Horoscope Today: ఓ రాశివారికి వ్యాపారంలో లాభాలు..!

First Published | May 22, 2022, 3:58 AM IST

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి. ఓ రాశివారికి అన్ని పనులకు అనుకూలం. వ్యాపార లాభం. రావలసిన బకాయిలు వసూలగును. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. 

Daily Horoscope 2022 - 13

జోశ్యుల విజయ రామకృష్ణ - ప్రముఖ  జ్యోతిష, జాతక, వాస్తు సిద్దాంతి, స్మార్త పండితులు - గాయిత్రి మాత ఉపాసకులు.(తిరుమల తిరుపతి దేవస్దాన పూర్వ విధ్యార్ది)  'శ్రీ మాతా' వాస్తు... జ్యోతిష్యం.   - ఫోన్:   8523814226  (సంప్రదించు వారు ...సాయింత్రం నాలుగు తర్వాత ఫోన్ చేయవలెను)
  
 రాశి చక్రంలోని పన్నెండు రాశులు వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది?  ఎవరికీ శుభం జరుగుతుంది..  వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయి.  ఎవరికి కలిసి వస్తుంది...ఎవరికీ నష్టాలుంటాయి. మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో  ఈ రోజు రాశి ఫలాలు లో తెలుసుకుందాం

మేషరాశి (Aries) అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం వారికి :-  

అన్ని పనులకు అనుకూలం. వ్యాపార లాభం. రావలసిన బకాయిలు వసూలగును. బంధువులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. పోగొట్టుకున్న వస్తువుల దొరుకుట. సంఘంలో గౌరవం. విందువినోదాలు. కార్యజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.  బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు.ఓం నమశ్శివాయ అని మంత్రమును 21 మార్లు జపించి శుభం జరుగును.


వృషభరాశి ( Taurus) కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదాల వారికి  :-  

శుభవార్తలు వింటారు. సోదరుల నుంచి సహాయం. ఉద్యోగయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు.  బంధువులతో సఖ్యత. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. కార్యాలకు శ్రీకారం చుడతారు. తలపెట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత. విద్యార్థులకు అనుకూలం. ఓందుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును. జరుగును

మిధునరాశి ( Gemini) మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదాల వారికి :-  


చేయు పనులయందు ఆలస్యం. అకారణంగా కోపం. అనుకోని ప్రయాణాలు. బంధువులు, మిత్రులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వ్యాపార విస్తరణలో అవరోధాలు. ఉద్యోగులకు విధుల్లో చికాకులు. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

కర్కాటకరాశి ( Cancer) పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష వారికి :- 

చేయు పనులయందు ఆటంకాలు. ఎక్కువగా కష్టపడతారు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి.  అవసరమైన ఆలోచనలు చేస్తారు. సంఘంలో గొడవలు. వృత్తి వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాలలోజాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయవిక్రయాల తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ అను మంత్రము 21 మార్లు జపించి నా శుభం జరుగును.

సింహరాశి (Leo) మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం వారికి :-

చేయు పనులయందు ఆలస్యం. అకారణంగా కోపం. బంధుమిత్రులతో కలహాలు. అనవసరంగా ధనాన్ని ఖర్చు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. ఉద్యోగ వ్యాపారాల యందు నిరాశ. ప్రయాణాల్లో కొత్త విషయాలు వింటారు. మానసిక ఒత్తిడి. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి :- 

బంధుమిత్రులను కలుస్తారు. ఇతరుల సహకారం తీసుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభవార్తలు వింటారు. ఆస్తిలాభం. వృత్తి వ్యాపారాల యందు లాభం. నూతన వస్తు వాహన ప్రాప్తి. సంఘంలో జాగ్రత్తగా వ్యవహరించవలెను. అనుకోని ఖర్చులు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించవలెను. ఓ మహాలక్ష్మీ నమః అనే మంత్రమును 21 మార్లు జపించినా శుభం జరుగును.

తులారాశి ( Libra) చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదాల వారికి :- 

చేయి పనులయందు ఆటంకములు. ఎక్కువగా కష్టపడతారు. ఇతరమైన ఆలోచనలు చేస్తారు. వృత్తి వ్యాపారాల యందు అవాంతరాలు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. రుణాలు చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. దైవదర్శనాలు. సోదరులతో విభేదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం  ప్రయాణాల్లో జాగ్రత్తలు తీసుకొనవలెను. క్రయ విక్రయాల యందు తెలివిగా వ్యవహరించవలెను. మానసిక ఒత్తిడి. ఓం నమశ్శివాయ మంత్రమును 21 మార్లు జపించినా శుభం జరుగును

వృశ్చికరాశి ( Scorpio) విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట నక్షత్రాల వారికి :- 

అనవసర ఆలోచనలు చేస్తారు. ఇతరుల సహాయం తీసుకుంటారు.  బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆరోగ్య, కుటుంబ సమస్యలు. ప్రయాణాలలో మార్పులు. వ్యాపారాలు ముందుకు సాగవు.  వృత్తి వ్యాపారంలో  చిక్కులు. ఊహించని ఖర్చులు. రుణబాధలు. ప్రయాణంలో జాగ్రత్త తీసుకొనవలెను.  పనులలో జాప్యం. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రము 21 సార్లు జపించిన శుభం జరుగును.
 

