Today Horoscope: ఓ రాశివారికి ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి

Published : May 24, 2024, 05:30 AM IST

Today Horoscope:రాశి చక్రం లోని పన్నెండు రాశుల వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికి ఇబ్బందులు ఉంటాయి ...ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం..

PREV
112
 Today Horoscope: ఓ రాశివారికి ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి
telugu astrology


24-5-2024,  శుక్రవారం  మీ రాశి ఫలాలు (దిన ఫల,దినాధిపతులు తో..)

మేషం (అశ్విని 1 2 3 4 భరణి 1 2 3 4 కృత్తిక 1)
నామ నక్షత్రాలు(చూ-చే-చో-లా-లీ-లూ-లే-లో-ఆ)
దినాధిపతులు
అశ్విని నక్షత్రం వారికి(దినపతి చంద్రుడు)
భరణి నక్షత్రం వారికి(దినాదిపతి బుధుడు)
కృత్తిక నక్షత్రం వారికి(దినాదిపతి శుక్రుడు)

దిన ఫలం:-ఇంటా బయటా ప్రతికూల వాతావరణ ఉంటుంది.పని చేయు వారితో ఇబ్బందులు కలుగుతాయి.సంఘంలో వాదోపవాదాలు కు దూరంగా ఉండాలి.మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.ప్రభుత్వ సంబంధిత పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.అనవసరమైన వస్తువులు కొనుగోలు ద్వారా అధిక ధనాన్ని ఖర్చు చేస్తారు.ప్రయాణాల తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన వస్తువులు యందు జాగ్రత్త అవసరం.బంధువర్గంతో కలహాలు రాగలవు.జీవిత భాగస్వామితో సఖ్యత గా మెలగాలి.ఓం వీరభద్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి

212
telugu astrology


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2)
నామ నక్షత్రాలు (ఈ-ఊ-ఏ-ఓ-వా-వీ-వూ-వే-వో)
దినాధిపతులు
రోహిణి నక్షత్రం వారికి (దినాదిపతి రాహు)
మృగశిర నక్షత్రం వారికి (దినపతి రవి)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.నూతన కార్యాలకు శ్రీకారం చేస్తారు.బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.పాత బాకీలు వసూలు అవును.సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది.అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి.పెద్దల సహాయ సహకారాలు లభిస్తాయి.ప్రశాంతత గా గడుపుతారు. ఉద్యోగాలు లో  అధికారులు మన్ననలు పొందగలరు.ఓం జగన్నాధాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

312
telugu astrology


మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3)
నామ నక్షత్రాలు (కా-కి-క-కూ-ఖం-జ్ఞ-చ్ఛ-కే-కో-హ-హి)
దినాధిపతులు
ఆరుద్ర నక్షత్రం వారికి  (దినాదిపతి కుజుడు)
పునర్వసు నక్షత్రం వారికి (దినాదిపతి గురుడు)

దిన ఫలం:-కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి.చేసే పనులు పూర్తికాక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొత్తవారితో స్నేహం వలన కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఇంటా బయట గొడవలు గా ఉంటుంది.సోదరులు తో మనస్పర్థలు ఏర్పడవచ్చు. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. రాజకీయ కళారంగాల వారికిప్రోత్సహకరం.వృత్తి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.చెడు స్నేహాలు కు దూరంగా ఉండాలి. ఉద్యోగాలలో అధికారుల ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.మానసికంగా ఆందోళన. ధనాదాయ మార్గాలు అన్వేషణ చేస్తారు.ఓం మంగళప్రదాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

412
telugu astrology

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష )
నామ నక్షత్రాలు (హి-హు-హే-హో-డా-డీ-డూ-డే-డో)
దినాధిపతులు
పుష్యమి నక్షత్రం వారికి (దినాధిపతి శని)
ఆశ్రేష నక్షత్రం వారికి (దినాదిపతి కేతువు )

దిన ఫలం:-అనవసరమైన పనులకు దూరంగా ఉండటం మంచిది.శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది.చేయు పని వారితో ఇబ్బందులు ఎదురవుతాయి.వృత్తి వ్యాపారాల్లో ధన నష్టం ఏర్పడవచ్చును.అనవసరమైన ఆలోచనలు చేస్తూ కాలయాపన జరుగుతుంది. చేతికి వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి.కొద్దిపాటి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడును.సంఘంలో అవమానాలు కలుగ వచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.చెడు స్నేహాల వల్ల కొద్దిపాటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఓం ఛాయా పుత్రాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి
 

