Weekly Horoscope: ఈ వారం ఓ రాశివారికి ఆధాయ మార్గాలు పెరుగుతాయి..!

First Published | May 22, 2022, 10:00 AM IST

ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి  ఆధ్యాత్మిక చింతన.దేవాలయ దర్శనం. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. చేతి వృత్తి వ్యాపారులకు ధనలాభం.

Daily Horoscope 2022 - 25

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)

మేషం (అశ్విని 1,2,3,4 భరణి 1,2,3,4 కృత్తిక 1):

అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. నూతన వస్తు వాహన ప్రాప్తి. కుటుంబ సౌఖ్యం. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. అధికంగా ఖర్చు చేస్తారు. దేవాలయ దర్శనం. అన్నదమ్ముల సహకారం. శారీరక శ్రమ. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు వహించాలి.
 


వృషభం (కృత్తిక 2 3 4, రోహిణి 1 2 3 4, మృగశిర 1 2):

ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలం. వాహనాల కొనుగోలు కు అనుకూలం. శుభవార్తలు వింటారు. ప్రభుత్వానికి సంబంధించిన పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. శత్రువర్గంతో జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభకార్యాచరణ. స్థల విక్రయాలకు అనుకూలమైన వారం. వృత్తి, వ్యాపారాల యందు ధనలాభం. తలపెట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు.
 

మిథునం (మృగశిర 3 4, ఆరుద్ర 1 2 3 4, పునర్వసు 1 2 3):

ఆలోచించి ఖర్చు చేయవలెను. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలో సౌమ్యంగా వ్యవహరించాలి. ఆరోగ్యం విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. ఆస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు. రుణ శత్రు బాధలు. సంఘంలో గొడవలు. జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండవలెను. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగులకు పదోన్నతులు. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. సంఘంలో తెలివిగా వ్యవహరిస్తారు. శుభ కార్యాచరణ వలన ఖర్చు. అన్నదమ్ములతో కలహాలు. శారీరక చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలమైన వారం కాదు.
 

కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి 1 2 3 4, ఆశ్లేష 1 2 3 4):

ఖర్చు విషయంలో ఆచి తూచి వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు వహించాలి. జీవిత భాగస్వామితో సఖ్యతగా వ్యవహరించాలి. శారీరక కష్టం. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి,వ్యాపారాలకు సామాన్యం. బంధు మిత్రుల కలయిక. అవసరాలకు ఆదాయం లభిస్తుంది. ఉద్యోగంలో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ తట్టుకుని నిలబడతారు. ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కష్టించిన ఫలితం చేకూరును. విద్యార్థులకు అనుకూలం. గృహమునందు శుభ కార్యాచరణ. బంధు మిత్రుల సహాయసహకారాలు లభిస్తాయి.

సింహం (మఖ 1 2 3 4, పుబ్బ1 2 3 4, ఉత్తర 1):

ధనాదాయ మార్గాలు సామాన్యం. కుటుంబ వ్యవహారాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పై అధికారులతో చికాకులు. తలపెట్టిన కార్యములలో జాప్యం. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. రుణ శత్రు బాధలు. వ్యవహారాల విషయంలో జీవిత భాగస్వామితో చర్చించి తగు నిర్ణయాలు తీసుకొనవలెను. స్థిరాస్తి క్రయవిక్రయాలకు అనుకూలంగా లేదు. ఖర్చు విషయంలో ఆలోచించి వ్యవహరించాలి.
 

కన్య (ఉత్తర 2 3 4, హస్త 1 2 3 4, చిత్త 1 2):

బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. రావలసిన బకాయిలు వసూలగును. వృత్తి వ్యాపారాల యందు విశేష ధన లాభం. ధనాదాయ మార్గాలు బాగుంటాయి. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలం. సంఘంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. పై అధికారుల ఒత్తిడి. తల్లిదండ్రుల ఆరోగ్యం  విషయంలో జాగ్రత్త వహించవలెను. కుటుంబము నందు కలహాలు. మంచి పనులకు ధనం ఖర్చు చేస్తారు. ఊహించిన విజయానికి చేరువవుతారు. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ప్రయాణాల్లో జాగ్రత్త తీసుకోండి.
 

