్తాయి.కుటుంబ సభ్యులు మీ పట్ల గౌరవం మర్యాద పెరుగుతుంది.ప్రయత్నించిన కార్యాల్లో చిన్నపాటి ఆటంకాలు ఎదురైనా సానుకూలంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి.గృహ నిర్మాణ పనులు కలిసి వస్తాయి.ప్రయాణాలు నూతన పరిచయాలు వలన లాభం కలుగును.ఇతరుల విషయాల్లో మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు.పిల్లలు మాట వినకపోవడం వలన కోపానికి గురి అవుతారు.

 జోశ్యుల  రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Latest Videos

click me!