512
telugu astrology

సింహం (మఖ పుబ్బ ఉత్తర 1)
నామ నక్షత్రాలు(మా-మీ-మూ-మో-టా-టీ-టూ-టే)
దినాధిపతులు
మఘ నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
పూ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినాదిపతి బుధుడు)
ఉ.ఫల్గుణి నక్షత్రం వారికి  (దినాదిపతి శుక్రుడు)

దిన ఫలం:-సంఘంలో  కీర్తి ప్రతిష్టలు పొందుతారు.తలపెట్టిన  పనులు సకాలంలో పూర్తి అగును. ప్రభుత్వ సంబంధిత పనులు సజావుగా పూర్తి చేస్తారు.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి వ్యాపారాల్లో ధన లాభం పొందుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు.రావలసిన బాకీలు వసూలు అవును.ప్రయాణాలు అనుకూలిస్తాయి.ఉద్యోగాలు లో పెద్ద వారి యొక్క సహకారం వలన ఇబ్బందులు తొలగి ఉపశమనం పొందుతారు.దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు.ఓం బృహస్పతయే నమః అని  జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

612
telugu astrology

కన్య (ఉత్తర 2 3 4, హస్త , చిత్త 1 2)
నామ నక్షత్రాలు(టో-పా-పి-పూ-షం-ణా-ఠ-పే-పో)
దినాధిపతులు
హస్త నక్షత్రం వారికి(దినాదిపతి రాహు)
చిత్త నక్షత్రం వారికి(దినాదిపతి రవి)

దిన ఫలం:-అనుకోని కలహాలతో మనసు చికాకులు గా ఉంటుంది.చెడు స్నేహితులు కు దూరంగా ఉండాలి.చేయు వ్యాపారాల్లో అభివృద్ధి సంబంధిత పనుల్లో ఇతరుల సహాయ సహకారాలు తీసుకోవాలి.పట్టుదల తో చేసే పనుల్లో విజయం సాధిస్తారు . మనస్సునందు ఆందోళనగా ఉంటుంది.సంఘంలో వివాదాలకు దూరంగా ఉండాలి.సమయానుకూలంగా తెలివిగా ముందుకు సాగాలి.ప్రయాణాల్లో తగు జాగ్రత్త అవసరం.ఓం అర్థ శరీరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

712
telugu astrology

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3)
నామ నక్షత్రాలు (రా-రి-రూ-రో-తా-తీ-తూ-తే)
దినాధిపతులు
స్వాతి నక్షత్రం వారికి  (దినాదిపతి కుజుడు)
విశాఖ  నక్షత్రం వారికి  (దినాదిపతి గురుడు)

దిన ఫలం:-అధికారులు తో కొద్దిపాటి విరోధములు రాగలవు.కుటుంబ సభ్యులతో ప్రతికూల వాతావరణం. అనవసరమైన ఖర్చులు చేయవలసి వస్తుంది.బంధుమిత్రులతో మాట పట్టింపులు రావచ్చు. మానసిక ఆందోళన గా ఉంటుంది.ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలను సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి.పనులు పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.వృత్తి వ్యాపారాల్లో కొద్దిపాటి ధన నష్టం కలుగవచ్చు.కోపాన్ని తగ్గించుకుని అందరితోనూ సఖ్యత గా మెలగాలి.కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు  ఇబ్బంది కలిగిస్తాయి.సూర్యాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

812
telugu astrology


వృశ్చికము (విశాఖ 4, అనూరాధ , జ్యేష్ఠ )
నామ నక్షత్రాలు(తో-నా-నీ-నూ-నె-నో-యా-యీ-యు)
దినాధిపతులు
అనూరాధ నక్షత్రం వారికి (దినాధిపతి శని)
జ్యేష్ట నక్షత్రం వారికి (దినాదిపతి కేతువు )

దిన ఫలం:-సంఘంలో గౌరవం కీర్తి ప్రతిష్టలు పొందుతారు.రావలసిన బాకీలు వసూలు అవును.నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు.జీవిత భాగస్వామి తో ఆనందంగా గడుపుతారు.వృత్తి వ్యాపారాల్లో ధన లాభం కలుగుతుంది. ధనాన్ని వృద్ధి చేయు పథకాలు ను ఆలోచిస్తారు.నూతన కార్యకలాపాలకు శ్రీకారం చేస్తారు. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు కి ధనాన్ని ఖర్చు చేస్తారు.అనుకున్న పనులన్నీ సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు.నూతన పరిచయాలు కలిసి వస్తాయి.ప్రయాణాలు అనుకూలం.ఓం భార్గవాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