తుల (చిత్త 3 4, స్వాతి 1 2 3 4, విశాఖ 1 2 3):

ఈ రాశి వారికి ఈ వారం అన్ని పనులకు అనుకూలం.సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. ఆదాయ మార్గాలు బావుంటాయి. రావలసిన బకాయిలు వసూలు అగును. స్థిరాస్తి క్రయ విక్రయాలకు అనుకూలం. వస్తు వాహన ప్రాప్తి.  వృత్తి వ్యాపారాల్లో ధనలాభం.  తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను.చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. బంధుమిత్రులతో వైరం. ఆకస్మిక ధననష్టం. ప్రయాణాల యందు అలసట. వ్యాపార భాగస్వామి విషయంలో జాగ్రత్త వహించాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సమస్య పరిష్కారమవుతాయి. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి.

వృశ్చికం (విశాఖ 4, అనురాధ 1 2 3 4, జ్యేష్ఠ 1 2 3 4):

గృహమునందు ఆనందకర వాతావరణం. అవివాహితులకు వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనాదాయ మార్గాలు సామాన్యం. ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి. సంఘంలో తెలివిగా వ్యవహరించాలి. వృత్తి వ్యాపారాల్లో సామాన్యం. భూ గృహ క్రయవిక్రయాలకు అనుకూలమైన కాలం కాదు. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. మిత్రుల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన వ్యాపారాల ప్రారంభానికి అనుకూలంగా లేదు వాయిదా వేసుకోవడం మంచిది. మానసికంగా ధైర్యం గా ఉండవలెను. శత్రు బాధలు.

ధనస్సు (మూల 1 2 3 4 పూ.షాడ 1 2 3 4, ఉ.షాడ 1):

ఆధ్యాత్మిక చింతన.దేవాలయ దర్శనం. వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగులకు అనుకూలమైన కాలం. చేతి వృత్తి వ్యాపారులకు ధనలాభం. సంఘంలో గౌరవ ప్రతిష్టలు పొందుతారు. అన్నదమ్ముల సహకారం . ధనాదాయం మార్గాలు సామాన్యం. కొంతమేర ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవచ్చు. గృహ భూమి క్రయ విక్రయాల విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవలెను. అధిక ఖర్చులు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించవలెను.

మకరం (ఉ.షాడ 2 3 4, శ్రవణం 1 2 3 4, ధనిష్ట 1 2):

రుణ రోగ బాధలు. బంధుమిత్రులతో కలహాలు. సహోద్యోగులతో గొడవలు. వృత్తి వ్యాపారం సామాన్యం. చెడు స్నేహాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చు విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ధనాధాయ మార్గాలు సామాన్యం. గృహమునందు ప్రతికూల వాతావరణం. స్థిరాస్తి కొనుగోలు విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. తలపెట్టిన పనులలో అన్నదమ్ముల సహకారం తీసుకుంటే మంచిది.

కుంభం (ధనిష్ఠ 3 4, శతభిషం 1 2 3 4, పూ.భాద్ర 1 2 3):

ఆదాయ మార్గాలు బాగుంటాయి. కొంత మేర రుణాలు చేయవలసి వస్తుంది. రోగ శత్రు బాధలు. స్థిరాస్తి కొనుగోలు విషయంలో సామాన్యం. ఉద్యోగ, వృత్తి వ్యాపారులకు సామాన్యం. కుటుంబంలో ప్రతికూల వాతావరణం. సహోద్యోగులతో మనస్పర్ధలు. పై అధికారుల నుండి ఒత్తిడి. సంఘంలో తెలివిగా వ్యవహరించవలెను. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన. తలపెట్టిన పనులలో కొంతమేర విజయం సాధిస్తారు.

మీనం(పూ.భాద్ర 4, ఉ.భాద్ర 1 2 3 4, రేవతి 1 2 3 4):

ధనాదాయం మార్గాలు బాగున్నాయి. కుటుంబ వృద్ధి. తలపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంతానమునకు ఉన్నత ఉద్యోగ అవకాశాలు. స్థిరాస్తి క్రయ విక్రయాలు సామాన్యం. వృత్తి వ్యాపారం లకు సామాన్యం. కుటుంబ సభ్యుల సహకారం లభించును. సామాన్య జీవన విధానాన్ని గడుపుతారు. ఆరోగ్య విషయంలో తమ నిర్ణయాలు తీసుకుంటారు. అనవసరమైన ఖర్చులు. గృహమునందు శుభ కార్యాచరణ.

Latest Videos

click me!