ధనుస్సు రాశి  ( Sagittarius) మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం వారికి :-


అనవసర ఖర్చులు. పనుల యందు నిరాసక్తత. కారణంగా కోపం. ప్రియతముల, చిన్నారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. ఆత్మీయులను విమర్శించుట వలన సమస్యలు తలెత్తుతాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి అధికమవుతుంది. ఎవరినీ అతిగా విశ్వసించటం మంచిదికాదు. వస్తు వాహన ప్రాప్తి. పోయిన వస్తువు తిరిగి లభించుట. అధికారులతో ఇబ్బందులు. ఓం సుబ్రహ్మణ్యాయ నమః అను మంత్రమును 21 మార్లు జపించి నా శుభం జరుగును.

మకరరాశి ( Capricorn) ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదాల వారికి :- 


 అవసరమైన గొడవలు. మానసిక ఒత్తిడి. చెడు స్నేహాలకు దూరంగా ఉండవలెను.  కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో నిలదొక్కుకోవటానికి అహర్నిశలు శ్రమించాల్సి ఉంటుంది. దంపతుల మధ్య చిన్న చిన్న అభిప్రాయభేధాలు తలెత్తవచ్చు. కష్టించిన పనులలో లాభం చేకూరును. సమస్యలు ఏర్పడతాయి. అవసరమైన ఆలోచనలు చేస్తారు. ఉద్యోగ వ్యాపారాలలో సామాన్యంగా ఉంటుంది. ఓం దుర్గాయై నమః అను మంత్రమును 21 సార్లు జపించిన శుభం జరుగును.
 

కుంభరాశి  ( Aquarius) ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాల వారికి :-

నిస్సత్తువ. చేయి పనులయందు నిదానం. మానసిక ఆందోళన. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జార విడచుకుంటారు. స్త్రీలకు ఆరోగ్యంలో తగు జాగ్రత్తలు అవసరం. వేడుకలు, దైవకార్యాల్లో పాల్గొంటారు.  అనుకోని ఖర్చులు. ప్రభుత్వ పనులు సానుకూలం. వృత్తి వ్యాపారాలలో సామాన్యం. సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకు అనుకూలం. ఓం సూర్యాయ నమః అనే మంత్రమును 21 మార్లు జపించినా శుభం జరుగును

మీనరాశి ( Pices) పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి వారికి :-

మానసిక ఒత్తిడి. బంధు మిత్రులను కలుస్తారు.  పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. విందువినోదాలు. ఆప్తుల సలహాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు. అనవసరమైన ఆలోచనలు చేస్తారు. బంధు మిత్రులను కలుస్తారు. శారీరక బాధలు. తలపెట్టిన పనులు పూర్తి కాకపోవడం చేత మానసిక ఆందోళన. చెడు సావాసాలకు దూరంగా ఉండవలెను. ఓం దుర్గాయై నమః అనే మంత్రమును 21 మార్లు జపించిన శుభం జరుగును.

పంచాగం
22 మే 2022 ఆదివారం

శుభకృత్ నామ సంవత్సరం
ఉత్తరాయణం
వైశాఖ మాసం
కృష్ణపక్షం
సప్తమి సాయంత్రం 06:02ని‌.ల వరకు
ధనిష్ట నక్షత్రం రా.తె 03:39ని|| వరకు
వర్జ్యం ఉ.08:38ని.ల లగాయతు ఉ.10:10ని.లవరకు     
దుర్ముహూర్తం సాయంత్రం 04:39ని. లగాయతు ఉ.05:30ని.ల వరకు
రాహుకాలం సాయంత్రం. 04:30ని.ల లగాయతు సాయంత్రం. 06:00ని.ల వరకు
యమగండం మధ్యాహ్నం 12:00ని.ల లగాయతు మ.01:30ని.ల వరకు
సూర్యోదయం ఉదయం 5:30ని.లకు
సూర్యాస్తమయం సాయంత్రం 6:22ని.లకు.

Latest Videos

click me!