912
telugu astrology


ధనుస్సు (మూల ,పూ.షాఢ , ఉ.షాఢ 1)
నామ నక్షత్రాలు(యే -యో-య-భా-భీ-భూ-ధ-ఫ-ఢా-భే)
దినాధిపతులు
మూల నక్షత్రం వారికి (దినపతి చంద్రుడు)
పూ.షాఢ నక్షత్రం వారికి (దిన అధిపతి బుధుడు)
ఉ.షాఢ నక్షత్రం వారికి (దినాదిపతి శుక్రుడు)

దిన ఫలం:-శుభవార్తలు వింటారు.గృహంలో ఆనందకరమైన వాతావరణం.చేసే పనిలో మిత్రులు యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి.సంఘంలో ప్రతిభకు తగ్గ గౌరవం లభించును.ఇతరులకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు. ఆరోగ్యం సమకూరి ప్రశాంతంగా లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు లో అధిక ధన లాభం చేకూరును. ఉద్యోగాలు ఉ ఆనందంగా గడుపుతారు. \విందు వినోదాలలో పాల్గొంటారు.ప్రయాణాలు లాభిస్తాయి.ఓం నిశాకరాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1012
telugu astrology

మకరము (ఉ.షాడ 2 3 4, శ్రవణం , ధనిష్ట 1 2)
నామ నక్షత్రాలు (భో-జా-జి-ఖి-ఖు-ఖె-ఖో-గా-గ)
దినాధిపతులు
శ్రవణా నక్షత్రం వారికి (దినాదిపతి రాహు)
ధనిష్ఠ నక్షత్రం వారికి(దినపతి రవి)

దిన ఫలం:-భావోద్వేగాలు తో చేసే పనులు వలన కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఉద్యోగాలు లో ఎదురైన సమస్యలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.జీవిత భాగస్వామితో కొద్దిపాటి మనస్పర్థలు ఏర్పడవచ్చు.  కీలకమైన పనులలో ఆటంకాలు ఏర్పడతాయి.ముఖ్యమైన వస్తువుల యందు తగు జాగ్రత్త అవసరం.వాహన ప్రయాణాలు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి.ఓం నమో నారాయణాయ నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.
 

1112
telugu astrology


కుంభం (ధనిష్ఠ 3 4 శతభిషం , పూ.భాద్ర 1 2 3)
నామ నక్షత్రాలు (గూ-గే-గో-సా-సీ-సు-సే-సో-దా)
దినాధిపతులు
శతభిషం నక్షత్రం వారికి (దినాదిపతి కుజుడు)
పూ.భాద్ర నక్షత్రం వారికి (దినాదిపతి గురుడు)

దిన ఫలం:-ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.తలచిన పనుల్లో విజయం సాధిస్తారు.ఇతరులతో వాదోపవాదములు దూరంగా ఉండాలి.ఉద్యోగాలలో పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.వృత్తి వ్యాపారాల్లో కష్టానికి తగ్గ ప్రతిఫలం లభించును.ఇతరుల  విషయాల్లో జోక్యం చేసుకోవడం కొత్త సమస్యలు రాగలవు. వివాదాలకు దూరంగా ఉండాలి.అనవసరమైన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.ఓం దుర్గాయై నమః అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

1212
telugu astrology

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర , రేవతి )
నామ నక్షత్రాలు(దీ-దూ-ఝ-దా-దే-దో-చా-చి)
దినాధిపతులు
ఉ.భాద్ర నక్షత్రం వారికి (దినాధిపతి శని)
రేవతి నక్షత్రం వారికి (దినాదిపతి కేతువు )

దిన ఫలం:-ఎలాంటి కష్టమైన పరిస్థితి నైనా చాకచక్యంగా ఎదుర్కొంటారు.ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. వైవాహిక జీవితం ఆనందంగా గడుపుతారు.మీ ఆలోచనలు ఆచరణలో పెడతారు.విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది.ఇంటా బయటా గౌరవం పెరుగుతుంది.బంధుమిత్రుల యొక్క కలయిక.ఉద్యోగాలలో కొద్దిపాటి ఒడిదుడుకులు ఇబ్బంది కలగచేస్తాయి.కీలకమైన సమస్య ను జీవిత భాగస్వామి సలహాలు తీసుకోవడం మంచిది.ఓం నమశ్శివాయ అని జపించండి శుభ ఫలితాలను పొందండి.

మనకు ఈ రాశి ఫలితాలు అందిస్తున్న వారు  జోశ్యుల రామకృష్ణ. ఈయన ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్ధాంతి, స్మార్త పండితులు - గాయత్రి ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ విద్యార్థి)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యాలయం- ఫోన్:   8523814226  (సంప్రదించు వారు వాట్సప్ లో డిటేల్స్ మరియు సమస్యలు చెప్పండి ...సాయంత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Read more Photos on
click me!

Recommended Stories