Today Horoscope: ఈ రాశి వారు వేడుకలు, ధైవ కార్యాల్లో పాల్గొంటారు

Published : May 23, 2022, 06:30 AM IST

Today Horoscope: రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

PREV
113
Today Horoscope: ఈ రాశి వారు వేడుకలు, ధైవ కార్యాల్లో పాల్గొంటారు
Aries Zodiac

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-  

అధికారుల ఒత్తిడి. కొన్ని పనులు హఠాత్తుగా వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విభేదాలు. అకారణంగా కోపం.అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత.  వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట.దేవాలయ సందర్శన. సేవకుల వలన కొద్దిగా ఇబ్బందులు. సంఘంలో వాదోపవాదములు. గృహ సంబంధిత పనులలో ఆటంకాలు.
 

213
Taurus Zodiac

వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  

అనవసరమైన గొడవలు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో ధన నష్టం. తెరాస క్రయవిక్రయాలు వాయిదా వేసుకోవడం మంచిది. ప్రయాణాల్లో చోర భయం.

313
Gemini Zodiac

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  

ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి. సహోద్యోగులతో సఖ్యతగా మెలుగుతారు. మిత్రుల సహకారంతో చేయు పనులలో ఇబ్బందులు ఏర్పడతాయి. స్వయంకృషితో కష్టపడిన పనుల్లో విజయం సాధిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాల యందు సానుకూలత. మిత్రులతో చర్చాగోష్టి. కోర్టు వ్యవహారాల యందు విజయం సాధిస్తారు.

413
Cancer Zodiac

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.  కొన్ని పనులు హఠాత్తుగా వాయిదా. శ్రమాధిక్యం. బంధుమిత్రులతో విభేదాలు. అనారోగ్యం. కొత్త వ్యక్తుల పరిచయాలు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు లాభం. కొత్త ఆలోచనలు చేస్తారు. వస్తు వాహన ప్రాప్తి. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. రావలసిన బకాయిలు వసూలగును. సంఘంలో కీర్తి ప్రతిష్టలు.
 

513
Leo

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

శుభవార్తలు వింటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.   దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని ఇబ్బందులు.ఆకస్మిక ధన లాభం.వృత్తి, వ్యాపారాల యందు లాభం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. శుభ కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. పై అధికారుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. ప్రయాణాల్లో లాభాలు
 

613
Virgo


కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.  కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. వ్యాపారాలలో ఊహించని లాభాలు.  స్థిరాస్థి వృద్ధి చేస్తారు. అన్ని పనులకు అనుకూలం. వృత్తి,వ్యాపారాలలో లాభం. రావలసిన బకాయిలు వసూలగును. పోయిన వస్తువు దొరుకుట. సంఘంలో పెద్ద వారి ఆదరణ పొందుతారు. బంధుమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. దేవాలయ దర్శనం. దానధర్మాలు చేస్తారు.
 

713
Libra

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

వ్యాపార సంబంధ వ్యవహారాలలో ధన లాభం. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు అంతగా అనుకూలించవు. మానసిక అశాంతి. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ప్రయాణాలు కలిసి వస్తాయి. మంచి వ్యక్తులను కలుస్తారు.శుభవార్తలు వింటారు. క్రయవిక్రయాలకు అనుకూలం. గృహము నందు శుభకార్యములు. బంధు మిత్రుల కలయిక. సంఘంలో పేరు ప్రతిష్టలు. తలపెట్టిన కార్యములు పూర్తి చేస్తారు. ఆనందంగా గడుపుతారు.

813

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

అనవసరమైన ఆలోచనలు చేస్తారు. ఇతరులసహాయం తీసుకుంటారు. అనుకోని ఖర్చులు. కుటుంబంలో చికాకులు. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.వృత్తి,వ్యాపారాల యందు చిక్కులు. సంఘంలో గొడవలు. ఊహించని ఖర్చులు. రుణ బాధ. ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. పనులలో జాప్యం. ధనాదాయ మార్గాల అన్వేషణ చేస్తారు. కఠినంగా వ్యవహరిస్తారు. చేయు పనుల యందు తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆటంకాలు ఎదుర్కొంటారు.

913

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-

శుభవార్తలు వింటారు. మొండి బాకీలు వసూలు అవుతాయి. కళలయందు ఆసక్తి చూపుతారు. స్వతంత్రంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అనుకోని కలహాలు. ప్రయాణాలు. చెడుస్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార అభివృద్ధికి తగిన చర్చలు జరుపుతారు. కష్టపడి చేసిన పనులలో విజయం సాధిస్తారు.
 

1013
Capricorn

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 

బంధుమిత్రులతో కలహాలు. చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. వృత్తి వ్యాపారాలు కు అనుకూలంగా లేదు. జీవిత భాగస్వామితో సఖ్యతగా మెలగండి. రుణ శత్రుబాధలు. ఉద్యోగాలలో చికాకులు. సంఘాల్లో తెలివిగా వ్యవహరించండి. అనుకున్న పనులు ఆటంకాలు ఏర్పడతాయి

1113
Aquarius

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-

 ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. మీసేవలకు గుర్తింపు లభిస్తుంది. ప్రముఖ వ్యక్తుల పరిచయం. దేవాలయ సందర్శన. వృత్తి వ్యాపారాలలో లాభం. బంధుమిత్రుల కలయిక. ఇతరులకు సహాయం చేస్తారు. గృహము నందు సుఖసంతోషాలు. శుభవార్తా శ్రవణం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. అనేకరకాల ఆలోచనలతో విసుగు చెందుతారు. శుభకార్యానికి శ్రీకారం. తలపెట్టిన పనులలో ఎన్ని కష్టాలు ఎదురైనా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత.
 

1213

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

చేయు పనులయందు ఆటంకాలు. పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆర్థిక విషయాలు నిరుత్సాపరుస్తాయి. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు.ఎక్కువగా కష్టపడతారు. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో అపనిందలు . వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. అనవసరమైన పనుల యందు ఆసక్తి కనబరుస్తారు. శారీరక కష్టం. కోర్టు వ్యవహారాలలో నిరాశ.

1313

పంచాగం
23 మే 2022 సోమవారం

శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
కృష్ణపక్షం
 అష్టమి సాయంత్రం.04: 14ని.ల వరకు
శతభిషం నక్షత్రం రా.తె 02:45ని|| వరకు
వర్జ్యం ఉ.10:35ని.ల లగాయతు మ.12:07ని.లవరకు     
దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:22ని. లగాయతు మ.01:13ని.ల వరకు
తిరిగి మ.12:56ని.ల లగాయతు 03:48ని‌ల వరకు
రాహుకాలం ఉ. 07:30ని.ల లగాయతు ఉ. 09:00ని.ల వరకు
యమగండం ఉ. 10:30ని.ల లగాయతు మ.12:00ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:30ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:23ని.లకు.

 

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

Read more Photos on
click me!

Recommended Stories