Latest Videos

రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకులను కాల్చితే ఏమౌతుందో తెలుసా?

First Published May 23, 2024, 1:25 PM IST

సాధారణంగా బిర్యానీ ఆకులను వివిధ రకాల ఆహారాల్లో మసాలా దినుసుగా వేస్తుంటారు. ఇది వంటలను టేస్టీగా చేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రకారం.. రాత్రిపూట రెండు బిర్యానీ ఆకులను కాల్చితే ఏమౌతుందంటే?
 

వాస్తు శాస్త్రంలో.. ఇంటికి సంబంధించిన ఎన్నో నియమాల గురించి వివరించబడ్డాయి. ఇవి ఇంట్లోని సమస్యలను అధిగమించగలవు. అలాగే వాస్తు శాస్త్రంలో బిర్యాని ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రతి రాత్రి మీ ఇంట్లో 2 బిర్యానీ ఆకలును కాల్చితే అది మీ జీవితంలోని ఎన్నో ఇబ్బందులను తొలగిస్తుంది. రాత్రి పూట ఇంట్లో 2 బిర్యానీ ఆకులను కాల్చడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

నెగిటివ్ ఎనర్జీని తొలగించండి

మీ ఇంట్లో ఏదైనా ప్రతికూలత అనిపిస్తే.. ప్రతిరోజూ రాత్రి రెండు బిర్యానీ ఆకులను కాల్చిండని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే ఇది అన్ని రకాల ప్రతికూల శక్తులను నాశనం చేస్తుంది. ఇది మీ ఇంట్లో నెగిటీవ్ ఎనర్జీని దూరం చేస్తుంది.

ఒత్తిడిని తగ్గిస్తుంది

ప్రతి ఒక్కరి ఇంట్లో ఒత్తిడి ఖచ్చితంగా ఉంటుంది. మీ కుటుంబం గనుక మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటుంటే ప్రతిరోజూ రాత్రిపూట ఇంట్లో బిర్యానీ ఆకులను కాల్చండి. ఇది ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. 
 

రోగాల నుంచి ఉపశమనం

కొంతమంది కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యానికి గురవుతుంటారు. మీ కుటుంబ సభ్యులు కూడా తరచుగా అనారోగ్యానికి గురైతే మాత్రం ఇంట్లో సాయంత్రం తర్వాత 2 బిర్యానీ ఆకులను కాల్చండి. ఇది ఎన్నో వ్యాధుల నుంచి మీకు ఉపశమనం కలిగిస్తుంది.
 

bay leaf

పీడ కలలు 

చాలా మందికి రాత్రిపూట పీడకలలు పడుతుంటాయి. అయితే  రాత్రిపూట పీడకలలు మిమ్మల్ని కూడా వేధిస్తున్నట్టైతే ప్రతిరోజూ రాత్రి రెండు బిర్యానీ ఆకులను కాల్చండి. ఇది చెడు కలల నుంచి బయటపడటానికి మీకు సహాయపడుతుంది.
 

bay leaf

దుష్ట కంటి నుంచి రక్షణ 

చెడు కన్ను అస్సలు మంచిది కాదు. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని, శారీరక ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. అయితే మీ ఇంటిని ఎవరిదైనా చెడు కన్ను తాకినట్టైతే  రాత్రిపూట రెండు బిర్యానీ ఆకులను కాల్చిండి. ఇది చెడు కంటి దోషం ప్రభావాలను తగ్గించడానికి సహాయపడుతుంది. 

వాస్తు దోషం తొలగించండి

ఇంటి వాస్తు లోపాలను పోగొట్టడానికి కూడా బిర్యానీ ఆకులు ప్రయోజకరంగా ఉంటాయి. ఇంటికి వాస్తు లోపాలు ఉంటే మీ ఇంటి పురోగతి ఆగిపోతుంది. ఇలాంటి పరిస్థితిలో రాత్రిపూట రెండు బిర్యానీ ఆకులను కాల్చి దూపం వేస్తే వాస్తు లోపాలు తొలగిపోతాయి. 
 

డబ్బుకు కొదవ ఉండదు.

మీ కుటుంబం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటుంటే ప్రతిరోజూ సాయంత్రం రెండు బిర్యానీ ఆకులను కాల్చండి. దీన్ని ఇంటి అంతటా తిప్పండి. ఇది డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలను పరిష్కరిస్తుంది.
 

click me!